పాతికేళ్ల షారూఖ్ | Shah Rukh Khan launches biography, says the book made son ... | Sakshi
Sakshi News home page

పాతికేళ్ల షారూఖ్

Published Fri, Nov 11 2016 10:51 PM | Last Updated on Mon, Sep 4 2017 7:50 PM

పాతికేళ్ల   షారూఖ్

పాతికేళ్ల షారూఖ్

కెరీర్‌ని మొదలెట్టిన పాతికేళ్ల తర్వాత కూడా కింగ్ కింగ్‌లానే ఉన్నాడు. బంటు కాలేదు. బంట్రోతు కాలేదు. కొత్త నీరు ఎంతొచ్చినా వైరి పక్షాలు ఎందరిని నిలబెట్టినా నేటికీ షారుఖ్ నం.1గానే ఉన్నాడు. ఆమిర్, సల్మాన్ ఎన్ని సక్సెస్‌లు కొట్టినా ఎప్పుడూ క్రీజ్‌లో ఒక అడుగు ముందున్నాడు. ఇటీవలే 51 సంవత్సరాలు పూర్తి చేసుకున్న షారూఖ్ ఈ నెల 23న ‘డియర్ జిందగీ’ సినిమాతో ముందుకు రానున్నాడు. ఆలియా భట్ హీరోయిన్. ‘ఇంగ్లిష్ వింగ్లిష్’కు దర్శకత్వం వహించిన గౌరీ షిండే దర్శకురాలు.

ఈ నేపథ్యంలో అతడి పాతికేళ్ల సినీ జీవితంపై ‘ఎస్‌ఆర్‌కె 25 ఇయర్స్ ఆఫ్ లైఫ్’ బయోగ్రఫీ విడుదల కావడం అతడికి ఆనందాన్నిచ్చింది. దర్శకుడు సమర్‌ఖాన్ దీని రచయిత. ముంబైలో ఈ పుస్తక ఆవిష్కరణలో పాల్గొన్న షారూఖ్ ‘ఢిల్లీ నుంచి నా వంటి సాదాసీదా కుర్రాడు వచ్చి ఇంతదాకా ఎదగడం ఆశ్చర్యంగా ఉంటుంది. నేను చూడటానికి పెద్దగా బాగోను. నా మాట కూడా స్పీడ్‌గా ఉంటుంది. అయినా ఇంతవాణ్ణయ్యానంటే దర్శక నిర్మాతలు, అభిమానులే కారణం’ అన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement