మీనాకుమారిగా మనీషా!
నిన్నటితరం విషాద నాయిక మీనాకుమారి జీవితకథ ఆధారంగా దర్శకుడు శశిలాల్ నయ్యర్ రూపొందించనున్న చిత్రంలో మనీషా కొయిరాలా నటించనున్నట్లు సమాచారం. మీనాకుమారి సవతి కొడుకు తాజ్దార్ అమ్రోహీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు.
లిరిసిస్ట్‌గా అక్షయ్‌కుమార్
బాలీవుడ్ తారలు పాటలు పాడటం ఇటీవల ట్రెండ్‌గా మారిన సంగతి తెలిసిందే. అక్షయ్ కుమార్ ఓ అడుగు ముందుకేసి లిరిసిస్ట్‌గా కూడా మారాడు. ‘డేర్ 2 డాన్స్’ టీవీ రియాలిటీ షో కోసం టైటిల్ ట్రాక్‌కు అక్షయ్ ర్యాప్ సాంగ్ రాశాడు. ఒక్కరోజులోనే అతడు ఈ పాటను రాసేయడం విశేషం.
రణబీర్ ‘షార్ట్’కట్
రణబీర్ కపూర్ తన తాత, దివంగత నటుడు రాజ్‌కపూర్ జీవితాన్ని తెరకెక్కించేందుకు ‘షార్ట్’కట్‌ను ఎంచుకున్నాడు. తన తాత జీవితం ఆసక్తికరమైనదని, ఆయన జీవితం ఆధారంగా షార్ట్ఫిలిమ్ రూపొందించాలనుకుంటున్నానని రణబీర్ చెబుతున్నాడు.