Meena Kumari
-
కమల్ ఔర్ మీనా
దివంగత ప్రముఖ హీరోయిన్ మీనాకుమారి జీవితం ఆధారంగా ‘కమల్ ఔర్ మీనా’ సినిమా తెరకెక్కనుంది. బుధవారం ఈ సినిమా అధికారిక ప్రకటన వెలువడింది. అయితే ‘కమల్ ఔర్ మీనా’ సినిమా మీనా కుమారి పూర్తిస్థాయి బయోపిక్ కాదని బాలీవుడ్ సమాచారం. దివంగత ప్రముఖ దర్శకుడు కమల్ అమ్రోహీ (మీనాకుమారి భర్త)తో మీనా పరిచయం, కమల్–మీనల ప్రేమ, పెళ్లి సంగతులు, వారి కాంబినేషన్ లో వచ్చిన హిట్ ఫిల్మ్ ‘΄ాకీజా’ (1972) విశేషాలతో ఈ చిత్రం ఉంటుందట. ‘మహారాజ్’ సినిమా ఫేమ్ సిద్ధార్థ్ పి.మల్హోత్రా ఈ సినిమాకు దర్శకుడు. బిలాల్ అమ్రోహీ (కమల్ అమ్రోహీæ మనవడు), రోహన్ దీప్ సింగ్, సారేగమ సంస్థ నిర్మించనున్న ఈ సినిమా చిత్రీకరణ వచ్చే ఏడాది ్ర΄ారంభమై, 2026లో రిలీజ్ కానుంది. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. -
సవతి తల్లి.. అర్థాన్నే మార్చేసింది, నాన్న ఆమెను కొట్టలేదు!
విషాద పాత్రలు పోషించడం, విషాదభరితమైన సీన్లు రక్తికట్టించడం అంత ఈజీ కాదు. కానీ అటువంటి పాత్రలను అలవోకగా చేసి ట్రాజెడీ క్వీన్ ఆఫ్ బాలీవుడ్‌గా కీర్తి గడించింది మీనా కుమారి. కానీ తన జీవితంలో కూడా అంతే ట్రాజెడీ ఉంటుందని బహుశా ఆమె కలలో కూడా ఊహించి ఉండకపోవచ్చు. సినిమాల ద్వారా పేరు, డబ్బు సంపాదించింది కానీ ప్రేమ, పెళ్లి వల్ల తన జీవితాన్నే నాశనం చేసుకుంది. ఫస్ట్ లవ్.. మీనా కుమారి.. ధర్మేంద్రను తొలిచూపులోనే ప్రేమించింది. అటు ధర్మేంద్ర ఆమెను గురువుగా, గైడ్‌గా భావించేవాడు. చివరికి ఆమె ప్రేమను అర్థం చేసుకున్నాడు. కానీ ఆమెకు నచ్చినట్లుగా కాకుండా తనకు నచ్చినట్లుగానే ఉండేవాడు. అలా మూడేళ్లకే బంధం ముగిసిపోవడంతో మీనా కుమారి మందుకు బానిసైంది. ఆ సమయంలో దర్శకుడు కమల్ ఆమ్రోహి ఆమెకు దగ్గరయ్యాడు. అతడి సినిమా అనార్కలి కోసం మహాబలేశ్వర్ వెళ్తుంటే రోడ్డు ప్రమాదంలో గాయపడింది. మూడు నెలలు ఆస్పత్రిలో ఉంటే ఆమె బాగోగులు చూసుకున్నాడు కమల్. అటు అనార్కలి సినిమా అటకెక్కింది. ఇటు మీనా, కమల్ల స్నేహం, ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకున్నారు. అప్పటికే కమల్‌కు పెళ్లయి పిల్లలున్నారు. పైగా ఆమె కంటే 16 ఏళ్లు పెద్దవాడు కూడా! తాగుడుకు అలవాటై పెళ్లి తర్వాత తనకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. సాయంత్రం ఆరున్నరకల్లా ఇంటికి చేరుకోవాలని ఆదేశాలు.. తను పంపిన కారులోనే షూటింగ్ వెళ్లిరావాలని ఆంక్షలు.. కోస్టార్స్‌తో చనువుగా కనిపించొద్దని నిబంధనలు.. ఆమెను గమనించేందుకు ఓ వ్యక్తినీ నియమించాడు. అతడి పొసెసివ్‌నెస్ భరించలేకపోయింది. ఎనిమిదేళ్లకే ఇద్దరూ విడిపోయారు. మళ్లీ మద్యానికి బానిసై లివర్ సిర్రోసిస్ వ్యాధి బారిన పడింది. 38 ఏళ్లకే మరణించింది. నేడు(మార్చి 31) ఆమె వర్ధంతి. మీనా కుమారి, కమల్ ఆమ్రోహి దుష్ప్రచారం ఈ సందర్భంగా మీనా భర్త కమల్ అమ్రోహి మొదటి భార్య కుమారుడు తాజ్దార్ ఆమ్రోహి.. నటితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. అతడు మాట్లాడుతూ.. మా నాన్న- పిన్ని(మీనా) విడాకులు తీసుకోలేదు. భేదాభిప్రాయాల వల్ల విడివిడిగా జీవించారంతే! నాన్న.. పిన్నిని కొట్టాడని దుష్ప్రచారం చేశారు. ఆయన ఏనాడూ తనపై చేయి చేసుకోలేదు. ఆరేళ్ల వయసులో సవతి తల్లిదగ్గరకు వెళ్లాను. ఆ తర్వాత ఎన్నడూ మళ్లీ ఇంటికి వెళ్లలేదు. కన్నతల్లి కూడా గుర్తురానంత ప్రేమను పంచింది. ఉత్తరాలు, బహుమతులు నేను లేకుండా నిద్రపోయేదే కాదు. తన కారు వచ్చిందనగానే పరుగెత్తుకుంటూ వెళ్లేవాడిని. విద్యాభ్యాసం కోసం డెహ్రాడూన్ వెళ్లినప్పుడు నాకోసం ఉత్తరాలు రాసేది, బహుమతులు పంపేది. నాకేదైనా కావాలంటే వెంటనే పంపించేది. నేను అక్కడ ఉన్నప్పుడే వాళ్లు విడిపోయారు. నాన్న గురించి పిన్నికి లేనిపోనివి చెప్పి విడగొట్టేలా చేసినవారెవరో కూడా నాకు తెలుసు. కానీ నాకు చెప్పకుండా ఇంట్లో నుంచి ఎందుకు వెళ్లిపోయిందని కోపం ఉండేది. తాజ్దార్ ఆమ్రోహి, మీనా కుమారి తనమీద కోపం తను అనారోగ్యంతో ఉన్నప్పుడు నన్ను చూడాలనుందంటే వెళ్లాను. అది 1967.. తను నన్ను చూసిన చూపు ఎప్పటికీ మర్చిపోలేను (ఏడుస్తూ..). అనారోగ్యం వల్ల జుట్టంతా ఊడిపోయింది. బెడ్‌పై నుంచి లేవడానికి ప్రయత్నిస్తోంది కానీ తన వల్ల కావడం లేదు. నేను వెళ్లి తనను కూర్చోబెట్టాను. నా మీద కోపంగా ఉన్నావా? అంటూ నా తల నిమురుతూ ప్రేమ కురిపించింది. సవతి తల్లి అనే పదానికి ఉన్న అర్థాన్నే ఆవిడ మార్చేసింది. కాస్త కోలుకున్నాక.. నాకోసమే ఆగిపోయిన పాకీజా సినిమాను మా నాన్నతో కలిసి పూర్తి చేసింది' అని చెప్పుకొచ్చాడు. చదవండి: మాజీ గర్ల్‌ఫ్రెండ్స్‌కు అమ్మ నగలు గిఫ్టిచ్చేవాడిని.. పెళ్లిలో.. -
సూపర్ స్టార్.. సూపర్ కార్.. చివరికి, అంతులేని విషాదం!
ఒకపుడు సూపర్‌స్టార్, ఇండియాలోనే రిచెస్ట్ యాక్టర్‌గా పాపులర్. చెయ్యెత్తి దణ్నం పెట్టేంత అందం, అభినయం. కానీ భర్త చేతిలో అవమానాలు, హింసకు గురై, మద్యపానానికి అలవాటుపడి, కడు దయనీయ పరిస్థితిలో మరణించింది. ఇంతకీ ఎవరా మహానటి? లెజెండరీ నటి, రీల్ ట్రాజెడీ క్వీన్ గా పేరొందిన మీనా కుమారి జీవితం విషాదంగానే ముగిసింది. అందుకే మీనా కుమారి మరణం తరువాత మరో పాపులర్ నటి నర్గీస్ 'మౌత్ ముబారక్ హో మీనా, ఈ ప్రపంచం మీలాంటి వారి కోసం కాదు' అంటూ కామెంట్ చేసిందంటే.. ఆమె జీవితంలోని విషాదాన్ని అర్థం చేసుకోవచ్చు. మీనా కుమారి ఆగస్టు 1, 1933న జన్మించారు. ఆమె అసలు పేరు మహ్జబీన్ బనో. ఆమెకు ‘నాజ్’, ‘మున్నా’ అనే ముద్దు కూడా పేర్లున్నాయి. అందానికి అచ్చమైన నిదర్శనంగా ఉండే మీనాకుమారి నాలుగేళ్లకే నటనా జీవితంలోకి ప్రవేశించారు. బాలీవుడ్ సినిమాల్లో అంకితభావంతో పనిచేసి, నటనలో తనదైన ప్రతిభను చాటకున్నారు. నటిగా ఆమె కన్నీటి వాకిళ్లు, ఆమె జీవితంలో జలపాతాలయ్యాయంటే అతిశయోక్తికాదు. దిలీప్ కుమార్, రాజ్ కుమార్ లాంటి దిగ్గజ నటులే ఆమె ముందు అభినయించడానికి జంకేవారట. సత్యజిత్ రే లాంటి దిగ్గజ దర్శకులు ఆమె అభినయ ప్రతిభకు ఫిదా అయిపోయేవారట. 30 ఏళ్ల కరియర్లో ఎన్నోమైలురాళ్లు, మరోన్నో బ్లాక్‌బస్లర్ సినిమాలు. దాదాపు అన్నీ క్లాసిస్ మూవీలే. బైజు బావరా, ఫాకీజా. సాహెబ్, బీబీ ఔర్ గులాం, మేరే అప్నే,పరిణీత, దిల్ అప్నా ఔర్ ప్రీత్, పరాయి, ఫుట్ పాత్, ఫూల్ ఔర్ పత్తర్, ఆజాద్ ఇలాంటి ఎన్నో సూపర్ హిట్లు. దాదాపు 90 సినిమాల్లో నటించారు. ఇక ప్రశంసలు, అవార్డులు, సంపదకు లెక్కే లేదు. ఆ రోజుల్లోనే ఇంపాలా కారు కొన్న ఏకైక నటి మీనా కుమారి. కానీ చిత్రనిర్మాత కమల్ అమ్రోహితో పెళ్లి మీనా కుమారి జీవితాన్ని అతలాకుతలం చేసింది. 1960లో కిషోర్ సాహు దర్శకత్వంలో కమల్ అమ్రోహి నిర్మించిన ‘దిల్ అప్నా అవుర్ ప్రీత్ పరాయీ’ సినిమా పెద్ద మలుపు అని చెప్పవ చ్చు. అలా మొదలైన పరిచయం 1952లో వివాహానికి దారి తీసింది. అప్పటినుంచి మీనా కుమారి నటిస్తున్న చిత్రనిర్మాతలతో సినిమా స్క్రిప్ట్‌ల విషయంలో జోక్యం చేసుకునేవాడు కమల్. కెరీర్‌కు అనేక ఆటంకాలు, తదితర అనేక వైరుధ్యాలు తారాస్థాయికి చేరాయి. విడాకులకు దారి తీసింది. ముఖ్యంగా మీనా కుమారి దిలీప్ కుమార్ సరసన ఖరారైన తరువాత,ఆమె ఔట్ డోర్ షూటింగ్‌లకు రాదు అంటూ బిమల్ రాయ్ ఆఫీసుకెళ్లి మరీ బెదిరించాడు. దీంతో ఈ ఐకానిక్ పాత్ర సుచిత్రా సేన్ దక్కించుకుంది. చివరికి వివాహం అయిన 10 ఏళ్ల తరువాత 1964లో విడాకులు మీనా-కమల్ జంట తీసుకున్నారు. ఇక ఆ తరువాత ఆమె మద్యానికి బానిసైంది. డిప్రెషన్‌కు లోనైంది. నిద్ర పట్టక ఇబ్బంది పడేది. అపుడు కొద్దిగా బ్రాందీ తీసుకోమని డాక్టర్ సలహా ఇచ్చాడట. అదే కొంపముంచింది. ఆమె నటించిన చివరిదీ, సూపర్ డూపర్ మూవీ పాకీజా విడుదలైన మూడు వారాలకే మీనా కుమారి తీవ్ర అస్వస్థతతో కోమాలోకి వెళ్లి పోయి 38 ఏళ్లకే 1972 మార్చి 31న ఈ ప్రపంచం నుంచి శాశ్వతంగా సెలవు తీసుకుంది. ఆసుపత్రి బిల్లు రూ. 3,500 చెల్లించేందుకు కూడా ఆమె వద్ద డబ్బులు లేని దుర్భర స్థితిలో సినిమా దేవత కన్నుమూయడం అంతులేని విషాదం. మరిన్ని సంగతులు ♦ కవయిత్రి అయిన మీనా కుమారి ‘నాజ్’ అనే మారుపేరుతో ఉర్దూ కవితలు రాసేది. ♦మీనా కుమారిని కమల్ అమ్రోహికి పరిచయం చేసిన కిషోర్ కుమార్ సోదరుడు అశోక్ కుమార్. ♦ మీనా కుమారి మే 21, 1951లో యాక్సిడెంట్, నాలుగు నెలల పాటు ఆసుపత్రిలో, ఆ సందర్బంగా ఇద్దరి మధ్యా ప్రేమ, ♦ 18 ఏళ్లకే ఫిబ్రవరి 14, 1952న మీనా సోదరి మహిలికా సమక్షంలో కమల్ అమ్రోహి తో రహస్య నిఖా ♦ కమల్‌కు అప్పటికే పెళ్లి, ముగ్గురు పిల్లలు -
Meena Kumari biopic: విషాద నటి బయోపిక్ నిజమే
హిందీ చిత్రసీమలో విషాద పాత్రల్లో మెప్పించిన అలనాటి నటి ఎవరు అంటే? ‘మీనా కుమారి’ పేరు చెబుతారు. తన అందం, అభినయంతో నాటి తరం ప్రేక్షకులను అలరించారు మీనా కుమారి. ప్రస్తుతం ఆమె బయోపిక్ రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. బాలీవుడ్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని వార్తలు వచ్చాయి. తాజాగా, ఈ బయోపిక్ గురించి మనీషా మల్హోత్రా మాట్లాడుతూ– ‘‘ఏ చిత్రానికైనా కథే కీలకం. బయోపిక్‌లకి మరీను. మీనా కుమారి మీద వచ్చిన పుస్తకాల ఆధారంగా కథ తయారు చేస్తున్నా’’ అన్నారు. ఇటీవల రిలీజైన∙‘ఆది పురుష్’లో సీత పాత్ర చేసిన కృతీ సనన్ ‘మీనా కుమారి’ బయోపిక్‌లో టైటిల్ రోల్ చేయనున్నారు. ఇదిలా ఉంటే.. మీనా కుమారి బయోపిక్ తీయడానికి ఆమె కుటుంబ సభ్యులు సుముఖంగా లేరని భోగట్టా. -
నా కోడలు బంగారం అంటున్న నయనతార అత్త!
సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా వెలుగొందుతోంది నయనతార. కోలీవుడ్‌లో టాప్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు విఘ్నేశ్ శివన్. ఈ ఏడాదే పెళ్లి చేసుకున్న వీరు ఇటీవలే సరోగసి ద్వారా కవలలకు తల్లిదండ్రులయ్యారు. ఇదిలా ఉంటే తాజాగా నయనతారను పొగడ్తలతో ముంచెత్తించింది ఆమె అత్తయ్య, విఘ్నేశ్ తల్లి మీనా కుమారి. విఘ్నేశ్ తల్లి మీనా కుమారి మాట్లాడుతూ.. 'నా కొడుకు సక్సెస్ఫుల్ డైరెక్టర్, నా కోడలు టాప్ హీరోయిన్. ఇద్దరూ కష్టపడి పని చేసేవారే! నయనతార ఇంట్లో ఎనిమిది మంది పనివాళ్లు ఉన్నారు. అందులో ఒకరికి నాలుగు లక్షల అప్పు ఉందని తెలిసి వెంటనే వాళ్లకు ఆ డబ్బులిచ్చి సాయం చేసింది. అంత గొప్ప మనసు నా కోడలిది. తన దగ్గర పనిచేసేవాళ్లను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంది. పది మంది చేసే పనిని కూడా ఒంటిచేత్తో చేయగల సత్తా ఆమె సొంతం. కొడుకు కోడలిద్దరూ కష్టపడటమే కాదు వారిలా కష్టపడేవాళ్లను ఎంతగానో గౌరవిస్తారు' అని చెప్పుకొచ్చింది. చదవండి: రేవంత్‌కు బిగ్‌బాస్ షాక్, అర్ధాంతరంగా.. శ్రీసత్యకు దండం పెట్టాలి, ఎప్పుడో ఎలిమినేట్ అవుతుందనుకున్నా -
చాలామంది ఆమెతో ప్రేమలో పడ్డవారే
రోడ్డు ప్రమాదంలో గాయపడిన మీనా కుమారికి వారాంతాల్లో సపర్యలు చేస్తూ స్నేహాన్ని పెంచుకున్నాడు దర్శకుడు కమల్ అమ్రోహీ. అటు ‘అనార్కలి’ సినిమా అటకెక్కింది (తర్వాత ఆ ప్రాజెక్ట్ చేతులు మారి నాసిర్ హుస్సేన్ కథతో నంద్లాల్ దర్శకత్వంలో బీనా రాయ్, ప్రదీప్ కుమార్ ముఖ్య భూమికలుగా 1953లో విడుదలైంది ‘అనార్కలి’పేరుతోనే). ఇటు మీనా, కమల్ల స్నేహం ప్రేమై.. నిఖా చేసుకుంది రహస్యంగా. ఎందుకంటే కమల్ అప్పటికే వివాహితుడు, పిల్లలు కూడా. మీనా కుమారి కన్నా పదహారేళ్లు పెద్దవాడు. ఆ నిఖా ఆమెకేనాడూ సంతోషాన్నివ్వలేదు. మీనాను భార్యగా కుబూల్ చేసిన మరుక్షణం నుంచే ఆమె చుట్టూ ఓ చట్రాన్ని బిగించాడు కమల్. అనుక్షణం అభద్రతలో రగిలిపోసాగాడు. ఏది ఏమైనా సాయంకాలం ఆరున్నరకల్లా ఇంటికి చేరుకోవాలి మీనా. అతను పంపిన కారులోనే ఆమె షూటింగ్‌కు వెళ్లాలి, రావాలి. సెట్స్‌లో ఆమె వెన్నంటే ఉండడానికి ఒక వ్యక్తినీ నియమించాడు కమల్. ఈ పొసెసివ్‌నెస్ మీనాను ఊపిరి సలపనివ్వకుండా చేసింది. ఆ పెళ్లి ఎనిమిదేళ్లు సాగినా కలహాల కాపురమే అయింది. మీనా హీరోయిన్గా తన కలల ప్రాజెక్ట్ ‘పాకీజా’ సినిమా తీయాలనుకున్నాడు కమల్. ‘విడాకులు ఇస్తేనే చేస్తాను’ అంటూ కమల్ కళ్లల్లోకి సూటిగా చూసింది మీనా. ‘మానసికంగా మనమేమీ ఒకరికొకరం ముడిపడిలేమిప్పుడు. అయినా నీ ఆత్మసంతృప్తి కోసం ఇస్తాను’ చెప్పాడు కమల్ ఆమె చూపులనుంచి తప్పించుకోకుండానే. ఆ బంధం నుంచి ఆమెను తప్పించాడు విడాకులు ఇచ్చేసి. అలా పెళ్లి విఫలమవడంతో మందుకు దగ్గరైంది మీనా. ఆ కలతకాలంలోనే ఆమె చెంత చేరాడు ధర్మేంద్ర. కష్టాన్ని మరిపించాడు.. ఆమెను మురిపించాడు.. అంతలోనే ఆమెను వీడాడు. మునుపటి అందం... ధర్మేంద్ర తనను వదిలిపోయాక, మద్యానికి బానిసైన మీనా కుమారి లివర్ సిర్రోసిస్ బారినపడింది. విదేశాల్లో చికిత్సపొంది తిరిగి ముంబైకి వచ్చాకే ఆమెకు కమల్ చేరవయ్యాడు మళ్లీ. ‘నువ్వు లేక నా డ్రీమ్ ప్రాజెక్ట్ కెమెరాకు ఎక్కకుండానే మిగిలిపోయింది’ అంటూ పాకీజా ఊసెత్తాడు మీనా కుమారి దగ్గర. ‘నన్ను మునుపటి అందంతో చూపిస్తాను అంటే నీ పాకీజా నేనవుతాను’ చెప్పింది మీనా కుమారి తన చేతులు, చేతివేళ్లు చూసుకుంటూ. ఎదురుగా ఉన్న మీనా కుమారిని మసగ్గా చూపించాయి కమల్ కళ్లల్లో ఊరిన నీళ్లు. ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకుంటూ ఆప్యాయంగా నొక్కాడు.‘పాకీజా’ సినిమాకు సన్నహాలు మొదలయ్యాయి మీనా కుమారి హీరోయిన్గా. హీరోగా ధర్మేంద్రతో అంతకుముందే సైన్ చేయించుకున్నాడు కమల్. కాని.. మీనా కుమారితో ధర్మేంద్రకున్న స్నేహం చిలువలు, పలువలుగా కమల్‌ను చేరి అతని మనసును కలవరపెట్టాయి. అతనిలోని పొసెసివ్ నేచర్ మళ్లీ పడగ విప్పింది. ధర్మేంద్రను ఆ సినిమా నుంచి తొలగించింది. ఆ పాత్రకు రాజ్‌కుమార్‌ను ఎంచుకున్నాడు. ‘పాకీజా’ మొదలైంది. అయితే అప్పటికి కమల్‌కు తెలియని నిజం ఏంటంటే రాజ్‌కుమార్ కూడా మీనా కుమారీకి దీవానానే అని. విలక్షణమైన తన ఉచ్చారణ శైలితో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రాజ్‌కుమార్.. సెట్స్‌లో మీనా కుమారిని చూడగానే మైమరచిపోయేవాడట.. సీన్లోని డైలాగులు టార్గెట్ అయ్యేవట. ఈ క్రమం ‘పాకీజా’కేమీ మినహాయింపు కాలేదు. డైరెక్టర్ కమల్ ‘ కెమెరా.. యాక్షన్’ అని చెప్పినా తాను చెప్పాల్సిన సంభాషణలను మరచిపోయి మీనా కుమారీనే చూస్తుండి పోయిన సందర్భాలెన్నో. రాజ్‌కుమార్ తీరుతో చిర్రెత్తి పోయిన కమల్.. హీరోహీరోయిన్లు కలిసి నటించే సీన్లను సాధ్యమైనంత తక్కువ షూట్ చేశాడట. ‘పాకీజా’లోని ‘చలో దిల్దార్ చలో చాంద్ కే పార్ చలో’ పాటను ప్రణయ గీతంగా నాయికా నాయకుల మధ్య సాన్నిహిత్యంతో చిత్రీకరించాలని అనుకున్నాడట. కాని ఎప్పుడైతే రాజ్‌కుమార్ కూడా మీనా కుమారి అంటే పడిచచ్చిపోతున్నాడని కమల్ అమ్రోహీ గ్రహించాడో అప్పడు ఆ పాట చిత్రీకరణే మారిపోయింది. కళ్లతోనే ప్రేమను అభినయించమని, ముఖ కవళికలతోనే సాన్నిహిత్యాన్ని ప్రదర్శించమని మీనా కుమారిని ఆదేశించాడు కమల్. అంతేకాదు చుట్టూ ఉన్న చెట్లు, లతలు, పూలు, చందమామాను ఎక్కువగా ఫోకస్ చేసి రొమాంటిక్ సాంగ్‌ను పూర్తి చేశాడు. అలా ఆ సినిమా షెడ్యూల్స్ అన్నీ అసహనం, కోపం, నిస్సహాయత, చిరాకునే మిగిల్చాయి దర్శకుడికి. పాకీజా విడుదలైన కొన్ని వారాలకే మీనా కుమారి అల్విదా చెప్పింది ఈ ప్రపంచానికి. కాని కమల్ పొసెసివ్‌నెస్ మాత్రం కొనసాగింది. ఫలితంగా తర్వాతటి తన సినిమాల్లో ఏ ఒక్కదాంట్లోనూ రాజ్‌కుమార్‌కు వేషం ఇవ్వలేదు అతను. సినిమాల్లో రొమాంటిక్ సన్నివేశాలు, ప్రణయగీతాల పట్ల అంత ఆసక్తి కనబర్చేవాడు కాదట రాజ్‌కుమార్. కాని మీనా కుమారికి జంటగా చేసే సినిమాల్లో ఇష్టంగా నటించేవాడట. మీనా కుమారితో సినిమాలు చేసిన దర్శక, హీరోల్లో చాలామంది ఆమెతో ప్రేమలో పడ్డవారే. ఆమె అందానికి ఫిదా అయిన వారే. ఆ వరుసలోనే భరత్ భూషణ్ కూడా ఉంటాడు. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన చిత్రం ‘బైజూ బావ్రా’. సూపర్, డూపర్ హిట్. ఆ సినిమా షూటింగ్‌లోనే భరత్ భూషణ్ మీనా కుమారితో ప్రేమలో పడ్డాడు. ‘నన్ను పెళ్లి చేసుకుంటారా?’ అని అభ్యర్థించాడు. సున్నితంగా తిరస్కరించింది మీనా కుమారి. -ఎస్సార్ -
ఆ జంట ప్రేమకథకు తొలి సన్నివేశం
‘ఆమె ఏం ఇష్టపడతారు?’ అడిగాడొక యువనటుడు తన స్నేహితుడిని అక్కడే ఉన్న ఓ సీనియర్ హీరోయిన్ను చూపిస్తూ. ‘ఆమె ఏం ఇష్టపడితే మనకేంగానీ సెట్స్ మీదకు వెళ్లగానే ఆమె కాళ్లకు దండం పెట్టు చాలు’ సలహా ఇచ్చాడు స్నేహితుడు. తర్వాత.. ముంబైలోని చాందీవలీ స్టూడియోస్‌లో ఈ యువనటుడిని ఆ సీనియర్ హీరోయిన్‌కు పరిచయం చేశారు. ఆమె వాత్సల్యంగా అతని భుజం తట్టి ‘ఈ అబ్బాయికి మంచి భవిష్యత్ ఉంది’ అని చెప్పింది. ఇది ఆ జంట ప్రేమకథకు తొలి సన్నివేశం. ఆ సీనియర్ హీరోయిన్.. మీనా కుమారి, ట్రాజెడీ క్వీన్ ఆఫ్ బాలీవుడ్. ఆ యంగ్‌స్టర్.. ధర్మేంద్ర. . ధర్మేంద్రను పిచ్చిగా ప్రేమించింది మీనా కుమారి. చూడగానే అతని భవితను అంచనావేయడమే కాదు సినిమా రంగంలో ధర్మేంద్రను నిలబెట్టేందుకూ ప్రయత్నించింది.. ఎంతోమంది నిర్మాత,దర్శకులకు అతని పేరు సిఫారసు చేసి. ధర్మేంద్ర ఎదురుపడేనాటికే మందు సాహచర్యంలో ఉంది మీనాకుమారి. బేషరతుగా తనకు ప్రేమను పంచే మనసు కోసం తపిస్తోంది. నిజాయితీగా తనను లాలించే తోడు కోసం నిరీక్షిస్తోంది. అప్పుడు ధర్మేంద్ర వచ్చాడు ఆమె పట్ల తన కళ్లల్లో ఆరాధన నింపుకొని. దాన్ని మీనాకుమారి ప్రేమ అనుకుంది. తాను ఎదురుచూస్తున్న వ్యక్తి ధర్మేంద్రే అని స్థిరపరచుకుంది. అతని సాంగత్యంలో ఈ లోకాన్ని మరిచిపోయేది. ఆమెతో ఉన్నంతసేపు అతనూ తన లోకాన్ని పక్కన పెట్టేవాడు. ఆ కాలక్షేపంలో ఆమె అతణ్ణి తన సాంత్వనగా మలచుకునేది. అతను ఆమెనో గురువుగా, గైడ్‌గా భావించేవాడు. తన గురించి అతను ఏమనుకుంటున్నాడోనని ఏనాడూ ఆలోచించలేదు మీనా కుమారి. తాను ఆనందంగా ఉంది చాలు అనే భద్రతను కాపాడుకోసాగిందంతే. ఆమె తన నుంచి ఏం ఆశిస్తోందో అతని మెదడుకి చిక్కినా.. తాను ఎలా ఉండదలుచుకున్నాడో అలాగే ఉన్నాడు. అందుకే కడవరకు కలిసే ఉంటారని నమ్ముకున్న బంధం మూడేళ్లకే ముగిసిపోయింది. మీనా కుమారి మళ్లీ మందు మాయలో పడిపోయింది. ఆ మూడేళ్లలో.. ఈ ఇద్దరి గురించి వచ్చినన్ని వదంతులు బాలీవుడ్లో ఇంకే జంట గురించీ వచ్చి ఉండవు. తర్వాత కాలంలో ఆ రూమర్సే నిజాలుగా, నిజాలు రూమర్స్గా ప్రచారం అయ్యాయి. సత్యాసత్యాలు ఈ ఇద్దరి ఆత్మకథల అచ్చులో కనిపించినప్పటికీ ఆ ప్రేమ కథలో ధర్మేంద్ర విలన్‌గా మిగిలాడు. కాని తన కెరీర్ ప్రారంభంలో మీనా కుమారి అందించిన ప్రోత్సాహాన్ని మాత్రం అతను మరిచిపోలేదు. చాందీవలీ స్టుడియోస్లో ఆమెను కలిసినప్పుడు స్నేహితుడు సూచించినట్టుగా ధర్మేంద్ర ఆమె కాళ్లకు నమస్కరించాడో లేదో కాని మీనా కుమారి చేసిన మేలును తలచుకుంటూనే ఉంటాడు ఇప్పటికీ. ఫ్లాష్‌బ్యాక్ ఆల్కహాల్, డిప్రెషన్‌తోనే మీనా కుమారికి కాలం గడుస్తోంది. అప్పుడు ఆమెకు మళ్లీ చేరువయ్యాడు.. ధర్మేంద్ర కాదు కమల్ ఆమ్రోహి. ఆమె భర్త. దర్శకుడు. ఈ ఇద్దరినీ కలిపింది ప్రసిద్ధ నటుడు అశోక్ కుమార్. తొలిచూపులోనే మీనాను ‘నా అనార్కలి’ అనుకున్నాడు కమల్. తాను తీయబోతున్న సినిమా అది. ఆ ఆఫర్‌కు అంగీకారం తెలిపి మహాబలేశ్వర్ వెళ్తుంటే రోడ్డు ప్రమాదంలో గాయపడింది మీనా కుమారి. దాదాపు మూడు నెలల ఆసుపత్రిలోనే ఉంది. ప్రతి వారాంతాలు ఆమె దగ్గరకు వెళ్లి బాగోగులు చూసుకునేవాడు కమల్. వచ్చినప్పుడల్లా ఆమె మణికట్టు మీద ‘నా అనార్కలి’ అని రాసేవాడట. ఇదీ ఓ విఫల ప్రేమ, పెళ్లి గాథ. వచ్చే వారానికి వాయిదా వేద్దాం. ఒకసారి మీనా కుమారి తన ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని పిక్నిక్ వెళ్లిందట. అందులో ధర్మేంద్ర కూడా ఉన్నాడు. తిరుగు ప్రయాణంలో పొరపాటున ధర్మేంద్ర మరో కారులో కూర్చున్నాడు. దాంతో ‘నా ధరమ్ ఏడి?ఎక్కడ?’ అంటూ కంగారు పడిందట మీనా కుమారి. ‘ఇంకో కార్లో వస్తున్నాడు’ అని ఆమె అసిస్టెంట్ చెప్పినా వినకుండా తన కారు ఆపేయించి, రోడ్డుకు అడ్డంగా వెళ్లి ‘ధరమ్.. ఎక్కడా?ఎక్కడన్నావ్?’ అంటూ వెనకాల వస్తున్న తన స్నేహితుల కార్లలో ధర్మేంద్రను వెదుక్కోసాగిందట. అంత అబ్సేషన్గా తయారయ్యాడు ధర్మేంద్ర.. మీనా కుమారికి అంటూ ఈ విషయాన్ని ఉటంకించాయట మరుసటిరోజు... పత్రికలన్నీ. ‘కాజల్’ సినిమా సక్సెస్ వేడుక కోసం ఢిల్లీ వెళ్లాడు ధర్మేంద్ర. పార్టీ అయిపోయాక రాత్రి ఫ్లయిట్‌కు మళ్లీ ముంబై చేరుకోవాలి. కాని ఎయిర్పోర్ట్ సిబ్బంది అతణ్ణి ఫ్లయిట్ ఎక్కనివ్వలేదు. మోతాదుకు మించి మద్యం సేవించాడని. ‘నేను వెళ్లాలి... అక్కడ మీనా కుమారి నా కోసం ఎదురుచూస్తోంది.. తన కోసం నేను వెళ్లాలి.. వెళ్లాల్సిందే’ అంటూ చిందులు తొక్కాడట ధర్మేంద్ర. మీనా కుమారి, ధర్మేంద్ర కలిసినటించిన చిత్రాలుకాజల్, పూర్ణిమ, చందన్ కా పల్నా, మై భీ లడ్కీ హూ, బహారోంకీ మంజిల్, ఫూల్ ఔర్ పత్థర్ మొదలైనవి. – ఎస్సార్ -
మీనా పసిడి పంచ్
న్యూఢిల్లీ: కొలోన్ ప్రపంచ కప్ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత బాక్సర్ మైస్నమ్ మీనా కుమారి (54 కేజీలు) స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. జర్మనీలోని కొలోన్‌లో జరిగిన ఈ టోర్నీలో భారత్ మొత్తం 5 (స్వర్ణం, 2 రజతాలు, 2 కాంస్యాలు) పతకాలను సాధించింది. ఫైనల్లో మచాయ్ బున్‌యానట్(థాయ్‌లాండ్)పై మీనా గెలిచింది. భారత్‌కే చెందిన సాక్షి (57 కేజీలు), పిలావో బాసుమతారి (64 కేజీలు) రజతాలతో సరిపెట్టుకున్నారు. ఫైనల్లో మికేలా వాల్ (ఐర్లాండ్) చేతిలో సాక్షి... చెంగ్యూ యాంగ్ (చైనా) చేతిలో బాసుమతారి ఓడిపోయారు. పింకీ రాణి (51 కేజీలు), పర్వీన్ (60 కేజీలు) కాంస్య పతకాలు నెగ్గారు. -
తీన్మార్ పంచ్
కొత్త సీజన్‌ను భారత బాక్సర్లు పతకాల పంటతో ప్రారంభించారు. స్ట్రాంజా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో మొత్తం ఏడు పతకాలు సొంతం చేసుకుని అదరగొట్టారు. ఇందులో మూడు స్వర్ణాలు, ఒక రజతం, మూడు కాంస్యాలు ఉన్నాయి. భారత్ తరఫున తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్... మణిపూర్ అమ్మాయి మైస్నం మీనాకుమారి దేవి... హరియాణా బాక్సర్ అమిత్ పంగల్ ‘పసిడి పంచ్’లతో మెరిశారు. సోఫియా (బల్గేరియా): అంచనాలకు అనుగుణంగా రాణించిన భారత బాక్సర్లు స్ట్రాంజా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో మెరిపించారు. 70 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో తొలిసారి మహిళల విభాగంలో స్వర్ణ పతకాలు సాధించి కొత్త చరిత్ర సృష్టించారు. 51 కేజీల విభాగంలో ప్రపంచ జూనియర్ మాజీ చాంపియన్ నిఖత్ జరీన్... 54 కేజీల విభాగంలో మైస్నం మీనా కుమారి దేవి... పురుషుల 49 కేజీల విభాగంలో ఆసియా క్రీడల విజేత అమిత్ పంగల్ పసిడి పతకాలు గెలిచారు. మహిళల 48 కేజీల విభాగంలో మంజు రాణి రజతం నెగ్గగా... సెమీఫైనల్లో ఓడిపోయిన ప్విలావో బాసుమతారి (64 కేజీలు), నీరజ్ (60 కేజీలు), లవ్లీనా బొర్గొహైన్ (69 కేజీలు) కాంస్య పతకాలతో సంతృప్తి పడ్డారు. గతంలో మహిళల విభాగంలో భారత్ తరఫున మేరీకోమ్ (రజతం) ప్రదర్శనే అత్యుత్తమంగా ఉంది. మంగళవారం జరిగిన ఫైనల్స్‌లో నిజామాబాద్ జిల్లా అమ్మాయి నిఖత్ జరీన్ 5–0తో ఐరీష్ మాగ్నో (ఫిలిప్పీన్స్)పై... మీనా కుమారి 3–2తో ఐరా విలెగాస్ (ఫిలిప్పీన్స్)పై నెగ్గగా... మంజు రాణి 2–3తో జోసీ గబుకో (ఫిలిప్పీన్స్) చేతిలో ఓడిపోయింది. మరో టైటిల్ పోరులో అమిత్ పంగల్ 3–2తో తెమిర్తాస్ జుసుపోవ్ (కజకిస్తాన్)పై గెలిచాడు. ఐరీష్ మాగ్నోతో జరిగిన తుది పోరులో నిఖత్ ఆద్యంతం దూకుడుగా ఆడింది. అవకాశం వచ్చినపుడల్లా ప్రత్యర్థిపై పంచ్‌ల వర్షం కురిపించింది. నిఖత్‌ను నిలువరించడానికి ఐరీష్ మాగ్నో రక్షణాత్మకంగా ఆడినా ఫలితం లేకపోయింది. అమర జవాన్లకు అంకితం... ఈ స్వర్ణం పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్లకు అంకితం ఇస్తున్నాను. ఫైనల్లో ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయకుండా పోరాడాను. ఆ అమ్మాయి తొలి రౌండ్లో భారత్‌కే చెందిన పింకీ జాంగ్రాను ఓడించింది. ఈ స్వర్ణం నా సామర్థ్యంపై సందేహాలు వ్యక్తం చేసిన వారికి సమాధానం. –నిఖత్ జరీన్ -
రాయలసీమ ప్రేమకథ
రాయలసీమలో జరిగిన ఓ వాస్తవ కథ ఆధారంగా అల్లుకున్న అందమైన ప్రేమ కథతో రూపొందుతోన్న చిత్రం ‘బంగారి బాలరాజు’. రాఘవ్, కరాణ్య కత్రీన్, మీనాకుమారి, ‘దూకుడు’ శ్రవణ్, ఎన్.వి. చౌదరి, సారిక రామచంద్రరావు ప్రధాన పాత్రల్లో కోటేంద్ర దుద్యాలని దర్శకుడిగా పరిచయం చేస్తూ కె.ఎండి. రఫీ, రెడ్డం రాఘవేంద్రరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కోటేంద్ర దుద్యాల మాట్లాడుతూ – ‘‘పరువు, ప్రతిష్టల మధ్య సాగే సున్నితమైన ప్రేమకథతో తెరకెక్కుతోన్న చిత్రమిది. అహోబిలంలో మొదటి షెడ్యూల్ పూర్తయింది. శాంతాబాయ్ పాటతో ఆకట్టుకున్న హాట్ బాంబ్ రాధికా పాటిల్‌తో స్పెషల్ సాంగ్ చిత్రీకరణ జరిపాం. మా చిత్రంతో ఆమెను తెలుగు తెరకు పరిచయం చేస్తున్నాం. గీతామాధురి పాడిన ఈ పాటకి రాధిక మరింత గ్లామర్ తీసుకొచ్చారు. ఈ నెలాఖరులో విడుదల చేసే టీజర్‌తో హీరో, హీరోయిన్లను పరిచయం చేయబోతున్నాం’’ అన్నారు. ‘‘అనుకున్న టైమ్ కంటే త్వరగా పూర్తయింది. ఔట్పుట్ చూశాం. హ్యాపీగా ఉంది’’ అన్నారు నిర్మాత రఫీ. ఈ చిత్రానికి సంగీతం : చిన్నికృష్ణ–చిట్టిబాబు రెడ్డిపోగు, కెమెరా: జి.ఎల్. బాబు. -
డియో డియో డిసక డిసక
సన్నీ లియోనమ్మా! డియో డియో అన్నా, డిసక డిసక అన్నా.. సినిమా స్క్రీన్ మీద పెట్రోల్ పోసినట్టే అనిపిస్తది. యంగ్‌స్టర్స్ అంతా.. చూసిన సినిమాలో సన్నీ లియోన్ ఉంది అని అనరు. సన్నీ లియోన్లోనే చూసిన సినిమా ఉంది అంటారు. అంత పాపులర్. ఐటమ్ సాంగ్ సన్నీ లియోన్ చేస్తే, డిటీఎస్ టిక్కెట్ కౌంటర్ దాకా చింపుతుంది. షాకింగ్ ఏంటంటే.. సన్నీ మీనాకుమారి బయోపిక్ చేయబోతోంది! ఏదీ.. ‘పాకీజా’ సినిమాలో ‘ఇన్ హీ లోగోనే.. ఇన్ హీ లోగోనే.. ఛీనా దుపట్టా మేరా’ అని (అయ్యో.. వీళ్లే నా దుపట్టా లాగారు అని బాధపడుతూ పడిన పాట) పాడి ట్రాజెడీ క్వీన్‌గా బాలీవుడ్‌ని ఏలిన మీనా కుమారి పాత్రలో.. సన్నీ లియోన్ని మనం ఊహించుకోగలమా! మన సన్నీ ఏమో అయ్యో ఇంకా లాగలేదే దుపట్టా అని పాడే రకం. ఈ రెండిటికీ పొత్తెలా కుదురుద్ది? హీరోయిన్లు ఐటమ్ సాంగ్‌లు చెయ్యడం మన ఇండస్ట్రీలో చల్తా హై. కానీ ఇక్కడ ఐటమ్ గర్ల్ ట్రాజెడీ హీరోయిన్గా... హౌ ఇటీజ్ పాజిబుల్? మీనాకుమారి జీవితంలో ఎన్నో విషాదాలు. ప్రేమలో విఫలమై, కెరియర్లో పతనమై, తాగుడుకి బానిసై, ముప్పై ఎనిమిదేళ్ల వయసుకే తనువు చాలించిన మీనాకుమారి బయోపిక్‌లో తనువంతా నేనే అన్నట్లుండే సన్నీ లియోన్ నాట్ పాజిబుల్ అని బాలీవుడ్ గగ్గోలు పెడుతోంది. సమర్పణ: నూరు దడవై -
మీనాకుమారిగా మనీషా!
-
మీనాకుమారిగా మనీషా!
నిన్నటితరం విషాద నాయిక మీనాకుమారి జీవితకథ ఆధారంగా దర్శకుడు శశిలాల్ నయ్యర్ రూపొందించనున్న చిత్రంలో మనీషా కొయిరాలా నటించనున్నట్లు సమాచారం. మీనాకుమారి సవతి కొడుకు తాజ్దార్ అమ్రోహీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. లిరిసిస్ట్‌గా అక్షయ్‌కుమార్ బాలీవుడ్ తారలు పాటలు పాడటం ఇటీవల ట్రెండ్‌గా మారిన సంగతి తెలిసిందే. అక్షయ్ కుమార్ ఓ అడుగు ముందుకేసి లిరిసిస్ట్‌గా కూడా మారాడు. ‘డేర్ 2 డాన్స్’ టీవీ రియాలిటీ షో కోసం టైటిల్ ట్రాక్‌కు అక్షయ్ ర్యాప్ సాంగ్ రాశాడు. ఒక్కరోజులోనే అతడు ఈ పాటను రాసేయడం విశేషం. రణబీర్ ‘షార్ట్’కట్ రణబీర్ కపూర్ తన తాత, దివంగత నటుడు రాజ్‌కపూర్ జీవితాన్ని తెరకెక్కించేందుకు ‘షార్ట్’కట్‌ను ఎంచుకున్నాడు. తన తాత జీవితం ఆసక్తికరమైనదని, ఆయన జీవితం ఆధారంగా షార్ట్ఫిలిమ్ రూపొందించాలనుకుంటున్నానని రణబీర్ చెబుతున్నాడు.