30న తెరపైకి ఎంఎస్.ధోని
భారత క్రికెట్ క్రీడాకారుడు ఎంఎస్.ధోని జీవితం ఒక సంచలనమే కాదు ఈ తరం యువతకు గొప్ప స్ఫూర్తి కూడా. వీధి క్రికెట్ క్రీడగా పేర్కొనే రంజీ ట్రోఫీ నుంచి ప్రపంచ స్థాయి గొప్పక్రీడాకారుడిగా చరిత్ర కెక్కిన ధోని 2011లో భారత క్రికెట్ క్రీడ జట్టుకు కెప్టెన్‌గా సారథ్యం వహించి ప్రపంచ కప్‌ను సాధించి కోట్లాది మంది క్రికెట్ అభిమానుల కలను నిజం చేశారు. పలు మైలు రాళ్లను అధిగమించిన అసాధారణ క్రీడాకారుడు ధోని.
ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన మహేంద్రసింగ్ ధోనీని ఆయన తండ్రి బాగా చదువుకుని మంచి ఉద్యోగస్తుడిగా చూడాలనుకున్నారు. అయితే ధోనిలో మంచి క్రికెట్ కీపర్ ఉన్నాడని ఆయన పాఠశాల శిక్షకుడు భావించారు. అలా పలువురు శిక్షకుల ఆకాంక్ష, స్నేహితుల ప్రోత్సాహం ధోనీని ఒక గొప్ప క్రికెట్ కెప్టెన్‌గా నిలబెట్టాయి.ధోనికి భారతదేశంపై అపార ప్రేమ. ఆయన జీవిత చరిత్రతో తెరకెక్కిన చిత్రం ఎంఎస్.ధోని. నీరజ్‌పాండే దర్శకత్వం వహించిన ఈ చిత్న్రా స్టార్‌స్టూడియోస్ సమర్పణలో ఇన్‌స్పైర్డ్ ఎంటర్‌టెయిన్‌మెంట్స్, ఫ్రైడ్ ఫిల్మ్‌వర్క్స్ సంస్థలు నిర్మించాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 30న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది.