మీనాకుమారిగా మనీషా! | Manisha Koirala to play legendary Meena Kumari in biopic? | Sakshi
Sakshi News home page

మీనాకుమారిగా మనీషా!

Published Fri, Aug 15 2014 1:20 AM | Last Updated on Sat, Sep 2 2017 11:52 AM

మీనాకుమారిగా మనీషా!

మీనాకుమారిగా మనీషా!

నిన్నటితరం విషాద నాయిక మీనాకుమారి జీవితకథ ఆధారంగా దర్శకుడు శశిలాల్ నయ్యర్ రూపొందించనున్న చిత్రంలో మనీషా కొయిరాలా నటించనున్నట్లు సమాచారం. మీనాకుమారి సవతి కొడుకు తాజ్దార్ అమ్రోహీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు.
 
 లిరిసిస్ట్‌గా అక్షయ్‌కుమార్
 బాలీవుడ్ తారలు పాటలు పాడటం ఇటీవల ట్రెండ్‌గా మారిన సంగతి తెలిసిందే. అక్షయ్ కుమార్ ఓ అడుగు ముందుకేసి లిరిసిస్ట్‌గా కూడా మారాడు. ‘డేర్ 2 డాన్స్’ టీవీ రియాలిటీ షో కోసం టైటిల్ ట్రాక్‌కు అక్షయ్ ర్యాప్ సాంగ్ రాశాడు. ఒక్కరోజులోనే అతడు ఈ పాటను రాసేయడం విశేషం.
 
 రణబీర్ ‘షార్ట్’కట్
 రణబీర్ కపూర్ తన తాత, దివంగత నటుడు రాజ్‌కపూర్ జీవితాన్ని తెరకెక్కించేందుకు ‘షార్ట్’కట్‌ను ఎంచుకున్నాడు. తన తాత జీవితం ఆసక్తికరమైనదని, ఆయన జీవితం ఆధారంగా షార్ట్‌ఫిలిమ్ రూపొందించాలనుకుంటున్నానని రణబీర్ చెబుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement