tragedy story
-
వయనాడ్ To విజయవాడ.. దేశాన్ని ముంచేసిన విషాదాలు
-
మారేడుమిల్లిలో వైద్య విద్యార్థుల విహారయాత్ర.. విషాదాంతం
అల్లూరి, సాక్షి: మారేడుమిల్లి విహారయాత్రలో విషాదం చోటుచేసుకుంది. నిన్న గల్లంతైన ముగ్గురు వైద్య విద్యార్థుల్లో ఇద్దరు మృతిచెందగా.. సోమవారం ఉదయం వాళ్ల మృతదేహాల్ని వెలికి తీశారు. మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.మారేడుమిల్లి పర్యాటక ప్రాంతానికి ఏలూరులోని ఆశ్రం కళాశాలలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న 14 మంది వైద్యవిద్యార్థులు ఆదివారం ట్రావెలర్ వాహనంలో వెళ్లారు. మారేడుమిల్లి నుంచి చింతూరు వెళ్లే అంతర్రాష్ట్ర రహదారిలోని ‘జలతరంగిణి’ జలపాతం వద్దకు చేరుకుని అందులో దిగారు. ఈ క్రమంలో ఒక్కసారిగా భారీవర్షం కురిసింది. జలపాతం ఉద్ధృతి పెరగడంతో ఐదుగురు కొట్టుకుపోయారు.హరిణిప్రియ, గాయత్రి పుష్పను ఒడిశా నుంచి విహారయాత్రకు వచ్చిన ఇద్దరు యువకులు కాపాడి, రంపచోడవరం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. హరిణిప్రియ పరిస్థితి విషమంగా ఉండడంతో రాజమహేంద్రవరం తరలించారు. గల్లంతైనవారిలో సౌమ్య, హరదీప్, అమృత, హరిణిప్రియ, గాయత్రి పుష్ప ఉన్నారు. వీరిలో విజయనగరానికి చెందిన గల్లంతైన వారికోసం పోలీసులు, సీబీఈటీ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం సౌమ్య, అమృత మృతదేహాలు లభ్యమయ్యాయి. హరదీప్ కోసం గాలింపు కొనసాగుతోంది.కొసిరెడ్డి సౌమ్య (21) ది పార్వతీపురం జిల్లా బొబ్బిలి స్వస్థలంకాగా, బి.అమృత (21) బాపట్లగా పోలీసులు తెలిపారు. సీహెచ్ హరదీప్(20) ప్రకాశం జిల్లా మార్కాపురంగా తెలుస్తోంది. సౌమ్య, అమృత మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
సూపర్ స్టార్.. సూపర్ కార్.. చివరికి, అంతులేని విషాదం!
ఒకపుడు సూపర్‌స్టార్, ఇండియాలోనే రిచెస్ట్ యాక్టర్‌గా పాపులర్. చెయ్యెత్తి దణ్నం పెట్టేంత అందం, అభినయం. కానీ భర్త చేతిలో అవమానాలు, హింసకు గురై, మద్యపానానికి అలవాటుపడి, కడు దయనీయ పరిస్థితిలో మరణించింది. ఇంతకీ ఎవరా మహానటి? లెజెండరీ నటి, రీల్ ట్రాజెడీ క్వీన్ గా పేరొందిన మీనా కుమారి జీవితం విషాదంగానే ముగిసింది. అందుకే మీనా కుమారి మరణం తరువాత మరో పాపులర్ నటి నర్గీస్ 'మౌత్ ముబారక్ హో మీనా, ఈ ప్రపంచం మీలాంటి వారి కోసం కాదు' అంటూ కామెంట్ చేసిందంటే.. ఆమె జీవితంలోని విషాదాన్ని అర్థం చేసుకోవచ్చు. మీనా కుమారి ఆగస్టు 1, 1933న జన్మించారు. ఆమె అసలు పేరు మహ్జబీన్ బనో. ఆమెకు ‘నాజ్’, ‘మున్నా’ అనే ముద్దు కూడా పేర్లున్నాయి. అందానికి అచ్చమైన నిదర్శనంగా ఉండే మీనాకుమారి నాలుగేళ్లకే నటనా జీవితంలోకి ప్రవేశించారు. బాలీవుడ్ సినిమాల్లో అంకితభావంతో పనిచేసి, నటనలో తనదైన ప్రతిభను చాటకున్నారు. నటిగా ఆమె కన్నీటి వాకిళ్లు, ఆమె జీవితంలో జలపాతాలయ్యాయంటే అతిశయోక్తికాదు. దిలీప్ కుమార్, రాజ్ కుమార్ లాంటి దిగ్గజ నటులే ఆమె ముందు అభినయించడానికి జంకేవారట. సత్యజిత్ రే లాంటి దిగ్గజ దర్శకులు ఆమె అభినయ ప్రతిభకు ఫిదా అయిపోయేవారట. 30 ఏళ్ల కరియర్లో ఎన్నోమైలురాళ్లు, మరోన్నో బ్లాక్‌బస్లర్ సినిమాలు. దాదాపు అన్నీ క్లాసిస్ మూవీలే. బైజు బావరా, ఫాకీజా. సాహెబ్, బీబీ ఔర్ గులాం, మేరే అప్నే,పరిణీత, దిల్ అప్నా ఔర్ ప్రీత్, పరాయి, ఫుట్ పాత్, ఫూల్ ఔర్ పత్తర్, ఆజాద్ ఇలాంటి ఎన్నో సూపర్ హిట్లు. దాదాపు 90 సినిమాల్లో నటించారు. ఇక ప్రశంసలు, అవార్డులు, సంపదకు లెక్కే లేదు. ఆ రోజుల్లోనే ఇంపాలా కారు కొన్న ఏకైక నటి మీనా కుమారి. కానీ చిత్రనిర్మాత కమల్ అమ్రోహితో పెళ్లి మీనా కుమారి జీవితాన్ని అతలాకుతలం చేసింది. 1960లో కిషోర్ సాహు దర్శకత్వంలో కమల్ అమ్రోహి నిర్మించిన ‘దిల్ అప్నా అవుర్ ప్రీత్ పరాయీ’ సినిమా పెద్ద మలుపు అని చెప్పవ చ్చు. అలా మొదలైన పరిచయం 1952లో వివాహానికి దారి తీసింది. అప్పటినుంచి మీనా కుమారి నటిస్తున్న చిత్రనిర్మాతలతో సినిమా స్క్రిప్ట్‌ల విషయంలో జోక్యం చేసుకునేవాడు కమల్. కెరీర్‌కు అనేక ఆటంకాలు, తదితర అనేక వైరుధ్యాలు తారాస్థాయికి చేరాయి. విడాకులకు దారి తీసింది. ముఖ్యంగా మీనా కుమారి దిలీప్ కుమార్ సరసన ఖరారైన తరువాత,ఆమె ఔట్ డోర్ షూటింగ్‌లకు రాదు అంటూ బిమల్ రాయ్ ఆఫీసుకెళ్లి మరీ బెదిరించాడు. దీంతో ఈ ఐకానిక్ పాత్ర సుచిత్రా సేన్ దక్కించుకుంది. చివరికి వివాహం అయిన 10 ఏళ్ల తరువాత 1964లో విడాకులు మీనా-కమల్ జంట తీసుకున్నారు. ఇక ఆ తరువాత ఆమె మద్యానికి బానిసైంది. డిప్రెషన్‌కు లోనైంది. నిద్ర పట్టక ఇబ్బంది పడేది. అపుడు కొద్దిగా బ్రాందీ తీసుకోమని డాక్టర్ సలహా ఇచ్చాడట. అదే కొంపముంచింది. ఆమె నటించిన చివరిదీ, సూపర్ డూపర్ మూవీ పాకీజా విడుదలైన మూడు వారాలకే మీనా కుమారి తీవ్ర అస్వస్థతతో కోమాలోకి వెళ్లి పోయి 38 ఏళ్లకే 1972 మార్చి 31న ఈ ప్రపంచం నుంచి శాశ్వతంగా సెలవు తీసుకుంది. ఆసుపత్రి బిల్లు రూ. 3,500 చెల్లించేందుకు కూడా ఆమె వద్ద డబ్బులు లేని దుర్భర స్థితిలో సినిమా దేవత కన్నుమూయడం అంతులేని విషాదం. మరిన్ని సంగతులు ♦ కవయిత్రి అయిన మీనా కుమారి ‘నాజ్’ అనే మారుపేరుతో ఉర్దూ కవితలు రాసేది. ♦మీనా కుమారిని కమల్ అమ్రోహికి పరిచయం చేసిన కిషోర్ కుమార్ సోదరుడు అశోక్ కుమార్. ♦ మీనా కుమారి మే 21, 1951లో యాక్సిడెంట్, నాలుగు నెలల పాటు ఆసుపత్రిలో, ఆ సందర్బంగా ఇద్దరి మధ్యా ప్రేమ, ♦ 18 ఏళ్లకే ఫిబ్రవరి 14, 1952న మీనా సోదరి మహిలికా సమక్షంలో కమల్ అమ్రోహి తో రహస్య నిఖా ♦ కమల్‌కు అప్పటికే పెళ్లి, ముగ్గురు పిల్లలు -
హా అంటారా... హడలిపోతారా!
అందాల తారలు భయపెట్టడానికి రెడీ అవుతున్నారు. ఆ అందం వెనక ఎంత ట్రాజెడీ ఉండి ఉంటే.. భయపెట్టాలనుకుని ఉంటారో ఊహించవచ్చు. అలా భయపెట్టే కథలతో కొందరు కథానాయికలు ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. మరి ప్రేక్షకులు ‘హా’ అంటూ హడలిపోతారా చూడాలి. ఇక ఈ హారర్ స్టోరీలపై ఓ లుక్ వేయండి. ‘మాయ’, ‘ఐరా’, ‘డోరా’... ఇలా వీలై నప్పుడల్లా వెండితెరపై ఆడియన్స్‌ని భయ పెట్టారు హీరోయిన్ నయనతార. తాజాగా నయనతార గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన మరో హారర్ మూవీ ‘కనెక్ట్’. నయనతారతో 2015లో ‘మాయ’ సినిమా తీసిన అశ్విన్ శరవణన్యే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అనుపమ్ ఖేర్, సత్యరాజ్ కీ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమాను త్వరలోనే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. మరోవైపు హారర్ జానర్‌పై హీరోయిన్ కాజల్ అగర్వాల్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లున్నారు. ఎందుకంటే ప్రస్తుతం కాజల్ డైరీలో మూడు హారర్ సినిమాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. కాజల్ ప్రధాన పాత్రధారిగా యోగిబాబు, దర్శక–నటుడు కేఎస్ రవి కుమార్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఘోస్టీ’. హారర్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ పోలీసాఫీసర్ పాత్రలో నటించగా, కల్యాణ్ దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ సినిమా టీజర్ విడుదలైంది. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేయాలను కుంటున్నారు. అలాగే తమిళ దర్శకుడు డీకే దర్శకత్వంలో ‘కరుంగాప్పియమ్’ అనే హారర్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన సినిమాలో ఓ లీడ్ రోల్ చేశారు కాజల్ అగర్వాల్. కాజల్‌తో పాటు ఈ సినిమాలో రెజీనా, జనని, నోయిరికా, రజియా విల్సన్ నటించారు. ఈ చిత్రంలో కొన్ని అతీంద్రియ శక్తులు ఉన్న యువతి పాత్రలో కాజల్ కనిపిస్తారు. ఇక హారర్ జానర్లో వచ్చిన చిత్రాల్లో ‘చంద్రముఖి’ సినిమాను ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘చంద్రముఖి 2’ రెడీ అవుతోంది. తొలి భాగానికి దర్శకత్వం వహించిన పి. వాసుయే మలి భాగానికి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఫస్ట్ పార్ట్‌లో రజనీకాంత్ నటించగా, ‘చంద్రముఖి 2’లో రాఘవా లారెన్స్ మెయిన్ లీడ్ చేస్తున్నారు. ఈ సినిమాలోని ఓ హీరోయిన్ పాత్రకు కాజల్ అగర్వాల్‌ను సంప్రదించిందట చిత్ర యూనిట్. మరోవైపు వెండి తెరపై ఇప్పటివరకు గ్లామరస్‌గా కనిపించిన హన్సిక కూడా హారర్ వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ మధ్య ‘గార్డియన్’ అనే హారర్ ఫిల్మ్‌కు హన్సిక సైన్ చేశారు. ఆల్రెడీ ఫస్ట్ లుక్ కూడా రిలీజైంది. శబరి–గురుశరవణన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అలాగే ఆర్. కన్నన్ అనే దర్శకుడు తెరకెక్కిస్తున్న హారర్ సినిమాలో కూడా హన్సిక నటిస్తున్నారు. మరో హీరోయిన్ రాయ్‌లక్ష్మీ ‘సిండ్రెల్లా’గా ప్రేక్షకులను భయపెట్టేందుకు రెడీ అయ్యారు. వినో వెంకటేశ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో సాక్షీ అగర్వాల్ ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమాలో రాయ్‌లక్ష్మీ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. కాగా.. ‘రాజుగారి గది 2’ తర్వాత సమంత మరోసారి ప్రేతాత్మగా కనిపించనున్నారని, ఈ సినిమాకు ‘స్త్రీ’ ఫేమ్ అమర్ కౌశిక్ దర్శకత్వం వహించనున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇలా హారర్ బ్యాక్‌డ్రాప్‌లోనే మరికొందరు కథానాయికలు సినిమాలు చేస్తున్నారు. -
‘శ్రీశైలం’ ఘటనకు ఏడాది
సాక్షి, నాగర్‌కర్నూల్/ దోమలపెంట(అచ్చంపేట): టీఎస్ జెన్కో పరిధిలోని శ్రీశైలం ఎడమగట్టు భూగర్భజల విద్యుత్తు కేంద్రంలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుని శుక్రవారం నాటికి ఏడాది పూర్తయింది. ఈ సంఘటన టీఎస్ జెన్కో చరిత్రలో మాయనిమచ్చగా మిగిలింది. 2020 ఆగస్టు 20న అర్ధరాత్రి ఇక్కడి నాలుగో యూనిట్‌లోని ప్యానల్‌బోర్డులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ తర్వాత ట్రాన్స్ఫార్మర్ పేలుడుతో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఘటనలో ఐదుగురు ఇంజినీర్లు, ఇద్దరు అసిస్టెంట్ ఇంజినీర్లు, మరో ఇద్దరు అమర్‌రాజ బ్యాటరీస్ కంపెనీకి చెందిన సిబ్బంది మరణించగా, మరో ఎనిమిది మంది సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన బాధిత కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఉక్కిరిబిక్కిరై మృత్యువాత శ్రీశైలం భూగర్భజల విద్యుత్ కేంద్రంలో నాడు అగ్రిప్రమాదం సంభవించి, దట్టమైన పొగలు వ్యాపించడంతో యూనిట్‌లోని ఉద్యోగులు, సిబ్బంది ఉక్కిరిబిక్కిరై తొమ్మిది మంది మరణించారు. వీరిలో డీఈ శ్రీనివాస్‌రావు (40), ఏఈ మర్సకట్ల పెద్ద వెంకట్రావ్ (46), ఏఈ మోహన్‌కుమార్ (33), ఏఈ ఉజ్మాఫాతిమా (27), ఏఈ సుందర్ (37), ప్లాంట్ అటెండర్ రాంబాబు (43), జూనియర్ ప్లాంట్ అంటెడర్ కిరణ్‌కుమార్ (30), అమరాన్ కంపెనీ ఉద్యోగులు వినేశ్‌కుమార్ (36), మహేశ్‌కుమార్ (38) మరణించారు. వీరంతా ఎస్కేప్ టన్నెల్ ద్వారా బయటకు వచ్చేందుకు యత్నించినా, దట్టమైన పొగతో ఊపిరి తీసుకునేందుకు వీలుపడని పరిస్థితి నెలకొనడంతో మరణించారు. పునరుద్ధరణ వైపు.. గతేడాది అక్టోబర్ 26న జలవిద్యుత్ కేంద్రంలోని 1, 2వ యూనిట్లలో పునరుద్ధరణ చేపట్టి విద్యుదుత్పత్తి ప్రారంభించారు. ఆ తర్వాత ఐదు నెలలకు 3, 5, 6వ యూనిట్లను సైతం పునరుద్ధరించి విద్యుదుత్పత్తి చేపట్టారు. ఈ కేంద్రంలో విద్యుదుత్పత్తి ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు 646.56 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేశారు. కాగా 2021–22లో శ్రీశైలం భూగర్భ జలవిద్యుత్తు కేంద్రానికి టీఎస్ జెన్కో విధించిన లక్ష్యం 1,450 మిలియన్ యూనిట్లు. మొత్తం ఆరు యూనిట్లకుగాను ఒక్కో యూనిట్ 150 మెగావాట్ల చొప్పున మొత్తం విద్యుదుత్పత్తి సామర్థ్యం 900 మెగావాట్లు. కాగా అగ్నిప్రమాదం జరిగిన తర్వాత కేంద్రంలో ఇప్పటివరకు నాలుగు యూనిట్లను పునరుద్ధరించారు. 4వ యూనిట్ మాత్రమే పునరుద్ధరించాల్సి ఉంది. -
ఆ ఇంట పెళ్లి బాజాలు మోగనుండగా.. ఇంతలోనే విధి వక్రించి
ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట) : మరో పక్షం రోజులు గడిస్తే.. ఆ ఇంట పెళ్లి బాజాలు మోగనుండగా.. ఇంతలోనే విధి వక్రించి విషాదఛాయలు అలుముకున్నాయి.. వివరాలలోకి వెళ్తే .. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) రామన్నగూడెం గ్రామానికి చెందిన అనంతుల మల్లయ్య (52)కు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నాడు. కుమార్తెకు వివాహం కాగా, ఇటీవల కుమారుడు మహేష్‌కు నిశ్చితార్థం జరిగింది. శ్రావణమాసంలో ముహూర్తం పెట్టుకోవాల్సి ఉంది. ఈ పెళ్లికి వంట చెరుకు సమకూర్చేందుకు అనంతుల మల్లయ్య శనివారం ఉదయాన్నే ఓ రైతుకు చెందిన ఎడ్లబండి, మరో రైతు ఎడ్లను తోలుకుని గ్రామ శివారులోని ఏరు అవతలికి వెళ్లాడు. తిరిగి వచ్చే సమయంలో ఏరు దాటలేకపోయాయి. ఈ సమయంలో ఏటిలోంచి పొలానికి నీళ్లు పెట్టుకునేందుకు ఓ రైతు ఏర్పాటు చేసిన విద్యుత్ మోటార్‌కు సంబంధించి సర్వీస్ వైర్ ప్రమాదవశాత్తు ఎడ్ల బండికి తగిలింది. ఈ ప్రమాదంలో అనంతుల మల్లయ్యతో పాటు ఓ ఎద్దు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలువిడిచింది. గమనించిన సమీపంలో ఉన్న రైతు సంబంధిత శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. విషయం తెలుసుకున్న సూర్యాపేట రూరల్ సీఐ విఠల్‌రెడ్డి, ఎస్సై లింగం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య ప్రమీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లింగం తెలిపారు. -
అమ్మ, నాన్న ఎక్కడ.. కంటతడి పెట్టిస్తున్న చిన్నారి
రోమ్: గత ఆదివారం నార్త్ ఇటలీలోని మాగ్గియోర్ సరస్సు వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒక కేబుల్ కార్ బ్రేక్ ఫెయిల్ అయి కొండల్లో పడిపోవడంతో క్యాబిన్‌లోని 14 మంది చనిపోయారు.. కానీ ఒక్కడు మాత్రం తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. అతనే ఐదేళ్ల పిల్లాడు ఈతాన్ బిరాన్.. యాక్సిడెంట్ జరిగిన రోజు నుంచి కోమాలో ఉన్న ఈతాన్ బిరాన్ శుక్రవారం సృహలోకి వచ్చాడు. కళ్లు తెరిచిన మరుక్షణం.. అమ్మ, నాన్న ఎక్కడ.. వారిని చూడాలి అంటూ ఈతన్ అడిగాడు. కానీ ఆ ప్రమాదంలో అతని పేరెంట్స్‌తో పాటు తమ్ముడు, తాతను కోల్పోయినట్లు అతనికి తెలియదు. ఆ విషయం ఆ పిల్లాడికి ఎలా చెప్పాలో ఆసుపత్రి సిబ్బందికి అర్థం కావడం లేదు. ప్రస్తుతం బిరాన్‌ను చూసుకోవడానికి పిల్లాడి ఆంటీ ఆయా తోడుగా ఉంది. విషయంలోకి వెళితే.. ఈతన్ బిరాన్.. తండ్రి అమిత్(30), తల్లి తాల్(26),తమ్ముడు టామ్(2)తో పాటు తాత, నానమ్మ కోహెన్(81), కోనిస్కి(71) తో కలిసి నార్త్ ఇటలీలో టూర్‌కి వచ్చాడు. మాగ్గియోర్ సరస్సు వద్ద ఉన్న కేబుల్ కార్లో ఎక్కడానికి వారంతా సిద్దమయ్యారు. ఈ కుటుంబంతో పాటు మరో 8 మంది కూడా క్యాబిన్లో ఎక్కారు. కొద్దిదూరం వరకు బాగానే వెళ్లినప్పటికి మధ్యలో సడెన్‌గా బ్రేక్ డౌన్ అయింది. అయితే దురదృష్టవశాత్తూ కేబుల్ తెగింది. దీంతో కొండ మధ్యలో ఉన్న వాళ్లు దాదాపు 20 మీటర్ల ఎత్తు నుంచి కిందకు పడిపోగా.. చెట్ల మధ్యలో క్యాబిన్ ఇరుక్కుంది. ఈ ప్రమాదంలో ఈతా బిరాన్ ఫ్యామిలీతో సహా మిగతా 8 మంది అక్కడికక్కడే చనిపోయారు. కానీ బిరాన్ మాత్రం తీవ్ర గాయాలతో కోమాలోకి వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న సిబ్బంది హుటాహుటిన ఆ ప్రదేశానికి వెళ్లి చనిపోయినవారిని క్యాబిన్లో నుంచి బయటికి తీశారు. కాగా సిబ్బంది నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని.. బ్రేక్స్ సరిగా ఉన్నాయోల ఏదో చూసుకోకుండానే ఆపరేషన్ నిర్వహించినట్లు తేలింది. కాగా పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించి.. ప్రమాదానికి కారణమైన ముగ్గురి సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. -
పాపం ఆ పిల్లలేం చేశారు?
ఎందుకంత విరక్తి...? ఎందుకంత భయం...? ఎందుకంత కఠినత్వం...? కనుపాపలను కాపాడాల్సిన తల్లిదండ్రులే పిల్లల భవితవ్యాన్ని చిదిమేయడం ఎటువంటి సంకేతాలిస్తుంది. కన్నబిడ్డల్ని కడతేర్చి తాము సైతం బలవన్మరణానికి పాల్పడుతున్న తల్లిదండ్రులది కఠిన హృదయమా.. పిరికితనమా.. బాధ్యతారాహిత్యమా? సమాజం వారికి బతుకుపై ఆశ కలిగించలేదా? అనకాపల్లి మండలంలో ఇటీవల జరిగిన రెండు దుర్ఘటనల్లో మొత్తం ఏడుగురు ప్రాణాలు కోల్పోగా అందులో నలుగురు పిల్లలే కావడం గమనార్హం. గురువారం హుకుంపేట మండలంలో జరిగిన తాజా ఘటనలో మూడేళ్ల కుమార్తెను ఒంటరిని చేసి భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడడం మరింత విచారకరం. అనకాపల్లి: కొద్ది రోజుల క్రితం మదనపల్లిలో విద్యావంతులైన తల్లిదండ్రులు ఇద్దరు కుమార్తెలను చంపేశారు. వారికి ఇప్పుడు మానసిక చికిత్స అందిస్తున్నారు. అయితే వారి కథ, వారి తీరు, వారి ఒంటరితనం వేరు. కానీ అనకాపల్లి మండలంలో రెండు కుటుంబాల్లో ఏర్పడిన బలవన్మరణాలకు కారణం ఒకటి ఆర్థిక సమస్య అయితే, మరొకటి మానసిక ఒంటరితనం. జీవితంలో ఒక దశ దాటిన తర్వాత చావంటే భయం ఉండకపోవచ్చు. కానీ పిల్లల్ని పెద్ద చేసి వారికి మంచి భవిష్యత్తును ఇవ్వవలసిన బాధ్యత వారిపై ఉంది. ఎన్ని కష్టాలు ఎదురైనా వారు ఆ బాధ్యత నుంచి తప్పించుకోకూడదు. అనకాపల్లి మండలంలోని ముత్రాసుకాలనీలో కొద్ది నెలల క్రితం భార్య చనిపోయిందని మనస్తాపానికి గురైన భర్తకు జీవితంపై విరక్తి పుట్టింది. పలకరించేవారు లేరు, పట్టించుకునేవారు కరువు. తాను ఆత్మహత్యకు పాల్పడితే పిల్లల భవిష్యత్ ఎలా ఉంటుందోనన్న భయం, అనాథలుగా తన పిల్లలు మారుతారన్న ఆవేదన ఆ తండ్రిని కలచివేసింది. దీంతో పిల్లలిద్దరికీ విషం తాగించి తాను కూడా ఉరితాడుకు వేలాడాడు. బుధవారం జరిగిన ఈ ఘటన అనకాపల్లి మండలంలో అందరినీ బాధించింది. పాపం ఆ పిల్లలు ఏం చేశారు, వారిని చంపకుండా బాగుండేది కదా అని అందరూ చర్చించుకుంటున్నారు. అయితే అతను విరక్తి చెందిన సమయంలో బాధను పంచుకునేవారుగాని, మేమున్నామని భరోసా ఇచ్చేవారు గానీ ఉంటే ఈరోజు రెండు పసి హృదయాలు ప్రాణంతో నిలిచి ఉండేవి. అక్కడ మరీ దారుణం... అనకాపల్లి మండలంలోని బీఆర్టీ కాలనీకి చెందిన ఇద్దరు భార్యాభర్తలు ఆర్థికపరమైన వ్యాపారాలు చేసేవారు. పప్పుచిటీలు వేసి కొందరి వద్ద మోసపోయారు. ఇంటిని అప్పులిచ్చినవారు చుట్టుముడతారని భావించి, అవమానాన్ని ఎదుర్కొవాలని భయపడిన ఆ భార్యాభర్తలు వారి పిల్లలను ఏలేరు కాలువలోకి తోసి వారు కూడా నీటమునిగారు. ఆ కుటుంబంలో రెండు మృతదేహాలు, కొద్దిరోజుల తరువాత మరో రెండు మృతదేహాలు బయటపడ్డాయి. ఆ ఘటనలో కూడా పిల్లలిద్దరినీ బతకనిస్తే బాగుండేది కదా అని ఎన్నో గుండెలు తల్లడిల్లాయి. ఇక వివాహేతర సంబంధం విషయంలో గొడవ పడ్డ భార్యాభర్తలు హుకుంపేట మండలం మఠం పంచాయతీ బొండలమామిడిలో గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరి మూడేళ్ల కుమార్తె అనాథగా మిగిలింది. ఈ మూడు ఘటనలు ఇపుడు జిల్లాలోని అందరినీ వేధిస్తున్నాయి. వీరికి ధైర్యం చెప్పి.. బతుకులను సరిదిద్ది సరైన మార్గంలో పెట్టే బాధ్యత ఎవరైనా తీసుకుంటే ఎంత బాగుంటుంది! -
నా కుటుంబ సభ్యులందర్నీ కోల్పోయా..
కుప్పకూలిన విమానం : హృదయ విదారక గాథలు ఇథియోపియా విమాన ప్రమాదం పలు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. 157 ప్రయాణికులతో బయలు దేరిన బోయింగ్ 737–8 మ్యాక్స్ విమానం ఆఫ్రికా దేశంలోని ఇథియోపియా గగనతలంలో ఆదివారం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న సిబ్బంది, ప్రయాణికులు మొత్తం ప్రాణాలు కోల్పోయారు. ఇందులో నలుగురు భారతీయులు ఉన్నారు. అయితే ఒక్కొక్కరిదీ ఒక్కో విషాద గాథ. న్యూఢిల్లీకి చెందిన శిఖాగార్గ్ (అటవీ మంత్రిత్వ శాఖ ఐక్యరాజ్యసమితి డెవెలప్మెంట్ ప్రోగ్రామ్ కన్సల్టెంట్) , కెనడా కుటుంబం కథ వింటే హృదయం ద్రవించకమానదు. ఏడడుగులు వేసి మూడు నెలలే...కలలన్నీ కల్లలై ఢిల్లీకి చెందిన శిఖాకు ఇటీవల పెళ్లైంది. అంటే మూడు నెలల క్రితమే ప్రేమికుడు సౌమ్య భట్టాచార్యను వివాహం చేసుకున్నారు. మూడేళ్లకాలంలో చెప్పుకున్న ఊసులు, కన్న కలలునెరవేరకుండానే నవ వధువు శిఖా ఘోర ప్రమాదంలో దుర్మరణం చెందడం ఆమె భర్తను తీవ్రంగా కలిచి వేస్తోంది. విమానం ల్యాండ్ అయిన తరువాత ఫోన్ చేస్తానన్న భార్య మెసేజ్‌కు సమాధానం ఇచ్చేలోపే.. ఆమె తిరిగిరాని అనంత లోకాలకేగిపోయింది. అంతేకాదు నైరోబి నుంచి తిరిగి వచ్చిన తరువాత హనీమూన్‌కి వెళ్లాలని కూడా ప్లాన్ చేసుకున్నారట. నిజానికి భర్త భట్టాచార్యకూడా నైరోబి వెళ్లాల్సి వుంది. భార్య శిఖాతో పాటు టికెట్‌ను కూడా బుక్ చేసుకున్నారు. కానీ ఆఖరి నిమిషంలో అత్యవసర పని పడటంతో ప్రయాణాన్ని విరమించుకోవాల్సింది వచ్చింది. అదే ఆయన ప్రాణాలను నిలబెట్టింది.. కానీ తన ప్రాణానికి ప్రాణమైన సహచరిని శాశ్వతంగా దూరం చేసింది. కన్నవారికి కన్నభూమిని చూపించాలన్న ఆశ తీరనే లేదు కెనడాలోని సదరన్ ఒటారియా నగరం బ్రాంప్టన్‌కు చెందిన కుటుంబానిది మరో విషాద గాథ. ఒకే కుటుంబంలోని ఆరుగురు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. కోషా వైద్య, ప్రేరిత్ దీక్షిత్ దంపతులు తమ గారాల కుమార్తెలు అనుష్క (13), ఆషా(14)లతో కలిసి కెన్యాకు విహార యాత్రకు బయలుదేరారు. ముఖ్యంగా పిల్లలకు మార్చి సెలవులు రావడంతో తన జన్మభూమిని, తను పుట్టిన ఆసుపత్రిని కన్నబిడ్డలకు చూపించాలని తల్లి కోషా వైద్య ఆశపడ్డారు. అక్కడినుంచి సఫారీకి పోవాలని, ఇంకా కొన్ని ముఖ్యమైన ప్రదేశాలను పిల్లలకు చూపించాలని, సరదాగా గడపాలని ఎన్నో కలలు కన్నారు. తమతోపాటు తన తల్లిదండ్రులను కూడా తీసుకెళ్లారామె. కానీ ఆ ఆశ తీరకుండానే మొత్తం ఆరుగురూ ఈ ప్రమాదంలో చనిపోయారు. ఆప్తుల్ని కోల్పోయాను క్షణాల్లో అంతా శూన్యంగా మారిపోయిందని కోశ సోదరుడు మనంత్ వైద్య ఆవేదన వ్యక్తం చేశారు. తన ఆప్తులందర్నీ పోగొట్టుకున్నానంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఆశా, అనుష్క చదువులలో సరస్వతులు అని వారి స్కూలు ప్రిన్సిపల్ చెప్పారు. అలాగే ఆశా మంచి గాయని అనీ, అనుష్క భారత శాస్త్రీయ నృత్యం అన్నా, కంప్యూటర్స్ అన్నా బాగా ఇష్టపడేదని గుర్తు చేసుకున్నారు. ఇది తమ పాఠశాల సిబ్బందినీ, ఇతర విద్యార్థులను తీవ్ర విచారంలో ముంచేసిందన్నారు. వీరి మృతికి సంతాపంగా బ్రాంప్టన్ నగరంలోని సిటీ హాల్లో పతాకాన్ని తదుపరి ఆదేశాల దాకా హాఫ్స్టాఫ్ గా ఉంచాలని అధికారులు ఆదేశించడం విశేషం. కాగా ఈ ప్రమాదంలో కీలక ఆధారమైన బ్లాక్‌బాక్స్‌ను అధికారులు కొనుగొన్నారు. ఇందులో విమాన సమాచారం, కాక్‌పిట్ వాయిస్ రికార్డై ఉందని ఇథియోపియా ఎయిర్‌లైన్స్ పేర్కొంది. అయితే బ్లాక్‌బాక్స్ పాక్షికంగా దెబ్బతిందంటున్నఅధికారులు.. దాని నుంచి ఎంత సమాచారం పొందగలమనే దాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. -
కన్నతల్లిని ఇంటి నుంచి గెంటేసిన కొడుకులు