shahrukh
-
ఇమ్రాన్ ఖాన్ నటనలో షారుక్, సల్మాన్‌లను మించిపోయారు
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బాలీవుడ్ దిగ్గజ నటులు సల్మాన్, షారుక్ ఖాన్‌లను మించి పోయారంటూ కామెంట్ చేశారు పాక్ నాయకుడు మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్. వజీరాబాద్‌లోని నిరసన ప్రదర్శనలో ఇమ్రాన్ ఖాన్‌పై కాల్పలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే కాల్పుల అనంతరం ఇమ్రాన్ ఖాన్ తనపై జరిగిన దాడిని హత్యయత్నంగా పేర్కొన్నారు. కానీ పాక్ డెమోక్రటిక్ మూవ్మెంట్ చీఫ్ మౌలానా ఫ్లజుర్ మాత్రం ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. తాను తొలుత ఇమ్రాన్ ఖాన్‌పై జరిగిన ఘటన గురించి విని బాధపడ్డాను కానీ ఇప్పడూ ఇది ఒక డ్రామాలా కనిపిస్తోందన్నారు. "ఖాన్ శరీరంలోకి దిగిన బుల్లెట్ ఎలా ముక్కలుగా అయిపోతుంది. శరీరంలో పేలుడు ముక్కలు దిగడం గురించి విన్నాం ఇలాంటిది ఎప్పడూ వినలేదు. ఖాన్‌పై దాడి గురించి విన్నప్పుడూ తాను ఖండించానని చెప్పారు. కానీ ఎక్కడైన బాంబు శకలాలు శరీరంలోకి దిగడం చూశాం కానీ బుల్లెట్ శకలాలు శరీరంలో దిగడం ఏమిటో అర్థం కావడం లేదు. ఐనా ఆయనపై జరిగింది కాల్పులు కానీ బాంబు దాడి కాదన్నారు." ఖాన్‌కి బుల్లెట్ గాయాలైనప్పుడూ క్యాన్సర్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. ఖాన్ చికిత్స తీసుకుంటున్న షౌకత్ ఖనుమ్ హాస్పిటల్ ఆయన చారిటబుల్ సంస్థ నిర్వహస్తున్న ఆస్పత్రేనని చెప్పారు. అలాగే వైద్యుల స్టేట్మెంట్లు కూడా చాలా విరుద్దంగా ఉన్నాయన్నారు ఫజ్లుర్ రెహ్మాన్ . (చదవండి: రాత్రికి రాత్రే కోటిశ్వరులుగా మారిన పోలీసులు..దెబ్బకు అకౌంట్ బ్లాక్!) -
పాక్ దెబ్బ షారుఖ్‌కి పడదు..!
వచ్చే నెల వస్తున్న ‘రయీస్’ సినిమా విషయంలో షారుఖ్‌కి పెద్దగా కష్టాలు ఉండకపోవచ్చు అని చెప్పవచ్చు. దేశమంతా పెద్దనోట్ల రద్దు, చిల్లర కష్టాల్లో మునగడం ఒక కారణం అయితే, ఇండియా కూడా పాక్‌కు దీటైన చెబుతూ ఉండటం మరో కారణం. ఇంతకీ సంగతేమి టంటే ‘రయీస్’లో పాకిస్తాన్ హీరో యిన్ మాహిరా ఖాన్ నటించింది. ‘పాక్ వాళ్లు ఎవరైనా మన సినిమాల్లో నటిస్తే ఆ సినిమాలను నిషేధించండి’ అని గతంలో రాజ్ థాక్రే నుంచి హెచ్చరిక వచ్చింది. దాని నుంచి బయటపడటానికి పాక్ వాళ్లు నటించిన ‘ఏ దిల్ హై ముష్కిల్’ సినిమా చాలా తిప్పలు పడాల్సి వచ్చింది. అయితే పాక్ హీరో అలీ జాఫర్ నటించిన ‘డియర్ జిందగీ’కి ఈ సమస్యలు తగ్గాయి. దానికి కారణం దేశంలో నెలకొన్న పరిస్థితులే. కనుక ఇప్పుడు ‘రయీస్’కి కూడా ఏ అడ్డంకులూ ఉండవని భావిస్తున్నారు. 1980లలో గుజరాత్లో మద్యం మాఫియాను నడిపిన ‘రయీస్ ఆలమ్’ అనే వ్యక్తి జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ పాత్రను షారుఖ్ ధరించగా ఇతని ఆట కట్టించే పోలీస్ ఆఫీసర్ ఏసిపి మజ్ముదర్ పాత్రలో నవాజుద్దీన్ సిద్దిఖీ నటించాడు. -
పాతికేళ్ల షారూఖ్
కెరీర్‌ని మొదలెట్టిన పాతికేళ్ల తర్వాత కూడా కింగ్ కింగ్‌లానే ఉన్నాడు. బంటు కాలేదు. బంట్రోతు కాలేదు. కొత్త నీరు ఎంతొచ్చినా వైరి పక్షాలు ఎందరిని నిలబెట్టినా నేటికీ షారుఖ్ నం.1గానే ఉన్నాడు. ఆమిర్, సల్మాన్ ఎన్ని సక్సెస్‌లు కొట్టినా ఎప్పుడూ క్రీజ్‌లో ఒక అడుగు ముందున్నాడు. ఇటీవలే 51 సంవత్సరాలు పూర్తి చేసుకున్న షారూఖ్ ఈ నెల 23న ‘డియర్ జిందగీ’ సినిమాతో ముందుకు రానున్నాడు. ఆలియా భట్ హీరోయిన్. ‘ఇంగ్లిష్ వింగ్లిష్’కు దర్శకత్వం వహించిన గౌరీ షిండే దర్శకురాలు. ఈ నేపథ్యంలో అతడి పాతికేళ్ల సినీ జీవితంపై ‘ఎస్ఆర్కె 25 ఇయర్స్ ఆఫ్ లైఫ్’ బయోగ్రఫీ విడుదల కావడం అతడికి ఆనందాన్నిచ్చింది. దర్శకుడు సమర్ఖాన్ దీని రచయిత. ముంబైలో ఈ పుస్తక ఆవిష్కరణలో పాల్గొన్న షారూఖ్ ‘ఢిల్లీ నుంచి నా వంటి సాదాసీదా కుర్రాడు వచ్చి ఇంతదాకా ఎదగడం ఆశ్చర్యంగా ఉంటుంది. నేను చూడటానికి పెద్దగా బాగోను. నా మాట కూడా స్పీడ్‌గా ఉంటుంది. అయినా ఇంతవాణ్ణయ్యానంటే దర్శక నిర్మాతలు, అభిమానులే కారణం’ అన్నాడు. -
ఆటోను ఢీకొట్టిన లారీ.. ఐదుగురి మృతి
-
ఆటోను ఢీకొట్టిన లారీ.. ఐదుగురి మృతి
నెల్లూరు జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న లారీ రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆటోతో పాటు మరో లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. వివరాలు.. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రోడ్లన్ని ధ్వంసం అయ్యాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు రోడ్డు మరమ్మత్తు పనులను నిర్వహిస్తున్నారు. ఈ పనుల్లో భాగంగా.. బండరాళ్లను తరలిస్తున్న లారీ ఈరోజు ఉదయం నెల్లూరు మండలం నవీపేట సమీపంలో పంక్చర్ అయింది. దీంతో లారీ డ్రైవర్ తిరుపతయ్య లారీని రోడ్డు పక్కకు తీసి టైరును మార్చేందుకు నలుగురు మెకానిక్ లను తీసుకు వచ్చాడు. పంక్చర్ వేసేందుకు ఇద్దరు మెకానిక్‌లు లారీ కిందికి వెళ్లగా.. మరో ఇద్దరు... పక్కనే నిల్చున్నారు. ఈ సమయంలో చెన్నై కి వెళుతున్న లారీ.. మెకానిక్ ల ఆటోతో పాటు.. లారీ ముందున్న బండరాళ్లను ఢీకొట్టింది. దీంతో లారీ కింద పని చేస్తున్న ఇద్దరు మెకానిక్‌లు శివ(19), షారుఖ్(18), లతోపాటు పక్కనే ఉన్న లారీ డ్రైవర్ తిరుపతయ్య(40), శషి(20) తో పాటు మరో వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందారు. మృతదేహాలు లారీ కింద నలిగి పోయి మృతి చెందారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
షారుఖ్ ఏం చేశాడు క్యాట్?!
గాసిప్ బాలీవుడ్ ప్రపంచంలోకి సునామీలా దూసుకొచ్చి, కన్నుమూసి తెరిచేలోగా టాప్ హీరోయిన్ అయిపోయిన కత్రినా... అంతే వేగంగా వివాదాలలోనూ చిక్కుకుంది. సల్మాన్‌తో చెట్టాపట్టాలు, రణబీర్‌తో రహస్య ప్రేమతో వార్తల్లోకి ఎక్కింది. ఇప్పుడు తాజాగా ఓ స్టార్ హీరోతో చేయడానికి నో చెప్పి మరోసారి న్యూస్‌లో నిలిచింది. నిన్నటివరకూ షారుఖ్ నటిస్తోన్న ఓ చిత్రంలో కత్రినా ఐటెమ్ సాంగ్ చేయబోతోందన్న వార్త హల్చల్ చేసింది. అయితే అలాంటిదేమీ లేదని, అది వట్టి పుకారని, కత్రినా చాలా బిజీగా ఉన్నందున ఐటెమ్ సాంగులు చేయబోదని మేనేజర్ ఇవాళ కుండ బద్దలు కొట్టేశాడు. అయితే బిజీగా ఉండటం వల్ల కాదని, నిజానికి కత్రినా షారుఖ్‌తో చేయడానికి ఇష్టపడలేదని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అంతగా వారిద్దరి మధ్య శత్రుత్వం ఏముందా అని కొందరు కూపీలు లాగే పనిలో కూడా పడ్డారు. -
ఫేస్ ఆఫ్!
నిన్నమొన్నటి దాకా ఎడమొహం పెడమొహంగా ఉన్న షారూఖ్,సల్మాన్‌ఖాన్‌లు మళ్లీ ఒక్కటై ఎంజాయ్ చేస్తుంటే... ఈ మధ్య వరకు మంచి మిత్రులైన దీపికాపడుకొనే, అనుష్కాశర్మలు ఎవరికి వారుగా తిరుగుతున్నారు. షారూఖ్‌ఖాన్ బర్త్‌డే పార్టీకి అటెండైన ఈ భామలు... పలకరించుకోలేదట. ఢిల్లీలో జరిగిన టెన్నిస్ ప్రీమియర్ లీగ్‌లో ఎదురు పడినా కనీసం విష్ కూడా చేసుకోలేదట. విషయమేమంటే.. ఒకప్పటి అనుష్కా బాయ్‌ఫ్రెండ్ రణవీర్‌సింగ్‌తో ఇప్పుడు దీపిక డేటింగ్ చేస్తోందట. అందుకే అనుష్కకు మండుతోందని ఓ వెబ్సైట్ కథనం. అలాగే దీపిక ఒకప్పటి డేటింగ్ ఫ్రెండ్ రణబీర్‌కపూర్‌కు కత్రినా వలేసింది. కత్రినతో జతకట్టిన అనుష్కా... దీపికపై కారాలు మిరియాలు నూరుతోందట. -
'షారుక్ ఖాన్' హ్యాపీ న్యూ ఇయర్ మూవీ ట్రైలర్ లాంచ్
-
ఓ ట్వీట్ షారుఖ్ జీవితాన్నే మార్చేసింది
ఒక తప్పుడు ట్వీట్ షారుఖ్ ఖాన్ జీవితాన్నే మార్చేసింది. ఎవరో షారుఖ్ పేరిట ఒక నకిలీ ట్వీట్ ను పంపించారు. అందులో 'నరేంద్ర మోడీ పీఎం అయితే ట్విట్టర్ నే కాదు, ఏకంగా నేనీ దేశాన్నే వదిలేస్తాను' అని ఉంది. దీంతో షారుఖ్ పై విమర్శల వెల్లువ కురిసింది. ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రధాని అయ్యారు కాబట్టి దేశాన్ని వదిలిపొమ్మంటూ ఆయనపై ట్వీట్ బాణాలు వందలకొద్దీ వచ్చి పడ్డాయి. దీంతో ఖంగుతిన్న షారుఖ్ తక్షణం ట్విట్టర్ ద్వారానే అసలు తానీ ట్వీట్ ను పంపనే లేదని, ఈ ట్వీట్ దానిలోని గ్రామర్ తప్పుల్లానే ఓ పిచ్చాడి ట్రిక్కు అని ఆయన జవాబిచ్చారు. ఈ ట్వీట్ కి తనకు సంబంధం లేదని కూడా ఆయన అన్నారు.