తమిళ సినిమా: నటి అమలాపాల్ మళ్లీ తన పబ్లిసిటీ ఆటను మొదలెట్టింది. ఇటీవల ఓ చిత్రం నిర్మాణంలో తల మునకలై ఉన్న ఈమె ప్రస్తుతం.. ఆ పనిని ఓ ఓటీపీ సంస్థకు అప్పగించి మళ్లీ అవకాశాల వేటలో పడినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ అమ్మడు ఏదో ఒక అంశంతో వార్తల్లో ఉండే ప్రయత్నం చేస్తోంది. తాజాగా ఒక భేటీలో పేర్కొంటూ పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో తాను నటించాల్సి ఉందని, కొన్నేళ్ల క్రితం ఈ చిత్రంలో నటించే విషయమై దర్శకుడు మణిరత్నం పిలిచారని చెప్పింది. ఆయన అభిమానిని కావడంతో ఎంతో ఉత్సాహంగా ఆడిషన్‌లో పాల్గొన్నానని చెప్పింది.
అయితే ఆ చిత్రం అప్పట్లో ప్రారంభంకాలేదని, దీంతో తాను చాలా చింతించానని పేర్కొంది. ఆ తరువాత 2021లో అదే చిత్రం కోసం మణిరత్నం మళ్లీ తనను పిలిచారని చెప్పింది. అప్పుడు తనకు ఆ చిత్రంలో నటించాలని అనిపించకపోవడంతో నిరాకరించినట్లు తెలిపింది. అందువల్ల తానేమీ బాధపడటం లేదని చెప్పింది. ఇక చాలామంది తెలుగు సినిమాల్లో ఎందుకు నటించడం లేదు అడుగుతున్నారనీ, అక్కడ సినిమా కుటుంబాలు, అభిమానుల ఆధిక్యం పెరిగిపోయిందని పేర్కొంది.
ఒక్కో చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉంటున్నారని, ప్రేమ, పాటల సన్నివేశాల్లో గ్లామరస్‌గా నటించడం వంటి కమర్షియల్ అంశాలే చోటు చేసుకుంటున్నాయని చెప్పింది. అందుకే తెలుగులో చాలా తక్కువ చిత్రాల్లోనే నటింనట్లు అమలాపాల్ చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment