
పొన్నియిన్ సెల్వన్ చిత్ర కథా రచయిత, పత్రికా సంపాదకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు అయిన దివంగత కల్కి జీవిత చరిత్ర పుస్తకం రపంలో వెలువడనుంది. కల్కి మనవరాలు సీతా రవి, లక్ష్మి నటరాజన్ పుస్తకంగా తీసుకొస్తున్నారు. ప్రముఖ పాత్రికేయుడు ఎస్.చంద్రమౌళి కల్కీ పొన్నియిన్ సెల్వన్ సెల్వర్ పేరుతో కల్కీ జీవిత చరిత్రను రాశారు. ఇందులో అనేక ఆసక్తికరమైన అంశాలతోపాటు పొన్నియిన్ సెల్వన్ నవలకు సంబంధింన విశేషాలు ఉన్నాయి.
సోమవారం చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో దర్శకుడు తొలి ప్రతిని కల్కి మనవరాలు సీతా రవి, లక్ష్మి నటరాజన్‌కు అందజేశారు. ఆయన మాట్లాడుతూ దివంగత గొప్ప రచయిత కల్కి రచనలు తరాలకతీతంగా ఆదరణ పొందుతున్నాయని తెలిపారు.
ఆయన రాసిన నవల ఆధారంగా రపొందింన పొన్నియిన్ సెల్వన్ చిత్రం గత ఏడాది చివర్లో విడుదలై మంచి విజయాన్ని సాధించిందని పేర్కొన్నారు. దానికి రెండో భాగం విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా కల్కీ జీవిత చరిత్ర పుస్తకంగా రావడం సరైన తరుణంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.