ముంబై: పంజాబ్ యువ గాయకుడు, దివంగత సిద్దూ మూసేవాలా జీవితగాథ త్వరలో సినిమాగా తెరకెక్కే అవకాశముంది. సిద్దూ మూసేవాలా తన జీవితంలో చవిచూసిన పేరుప్రఖ్యాతలు, గ్యాంగ్‌స్టర్ల బెదిరింపులు, విషాదం అన్నింటినీ స్పృశిస్తూ జుపిందర్‌జీత్ సింగ్ రాసిన ‘హూ కిల్డ్ మూసేవాలా? ది స్పైరలింగ్ స్టోరీ ఆఫ్ వాయలెన్స్ ఇన్ పంజాబ్’ పుస్తకంపై హక్కులను చిత్ర నిర్మాణరంగ సంస్థ మ్యాచ్‌బాక్స్ షాట్స్ కొనుగోలుచేసింది.
మూసేవాలా జీవితాన్ని వెబ్ సిరీస్‌గా లేదంటే సినిమాగా తెరకెక్కించే అవకాశముంది. ‘శుభ్‌దీప్ సింగ్ సిద్దూ.. సిద్దూ మూసేవాలాగా ఎదిగిన క్రమాన్ని ఈ పుస్తకం అద్భుతంగా ఆవిష్కరించింది. పంజాబ్‌లో గ్యాంగ్‌స్టర్ల ఆధిపత్యం, వారి మధ్య మనస్పర్థలు, మాదకద్రవ్యాల వినియోగం, పంజాబ్‌లో సంగీత ప్రపంచం వెనుక దాగి ఉన్న చీకటి కోణాలనూ ఈ పుస్తకం చూపించింది’ అని మ్యాచ్‌బాక్స్ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment