
ఆత్మకథ రాస్తున్న సానియా మీర్జా
ఇండోర్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కూడా తన జీవితచరిత్రను పుస్తక రూపంలో తీసుకు రానుంది. త్వరలోనే ఇది మార్కెట్లోకి వస్తుందని సానియా స్వయంగా వెల్లడించింది.
ఇండోర్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కూడా తన జీవితచరిత్రను పుస్తక రూపంలో తీసుకు రానుంది. త్వరలోనే ఇది మార్కెట్లోకి వస్తుందని సానియా స్వయంగా వెల్లడించింది. ‘నా ఆటోబయోగ్రఫీలో ఇప్పటికే 26 అధ్యాయాలు రాయడం పూర్తి చేశాను. కొత్త అంశాలు చేరుస్తూ రావడం వల్ల పుస్తకం రావడం ఆలస్యమవుతోంది.
ఎక్కడ ముగించాలి అనేదానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాను’ అని సానియా చెప్పింది. తన గురించి, కెరీర్ గురించి ఎన్నో నిజాలు, అబద్ధాలు వినిపించాయని వాటన్నింటికీ ఇందులో సమాధానం లభిస్తుందని ఆమె వెల్లడించింది.