
సన్నీ లియోనమ్మా! డియో డియో అన్నా, డిసక డిసక అన్నా.. సినిమా స్క్రీన్ మీద పెట్రోల్ పోసినట్టే అనిపిస్తది. యంగ్‌స్టర్స్ అంతా.. చూసిన సినిమాలో సన్నీ లియోన్ ఉంది అని అనరు. సన్నీ లియోన్‌లోనే చూసిన సినిమా ఉంది అంటారు. అంత పాపులర్. ఐటమ్ సాంగ్ సన్నీ లియోన్ చేస్తే, డిటీఎస్ టిక్కెట్ కౌంటర్ దాకా చింపుతుంది. షాకింగ్ ఏంటంటే.. సన్నీ మీనాకుమారి బయోపిక్ చేయబోతోంది! ఏదీ.. ‘పాకీజా’ సినిమాలో ‘ఇన్ హీ లోగోనే.. ఇన్ హీ లోగోనే.. ఛీనా దుపట్టా మేరా’ అని (అయ్యో.. వీళ్లే నా దుపట్టా లాగారు అని బాధపడుతూ పడిన పాట) పాడి ట్రాజెడీ క్వీన్‌గా బాలీవుడ్‌ని ఏలిన మీనా కుమారి పాత్రలో.. సన్నీ లియోన్‌ని మనం ఊహించుకోగలమా! మన సన్నీ ఏమో అయ్యో ఇంకా లాగలేదే దుపట్టా అని పాడే రకం.
ఈ రెండిటికీ పొత్తెలా కుదురుద్ది? హీరోయిన్‌లు ఐటమ్ సాంగ్‌లు చెయ్యడం మన ఇండస్ట్రీలో చల్తా హై. కానీ ఇక్కడ ఐటమ్ గర్ల్ ట్రాజెడీ హీరోయిన్‌గా... హౌ ఇటీజ్ పాజిబుల్? మీనాకుమారి జీవితంలో ఎన్నో విషాదాలు. ప్రేమలో విఫలమై, కెరియర్‌లో పతనమై, తాగుడుకి బానిసై, ముప్పై ఎనిమిదేళ్ల వయసుకే తనువు చాలించిన మీనాకుమారి బయోపిక్‌లో తనువంతా నేనే అన్నట్లుండే సన్నీ లియోన్ నాట్ పాజిబుల్ అని బాలీవుడ్ గగ్గోలు పెడుతోంది.
సమర్పణ: నూరు దడవై
Comments
Please login to add a commentAdd a comment