
సాక్షి, బంజారాహిల్స్( హైదరాబాద్): తన తండ్రి అసభ్యంగా ప్రవర్తిస్తూ కొడుతున్నాడంటూ ఓ యువతి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బంజారాహిల్స్ రోడ్ నెం. 10లోని సింగాడికుంటలో నివసించే ఓ యువతిని ఈ నెల 14వ తేదీ ఉదయం తండ్రి మహ్మద్ యూసుఫ్, పిన తండ్రి ఫరూఖ్ ఇద్దరూ కలిసి కొట్టారని అడ్డు వచ్చిన తల్లి అమీష, సోదరి ఫర్హీదపై కూడా దాడి చేశారని ఆరోపించింది. కొంత కాలంగా తనతో పాటు తల్లీ, సోదరిని మానసికంగా వేదిస్తున్నాడని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించింది. దీంతో పోలీసులు యూసుఫ్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment