నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) జాతీయ అధ్యక్షుడు శరద్ పవార్ 83వ ఏట అడుగుపెట్టారు. 1940 డిసెంబర్ 12 న ఆయన జన్మించారు. శరద్ పవార్ తల్లి కూడా 1911లో డిసెంబర్ 12నే జన్మించడం విశేషం.
పవార్ తండ్రి పేరు గోవింద్ రావ్. నీరా కెనాల్ కోఆపరేటివ్ సొసైటీ (బారామతి)లో సీనియర్ అధికారి. గోవింద్‌రావ్ ఎంతో నిజాయితీతో మెలిగేవారు. పవార్ తల్లి శారదా బాయి వామపక్ష భావాలు కలిగిన కలిగిన రాజకీయ, సామాజిక కార్యకర్త. పూణే లోకల్ బోర్డుకు ఎన్నికైన మొదటి మహిళ.
రాజ్‌కమల్ ప్రచురించిన తన ఆత్మకథ ‘ఆన్ మై ఓన్ టర్మ్స్’లో శరద్ పవార్ తన తండ్రి క్రమశిక్షణ గల వ్యక్తి అని పేర్కొన్నారు. తెల్లవారుజామున నాలుగు గంటలకే నిద్రలేచి ఆరు గంటలకే ఆరోజు చేయాల్సిన పనులకు సిద్ధమయ్యేవారని తెలిపారు. క్రమం తప్పక వార్తాపత్రిక చదివేవారని, విధులు ముగించాక రాత్రి 8 గంటలకు నిద్రపోయేవారని, చాలా తక్కువ మాట్లాడేవారని శరద్ పవార్ ఆ పుస్తకంలో పేర్కొన్నారు.
తన తండ్రి అనుసరించే కఠినమైన క్రమశిక్షణ కారణంగా పిల్లలు అతనికి దూరంగా ఉండేవారని పవార్ తెలిపారు. ‘మేము ఏదైనా తప్పు చేసినా లేదా చదువులో మంచి ఫలితాలు రాకపోయినా, నాన్నకు దూరంగా ఉండేవాళ్లం. చదువులో నా రికార్డు సరిగా లేదు. నెలవారీ రిపోర్ట్ కార్డ్‌పై నాన్న చేత సంతకం చేయించాలంటే చాలా భయం వేసేది. కానీ అమ్మ చేత సంతకం చేయించడం చాలా సులభం. అందుకే నేను రిపోర్టు కార్డుపై అమ్మ చేత సంతకం చేయించేవాడినని శరద్‌పవార్ తన ఆత్మకథలో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: మెట్రో రెయిలింగ్‌పై మహిళ హైడ్రామా..
మరిన్ని వార్తల కోసం సాక్షి వాట్సాప్ ఛానల్ వీక్షించండి:
Comments
Please login to add a commentAdd a comment