
సాక్షి, హైదరాబాద్: భారత ఫుట్‌బాల్ మాజీ కెప్టెన్, గత తరం దిగ్గజాల్లో ఒకడైన విక్టర్ అమల్‌రాజ్ బయోగ్రఫీ పుస్తక రూపంలో వచ్చింది. ‘మిడ్‌ఫీల్డ్ మాస్ట్రో’ పేరుతో వచ్చిన ఈ పుస్తకాన్ని సీనియర్ క్రీడా పాత్రికేయులు అభిజిత్‌సేన్ గుప్తా రచించారు. హైదరాబాద్‌నుంచి 21 మంది ఫుట్‌బాలర్లు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించగా...అందులో ఆరుగురు కెప్టెన్లుగా వ్యవహరించారు. వీరిలో విక్టర్ అమల్‌రాజ్ కూడా ఒకరు. 80వ దశకంలో మిడ్‌ఫీల్డర్‌గా భారత జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న అమల్‌రాజ్... కోల్‌కతాకు చెందిన ప్రఖ్యాత క్లబ్‌లు ఈస్ట్‌బెంగాల్, మొహమ్మదాన్ క్లబ్‌లకు కూడా సారథ్యం వహించారు.
Comments
Please login to add a commentAdd a comment