
నీనా గుప్తా
లాక్‌డౌన్‌లో ఒక్కొక్కరూ ఒక్కో పనిలో బిజీగా ఉంటే బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా ఆమె బయోగ్రఫీ పూర్తి చేయడంలో బిజీగా ఉన్నారట. ఈ విషయాన్ని గురువారం ప్రకటించారు. దీని గురించి మాట్లాడుతూ –‘‘మీ ఆత్మకథ ఎందుకు రాయకూడదు? అని చాలా మంది చాలాసార్లు నన్ను అడిగారు. కానీ నేనంత ఎక్స్‌ట్రార్డనరీ పనేం చేయలేదు కదా అని రాయాలనుకోలేదు.
కరోనా వల్ల ఇంటికే పరిమితం కావడంతో రాయాల్సి వచ్చింది.. రాసేశాను. జనం చదువుతారో లేదో నాకు తెలియదు. చదివితే నచ్చుతుందో లేదో తెలియదు. నా ఆటోబయోగ్రఫీ నాలుగైదు నెలల్లో బయటకు రాబోతోంది. ఒకవేళ కుదిరితే చదవండి. బోర్‌గా అనిపిస్తే పక్కన పెట్టేయండి. నా ఆటోబయోగ్రఫీ పేరు ‘సచ్ కహు తో (నిజం చెప్పాలంటే)’’ అన్నారు నీనా గుప్తా.
Comments
Please login to add a commentAdd a comment