
న్యూఢిల్లీ: కొలోన్ ప్రపంచ కప్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో భారత బాక్సర్ మైస్నమ్ మీనా కుమారి (54 కేజీలు) స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. జర్మనీలోని కొలోన్‌లో జరిగిన ఈ టోర్నీలో భారత్ మొత్తం 5 (స్వర్ణం, 2 రజతాలు, 2 కాంస్యాలు) పతకాలను సాధించింది. ఫైనల్లో మచాయ్ బున్‌యానట్(థాయ్‌లాండ్)పై మీనా గెలిచింది.
భారత్‌కే చెందిన సాక్షి (57 కేజీలు), పిలావో బాసుమతారి (64 కేజీలు) రజతాలతో సరిపెట్టుకున్నారు. ఫైనల్లో మికేలా వాల్ (ఐర్లాండ్) చేతిలో సాక్షి... చెంగ్యూ యాంగ్ (చైనా) చేతిలో బాసుమతారి ఓడిపోయారు. పింకీ రాణి (51 కేజీలు), పర్వీన్ (60 కేజీలు) కాంస్య పతకాలు నెగ్గారు.