ఓ ట్వీట్ షారుఖ్ జీవితాన్నే మార్చేసింది | Fake tween torments Sharukh | Sakshi
Sakshi News home page

ఓ ట్వీట్ షారుఖ్ జీవితాన్నే మార్చేసింది

Published Mon, May 19 2014 5:14 PM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM

ఓ ట్వీట్ షారుఖ్ జీవితాన్నే మార్చేసింది - Sakshi

ఓ ట్వీట్ షారుఖ్ జీవితాన్నే మార్చేసింది

ఒక తప్పుడు ట్వీట్ షారుఖ్ ఖాన్ జీవితాన్నే మార్చేసింది. ఎవరో షారుఖ్ పేరిట ఒక నకిలీ ట్వీట్ ను పంపించారు. అందులో 'నరేంద్ర మోడీ పీఎం అయితే ట్విట్టర్ నే కాదు, ఏకంగా నేనీ దేశాన్నే వదిలేస్తాను' అని ఉంది. దీంతో షారుఖ్ పై విమర్శల వెల్లువ కురిసింది. ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రధాని అయ్యారు కాబట్టి  దేశాన్ని వదిలిపొమ్మంటూ ఆయనపై ట్వీట్ బాణాలు వందలకొద్దీ వచ్చి పడ్డాయి.

దీంతో ఖంగుతిన్న షారుఖ్ తక్షణం ట్విట్టర్ ద్వారానే అసలు తానీ ట్వీట్ ను పంపనే లేదని, ఈ ట్వీట్ దానిలోని గ్రామర్ తప్పుల్లానే ఓ పిచ్చాడి ట్రిక్కు అని ఆయన జవాబిచ్చారు. ఈ ట్వీట్ కి తనకు సంబంధం లేదని కూడా ఆయన అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement