ఒకపుడు సూపర్‌స్టార్, ఇండియాలోనే రిచెస్ట్ యాక్టర్‌గా పాపులర్. చెయ్యెత్తి దణ్నం పెట్టేంత అందం, అభినయం. కానీ భర్త చేతిలో అవమానాలు, హింసకు గురై, మద్యపానానికి అలవాటుపడి, కడు దయనీయ పరిస్థితిలో మరణించింది. ఇంతకీ ఎవరా మహానటి?
లెజెండరీ నటి, రీల్ ట్రాజెడీ క్వీన్ గా పేరొందిన మీనా కుమారి జీవితం విషాదంగానే ముగిసింది. అందుకే మీనా కుమారి మరణం తరువాత మరో పాపులర్ నటి నర్గీస్ 'మౌత్ ముబారక్ హో మీనా, ఈ ప్రపంచం మీలాంటి వారి కోసం కాదు' అంటూ కామెంట్ చేసిందంటే.. ఆమె జీవితంలోని విషాదాన్ని అర్థం చేసుకోవచ్చు.
మీనా కుమారి ఆగస్టు 1, 1933న జన్మించారు. ఆమె అసలు పేరు మహ్జబీన్ బనో. ఆమెకు ‘నాజ్’, ‘మున్నా’ అనే ముద్దు కూడా పేర్లున్నాయి. అందానికి అచ్చమైన నిదర్శనంగా ఉండే మీనాకుమారి నాలుగేళ్లకే నటనా జీవితంలోకి ప్రవేశించారు. బాలీవుడ్ సినిమాల్లో అంకితభావంతో పనిచేసి, నటనలో తనదైన ప్రతిభను చాటకున్నారు. నటిగా ఆమె కన్నీటి వాకిళ్లు, ఆమె జీవితంలో జలపాతాలయ్యాయంటే అతిశయోక్తికాదు. దిలీప్ కుమార్, రాజ్ కుమార్ లాంటి దిగ్గజ నటులే ఆమె ముందు అభినయించడానికి జంకేవారట. సత్యజిత్ రే లాంటి దిగ్గజ దర్శకులు ఆమె అభినయ ప్రతిభకు ఫిదా అయిపోయేవారట.
30 ఏళ్ల కరియర్‌లో ఎన్నోమైలురాళ్లు, మరోన్నో బ్లాక్‌బస్లర్ సినిమాలు. దాదాపు అన్నీ క్లాసిస్ మూవీలే. బైజు బావరా, ఫాకీజా. సాహెబ్, బీబీ ఔర్ గులాం, మేరే అప్నే,పరిణీత, దిల్ అప్నా ఔర్ ప్రీత్, పరాయి, ఫుట్ పాత్, ఫూల్ ఔర్ పత్తర్, ఆజాద్ ఇలాంటి ఎన్నో సూపర్ హిట్లు. దాదాపు 90 సినిమాల్లో నటించారు. ఇక ప్రశంసలు, అవార్డులు, సంపదకు లెక్కే లేదు. ఆ రోజుల్లోనే ఇంపాలా కారు కొన్న ఏకైక నటి మీనా కుమారి.
కానీ చిత్రనిర్మాత కమల్ అమ్రోహితో పెళ్లి మీనా కుమారి జీవితాన్ని అతలాకుతలం చేసింది. 1960లో కిషోర్ సాహు దర్శకత్వంలో కమల్ అమ్రోహి నిర్మించిన ‘దిల్ అప్నా అవుర్ ప్రీత్ పరాయీ’ సినిమా పెద్ద మలుపు అని చెప్పవ చ్చు. అలా మొదలైన పరిచయం 1952లో వివాహానికి దారి తీసింది. అప్పటినుంచి మీనా కుమారి నటిస్తున్న చిత్రనిర్మాతలతో సినిమా స్క్రిప్ట్‌ల విషయంలో జోక్యం చేసుకునేవాడు కమల్. కెరీర్‌కు అనేక ఆటంకాలు, తదితర అనేక వైరుధ్యాలు తారాస్థాయికి చేరాయి. విడాకులకు దారి తీసింది.
ముఖ్యంగా మీనా కుమారి దిలీప్ కుమార్ సరసన ఖరారైన తరువాత,ఆమె ఔట్ డోర్ షూటింగ్‌లకు రాదు అంటూ బిమల్ రాయ్ ఆఫీసుకెళ్లి మరీ బెదిరించాడు. దీంతో ఈ ఐకానిక్ పాత్ర సుచిత్రా సేన్ దక్కించుకుంది. చివరికి వివాహం అయిన 10 ఏళ్ల తరువాత 1964లో విడాకులు మీనా-కమల్ జంట తీసుకున్నారు. ఇక ఆ తరువాత ఆమె మద్యానికి బానిసైంది. డిప్రెషన్‌కు లోనైంది. నిద్ర పట్టక ఇబ్బంది పడేది. అపుడు కొద్దిగా బ్రాందీ తీసుకోమని డాక్టర్ సలహా ఇచ్చాడట. అదే కొంపముంచింది. ఆమె నటించిన చివరిదీ, సూపర్ డూపర్ మూవీ పాకీజా విడుదలైన మూడు వారాలకే మీనా కుమారి తీవ్ర అస్వస్థతతో కోమాలోకి వెళ్లి పోయి 38 ఏళ్లకే 1972 మార్చి 31న ఈ ప్రపంచం నుంచి శాశ్వతంగా సెలవు తీసుకుంది. ఆసుపత్రి బిల్లు రూ. 3,500 చెల్లించేందుకు కూడా ఆమె వద్ద డబ్బులు లేని దుర్భర స్థితిలో సినిమా దేవత కన్నుమూయడం అంతులేని విషాదం.
మరిన్ని సంగతులు
♦ కవయిత్రి అయిన మీనా కుమారి ‘నాజ్’ అనే మారుపేరుతో ఉర్దూ కవితలు రాసేది.
♦మీనా కుమారిని కమల్ అమ్రోహికి పరిచయం చేసిన కిషోర్ కుమార్ సోదరుడు అశోక్ కుమార్.
♦ మీనా కుమారి మే 21, 1951లో యాక్సిడెంట్, నాలుగు నెలల పాటు ఆసుపత్రిలో, ఆ సందర్బంగా ఇద్దరి మధ్యా ప్రేమ,
♦ 18 ఏళ్లకే ఫిబ్రవరి 14, 1952న మీనా సోదరి మహిలికా సమక్షంలో కమల్ అమ్రోహి తో రహస్య నిఖా
♦ కమల్‌కు అప్పటికే పెళ్లి, ముగ్గురు పిల్లలు
Comments
Please login to add a commentAdd a comment