ఆటోను ఢీకొట్టిన లారీ.. ఐదుగురి మృతి | The five killed in larry - auto collision | Sakshi
Sakshi News home page

ఆటోను ఢీకొట్టిన లారీ.. ఐదుగురి మృతి

Published Tue, Nov 24 2015 3:04 PM | Last Updated on Sat, Oct 20 2018 6:04 PM

The five killed in larry - auto collision

నెల్లూరు జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న లారీ రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆటోతో పాటు మరో లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు.  వివరాలు.. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రోడ్లన్ని ధ్వంసం అయ్యాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు రోడ్డు మరమ్మత్తు పనులను నిర్వహిస్తున్నారు. ఈ పనుల్లో భాగంగా.. బండరాళ్లను తరలిస్తున్న లారీ ఈరోజు ఉదయం నెల్లూరు మండలం నవీపేట సమీపంలో పంక్చర్ అయింది.


 దీంతో లారీ డ్రైవర్ తిరుపతయ్య లారీని రోడ్డు పక్కకు తీసి టైరును మార్చేందుకు నలుగురు మెకానిక్ లను తీసుకు వచ్చాడు. పంక్చర్ వేసేందుకు ఇద్దరు మెకానిక్‌లు లారీ కిందికి వెళ్లగా.. మరో ఇద్దరు... పక్కనే నిల్చున్నారు. ఈ సమయంలో చెన్నై కి వెళుతున్న లారీ.. మెకానిక్ ల ఆటోతో పాటు.. లారీ ముందున్న బండరాళ్లను ఢీకొట్టింది. దీంతో లారీ కింద పని చేస్తున్న ఇద్దరు మెకానిక్‌లు శివ(19), షారుఖ్(18), లతోపాటు పక్కనే ఉన్న లారీ డ్రైవర్ తిరుపతయ్య(40), శషి(20) తో పాటు మరో వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందారు. మృతదేహాలు లారీ కింద నలిగి పోయి మృతి చెందారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement