Manish Malhotra Confirms Directing Meena Kumari Biopic, Says We Are Working On The Script - Sakshi
Sakshi News home page

Meena Kumari Biopic: విషాద నటి బయోపిక్‌ నిజమే

Published Tue, Jul 25 2023 12:39 AM | Last Updated on Tue, Jul 25 2023 8:14 AM

Meena Kumari biopic: Manish Malhotra confirms on Meena Kumari biopic - Sakshi

కృతీ సనన్‌, మీనా కుమారి

హిందీ చిత్రసీమలో విషాద పాత్రల్లో మెప్పించిన అలనాటి నటి ఎవరు అంటే? ‘మీనా కుమారి’ పేరు చెబుతారు. తన అందం, అభినయంతో నాటి తరం ప్రేక్షకులను అలరించారు మీనా కుమారి. ప్రస్తుతం ఆమె బయోపిక్‌ రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. బాలీవుడ్‌ డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రా ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని వార్తలు వచ్చాయి.

తాజాగా, ఈ బయోపిక్‌ గురించి మనీషా మల్హోత్రా మాట్లాడుతూ– ‘‘ఏ చిత్రానికైనా కథే కీలకం. బయోపిక్‌లకి మరీను. మీనా కుమారి మీద వచ్చిన పుస్తకాల ఆధారంగా కథ తయారు చేస్తున్నా’’ అన్నారు. ఇటీవల రిలీజైన∙‘ఆది పురుష్‌’లో సీత పాత్ర చేసిన కృతీ సనన్‌ ‘మీనా కుమారి’ బయోపిక్‌లో టైటిల్‌ రోల్‌ చేయనున్నారు. ఇదిలా ఉంటే.. మీనా కుమారి బయోపిక్‌ తీయడానికి ఆమె కుటుంబ సభ్యులు సుముఖంగా లేరని భోగట్టా. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement