
‘సిక్స్ మెషీన్’గా గేల్ జీవిత చరిత్ర
ప్రపంచ క్రికెట్‌లో విధ్వంసకర బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు తెచ్చుకున్న క్రిస్ గేల్ జీవిత చరిత్ర పుస్తక రూపంలో రానుంది.
ప్రపంచ క్రికెట్‌లో విధ్వంసకర బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు తెచ్చుకున్న క్రిస్ గేల్ జీవిత చరిత్ర పుస్తక రూపంలో రానుంది. ‘సిక్స్ మెషీన్-ఐ డోన్ట్ లైక్ క్రికెట్... ఐ లవ్ ఇట్’ పేరు గల ఈ పుస్తకం జూన్ 2నాటికి మార్కెట్లోకి వస్తుంది. కింగ్‌స్టన్ వీధుల్లో తిండి కోసం ఖాళీ బాటిళ్లు దొంగతనం చేసిన నాటినుంచి దిగ్గజ క్రికెటర్‌గా ఎదిగే వరకు ఎన్నో స్ఫూర్తిదాయక అంశాలు ఇందులో ఉంటాయని గేల్ ప్రకటించాడు.