Vignesh Shivan Mother Meena Kumari Praises Nayanthara - Sakshi
Sakshi News home page

Nayanthara: పనిమనిషికి లక్షల సాయం.. కోడలిపై విఘ్నేశ్‌ తల్లి ప్రశంసలు

Published Fri, Nov 25 2022 5:55 PM | Last Updated on Fri, Nov 25 2022 6:32 PM

Vignesh Shivan Mother Meena Kumari Praises Nayanthara - Sakshi

సౌత్‌ ఇండస్ట్రీలో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందుతోంది నయనతార. కోలీవుడ్‌లో టాప్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు విఘ్నేశ్‌ శివన్‌. ఈ ఏడాదే పెళ్లి చేసుకున్న వీరు ఇటీవలే సరోగసి ద్వారా కవలలకు తల్లిదండ్రులయ్యారు. ఇదిలా ఉంటే తాజాగా నయనతారను పొగడ్తలతో ముంచెత్తించింది ఆమె అత్తయ్య, విఘ్నేశ్‌ తల్లి మీనా కుమారి.

విఘ్నేశ్‌ తల్లి మీనా కుమారి మాట్లాడుతూ.. 'నా కొడుకు సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌, నా కోడలు టాప్‌ హీరోయిన్‌. ఇద్దరూ కష్టపడి పని చేసేవారే! నయనతార ఇంట్లో ఎనిమిది మంది పనివాళ్లు ఉన్నారు. అందులో ఒకరికి నాలుగు లక్షల అప్పు ఉందని తెలిసి వెంటనే వాళ్లకు ఆ డబ్బులిచ్చి సాయం చేసింది. అంత గొప్ప మనసు నా కోడలిది. తన దగ్గర పనిచేసేవాళ్లను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంది. పది మంది చేసే పనిని కూడా ఒంటిచేత్తో చేయగల సత్తా ఆమె సొంతం. కొడుకు కోడలిద్దరూ కష్టపడటమే కాదు వారిలా కష్టపడేవాళ్లను ఎంతగానో గౌరవిస్తారు' అని చెప్పుకొచ్చింది.

చదవండి: రేవంత్‌కు బిగ్‌బాస్‌ షాక్‌, అర్ధాంతరంగా..
శ్రీసత్యకు దండం పెట్టాలి, ఎప్పుడో ఎలిమినేట్‌ అవుతుందనుకున్నా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement