Sasi
-
పెళ్లిరోజే తనువు చాలించింది
-
ఈ జీవితం నాకొద్దు
పెళ్లిరోజే తనువు చాలించింది అత్తింటి వారి వేధింపులతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి బలవన్మరణం సనత్‌నగర్: ప్రేమించుకున్నారు..అందరినీ ఒప్పించి పెళ్ళి చేసుకున్నారు.. అయితే పెళ్లయిన ఆరు నెలలకే అత్తింటి వారు వేధింపులకు ఆమె తాళలేకపోయింది...పోలీసులకు ఫిర్యాదు చేసింది. కౌన్సెలింగ్ ఇచ్చినా ఫలితం లేకపోయింది...దీంతో తీవ్ర మనస్థాపంతో సరిగ్గా పెళ్లయిన ఏడాదికి.. అదీ పెళ్లిరోజే(శనివారం) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బేగంపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన గురించి పోలీసులు తెలిపిన మేరకు.. బేగంపేటకు చెందిన భాగ్యలక్ష్మి (29) ఏఎండీ సంస్థలో ఉద్యోగి. కర్మన్‌ఘాట్‌కు చెందిన శశి గూగుల్ సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తున్నాడు. వీరిద్దరూ ప్రేమించుకుని గత ఏడాది మార్చి 25న వివాహం చేసుకుని బేగంపేటలోని ఏఎండీ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు. ఆరు నెలల పాటు సజావుగా సాగిన కాపురంలో విబేధాలు తలెత్తాయి. అత్తింటివారు మానసికంగా వేధిస్తున్నారంటూ భాగ్యలక్ష్మి కొన్ని నెలల క్రితం బేగంపేట మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు దంపతులకు కౌన్సెలింగ్ నిర్వహించినప్పటికీ ఫలితం లేదు. శనివారం దంపతుల పెళ్ళిరోజు కావడం..భర్త తన వద్ద లేకపోవడం.. అత్తింటి వారి వేధింపులు...వెరసి మానసికంగా కుంగిపోయిన ఆమె శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అత్తింటి వేధింపుల కారణంగానే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బేగంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఆమె ఉరేసుకున్న గది గోడలపై సూసైడ్ నోట్ రాసింది. నా చావుకు కారణం భర్త శశి, అత్తింటి కుటుంబసభ్యులు మంజుల, భాస్కర్, రమణిలు. మానసికంగా హింసించారు. భర్త నా మాట వినకుండా విడిపోయాడు. నేను చనిపోయాక నా శవాన్నీ, నాకు సంబంధించిన వస్తువులను ఎవరూ ముట్టుకోనీయవద్దు...బేగంపేట పోలీసులనూ వారు కొనేశారు...వాళ్లను నమ్మవద్దు...అంటూ గోడపై రాసి పెట్టింది. పోలీసులు అత్తింటివారిని అదుపులోకి తీసుకున్నారు. -
ఈ పోరాటంలో పరాజితులు ఎవరు?
నమస్తే సార్, నా పేరు శశి. అప్పట్లో కొబ్బరిచెట్లెక్కి కాయలు తెంపడం నా వృత్తి. కానీ, 18 ఏళ్ల కిందట ఓ రోజు చెట్టుమీద నుంచి కిందపడ్డా. వెన్నెముక, మెదడులో తేడా కొట్టింది. పక్షవాతం వచ్చినట్లు కాలు, చెయ్యి పడిపోయాయి. వైద్యం కోసం చాలానే అప్పు చేశాం. ఏదో ఒక పని చెయ్యనిదే ఇల్లూ గడవదు, అప్పూ తీరదు. అలాగని మిమ్మల్ని డబ్బులు అడుగుతానని అనుకోవద్దు! మా ఇంటికి దూరంగా ఒకచోట బడ్డీ కొట్టు పెట్టాలనుకుంటున్నా. నడవలేనుకదా, ప్రభుత్వం నుంచి నాకొక మూడు చక్రాల బండిని ఇప్పించండయ్యా అని పంచాయితీ పెద్దలను వేడుకున్నా. వాళ్లు నాతో ఏం చెప్పారో తెలుసా? ‘శశి బాబూ, నీ ఇంటికి రోడ్డు లేదుకదయ్యా! చక్రాల బండి ఇంచ్చినా ఉపయోగం ఉండదు. కాబట్టి వ్వలేం’అని! నేను బతకాలంటే బండి కావాలి.. బండి కావాలంటే రోడ్డు ఉండాలి.. ఇది అర్థమయ్యాక రోడ్డు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టా. మండలం ఆఫీసు, జిల్లా ఆఫీసులకెళ్లి అర్జీలు పెట్టా. అయినా, ఊళ్లో పంచాయితీవాళ్లే పట్టించుకోనిది పట్నంలో నా గోస ఎవరికి లెక్క? అలా కొన్నేళ్లుగడిచాయి. మా ఊళ్లో మేముండే పేట సరిగ్గా గుట్టల మధ్య ఉంటుంది. ఎటైనా పోవాలంటే చిన్నా, పెద్దా అందరూ గుట్ట ఎక్కి దిగాల్సిందే. ఒకరోజెందుకో ‘నా రోడ్డు నేనే తొవ్వుకుంటే పోదా!’ అనిపించింది. ఆ ఆలోచన నాలో ఏదో శక్తిని నింపింది. వెంటనే పార పట్టుకుని గుట్ట తొవ్వడం మొదలెట్టా. పనికి వెళ్లిన ఇంటావిడ సాయంత్రానికి ఇంటికొచ్చి నన్ను చూసి ఏడ్చినంత పని చేసింది. నా చేతుల్లోని పార తీసుకొని అవతల పారేసింది. ఎందుకో ఆమె మాట వినాలనిపించలేదు. పట్టుదలగా గుట్టను తొవ్వా. ఒకటి.. రెండు.. మొత్తం మూడేళ్లు పట్టింది. ఇప్పుడు మూడు చక్రాల బండి వెళ్లగలిగేంత దారి ఉంది నా ఇంటికి. మరి చక్రాల బండి ఇచ్చేదెవరు? ఇంకో నెల రోజుల్లో పని పూర్తవుతుంది. మూడేళ్ల నుంచి నేను గుట్టను తొవ్వుతున్న సంగతి అందరికీ తెలుసు.. పంచాయితీ పెద్దలు, ప్రభుత్వాధికారులకు కూడా! అయితే వాళ్లేమీ మాట్లాడటంలేదు. నేను కూడా వాళ్లను కలవడం మానేశా. నాకు చక్రాల బండి దక్కకపోయినా, మా పేటకి రోడ్డు వేశాన్న సంతోషం మిగిలింది. ఇది.. కేరళలోని తిరువనంతపురం జిల్లా శివారు గ్రామానికి చెందిన శశి అనే వ్యక్తి కథనం. కాలూచెయ్యి పనిచేయకున్నా, కుంటుకుంటూ ఒంటరిగా మూడేళ్లు శ్రమించి గుట్టను తొలిచిన ఈయన నిజజీవిత గాథ.. బిహార్ ‘మౌంటెయిన్ మ్యాన్’ దశరథ్ మాంఝీని తలపిస్తుంది. నాడు మాంఝీకి జరిగినట్లే.. నేడు శిశికి కూడా వ్యవస్థ నుంచి ఆదరణ కరువైంది. అయినాసరే, ఇవేవీ పట్టించుకోకుండా వారు పోరాడారు.. పోరాడుతూనే ఉన్నారు.. -
శశి విద్యార్థులకు ప్రతిభ అవార్డులు
ఉండ్రాజవరం, (తణుకు టౌన్) : వేలివెన్ను, కానూరు శశి విద్యాసంస్థలకు చెందిన 10వ తరగతి విద్యార్థులు ప్రతిభ అవార్డులకు ఎంపికైనట్టు శశి విద్యా సంస్థల చైర్మన్ బూరుగుపల్లి వేణుగోపాలకష్ణ తెలిపారు. వేలివెన్ను క్యాంపస్‌కు సంబంధించి పోతుల దుర్గాప్రసాద్, గూడపాటి బాలకష్ణ, కురం రాణి, కానూరు కాంపస్ నుంచి బద్ది దుర్గాభవాని, ఉప్పలపాటి మౌనిక, వెంపాటి సూర్యతేజ, నంద్యాల నవ్యశ్రీ, తాడి ఆమని, యారసామి లోహితలక్ష్మి ఎంపికైనట్టు తెలిపారు. విద్యార్థులను శశి విద్యాసంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మేకా నరేంద్ర కష్ణ, క్రాంతిసుధ అభినందించారు. -
చెన్నైలో తణుకు యువకుడి దుర్మరణం
తణుకు టౌన్ : శశి విద్యాసంస్థల తణుకు క్యాంపస్ ఇన్చార్జి నిమ్మగడ్డ రాజేంద్రప్రసాద్ కుమారుడు రాఘవేంద్ర (26) చెన్నైలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మంగళవారం మృతి చెందారు. చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న రాఘవేంద్ర ఉద్యోగ విధులకు వెళ్తున్న సమయంలో బస్సు ఢీకొని మరణించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. రాఘవేంద్ర మృతి పట్ల శశి విద్యా సంస్థల చైర్మన్ బూరుగుపల్లి వేణుగోపాల కృష్ణ, నిడదవోలు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు తదితరులు సంతాపం తెలిపారు. రాజేంద్రప్రసాద్ దంపతులను పరామర్శించి ఓదార్చారు. రాఘవేంద్ర మృతదేహం చెన్నై నుంచి మంగళవారం రాత్రికి తణుకు చేరుకుంటుందని, బుధవారం రాజేంద్రప్రసాద్ స్వగ్రామం ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెంలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. -
ఆటోను ఢీకొట్టిన లారీ.. ఐదుగురి మృతి
నెల్లూరు జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న లారీ రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆటోతో పాటు మరో లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. వివరాలు.. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రోడ్లన్ని ధ్వంసం అయ్యాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు రోడ్డు మరమ్మత్తు పనులను నిర్వహిస్తున్నారు. ఈ పనుల్లో భాగంగా.. బండరాళ్లను తరలిస్తున్న లారీ ఈరోజు ఉదయం నెల్లూరు మండలం నవీపేట సమీపంలో పంక్చర్ అయింది. దీంతో లారీ డ్రైవర్ తిరుపతయ్య లారీని రోడ్డు పక్కకు తీసి టైరును మార్చేందుకు నలుగురు మెకానిక్ లను తీసుకు వచ్చాడు. పంక్చర్ వేసేందుకు ఇద్దరు మెకానిక్‌లు లారీ కిందికి వెళ్లగా.. మరో ఇద్దరు... పక్కనే నిల్చున్నారు. ఈ సమయంలో చెన్నై కి వెళుతున్న లారీ.. మెకానిక్ ల ఆటోతో పాటు.. లారీ ముందున్న బండరాళ్లను ఢీకొట్టింది. దీంతో లారీ కింద పని చేస్తున్న ఇద్దరు మెకానిక్‌లు శివ(19), షారుఖ్(18), లతోపాటు పక్కనే ఉన్న లారీ డ్రైవర్ తిరుపతయ్య(40), శషి(20) తో పాటు మరో వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందారు. మృతదేహాలు లారీ కింద నలిగి పోయి మృతి చెందారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
మామా కోడళ్ల దారుణ హత్య
న్యూఢిల్లీ: న్యూఢిల్లీలోని తూర్పు పటేల్ నగర్లో మామా కోడళ్ల దారుణ హత్య కలకలం రేపింది. ఆదివారం సాయంత్రం మామ, కోడలిపై దాడి చేసిన దుండగులు పలుసార్లు కత్తితో పొడిచి హత్య చేసి పారిపోయారు. అయితే ఇంటి లోపల వేసిన గడియ వేసినట్టే వుంది. కానీ సాయంత్రానికి ఇద్దరూ శవాలు అయ్యారు. వివరాల్లోకి వెళితే... మృతుడు సీపీడబ్ల్యూడీలో ఇంజనీర్‌గా పనిచేసి రిటైర్డ్ అయిన సేవారాం కటారియా (90) తన కొడుకు సుధీర్, కోడలు శశితో కలిసి జీవిస్తున్నారు. రోజూలాగానే సుధీర్ మధ్యాహం ఒకటిన్నరకు ఉద్యోగానికి వెళ్లారు. దాదాపు అయిదు సంవత్సరాల నుంచి ఆ ఇంట్లో పని చేస్తున్న ఆమె వచ్చి తన పని తను చేసుకొని వెళ్లిపోయింది. విధుల నుంచి ఇంటికి తిరిగి వచ్చిన సుధీర్, ఎన్నిసార్లు కాలింగ్ బెల్ కొట్టినా ఎంతకూ భార్య తలుపు తలుపు తీయకపోవడంతో, మొబైల్‌కు కాల్ చేశాడు. అయినా స్పందన లేదు. దీంతో అనుమానం వచ్చిన తన కుమార్తె వద్ద ఉన్న మారు తాళంతో తలుపు తీసి చూశాడు. ఒకవైపు గుమ్మం దగ్గర తండ్రి శవం, మరోవైపు మంచంపై భార్య విగతజీవిగా పడి ఉండడాన్ని చూసి షాకైయ్యాడు. తండ్రి గొంతు కోసిన ఆనవాళ్లు, పలుమార్లు కత్తితో దాడి చేసిన గుర్తులు చూసి బెంబేలెత్తిన సుధీర్ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలం నుంచి రక్తపు మరకలతో ఉన్నరెండు కత్తెరలను స్వాధీనం చేసుకున్నారు. మృతురాలి ఒంటిపై నగలు, ఇంట్లోని విలువైన వస్తువులు ఎక్కడివక్కడే అలాగే వుండడంతో, ఇది దొంగల పనికాదని, బాగా తెలిసిన వారే ఈ హత్యకు పాల్పడి వుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంట్లో అందరూ కలసి టీ తాగిన గుర్తుగా పడి ఉన్న ఖాళీ కప్పులు పోలీసుల అనుమానానికి మరింత బలపరుస్తున్నాయి. తెలిసినవారే తాపీగా టీ తాగి, నమ్మించి, సేవారాం కటారియా, శశిలపై దాడి చేసి, హత్య చేసిన అనంతరం వెనకనుంచి పారిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసామని, పనిమనిషిని ప్రశ్నిస్తున్నట్లు డీసీపీ పరమాదిత్య తెలిపారు. -
తప్పు ఎవరిది?
వంశీ సినిమా ‘సరదాగా కాసేపు’ కథానాయిక మధురిమ గుర్తుంది కదూ! తను తాజాగా ‘సేందు పోలామ్’ అనే తమిళ సినిమాలో నటిస్తున్నారు. ఆ చిత్ర దర్శక నిర్మాతలకు మధురిమకు మధ్య యుద్ధం నడుస్తోంది. ఆ కథ ఏంటంటే.. ఇటీవలే ఆ సినిమాకు సంబంధించి న్యూజి ల్యాండ్‌లో 50 రోజుల పాటు భారీ షెడ్యూల్ చేశారు. ఈ షెడ్యూల్లో మధురిమ సకాలంలో షూటింగ్‌కి హాజరు కాకపోవడంతో ఇబ్బందులపాలయ్యామని దర్శకుడు అనిల్ కుమార్, నిర్మాత శశి ఆరోపిస్తున్నారు. ఉదయం ఏడు గంటలకు షూటింగ్ అంటే, ఆ సమయానికి రాకుండా తన ఇష్టం వచ్చినట్లు మధురిమ వచ్చేదని అనిల్ వాపోతున్నారు. న్యూజిల్యాండ్‌లో ఓ అధునాతన కెమెరాని అద్దెకి తీసుకున్నామని, అక్కడి టెక్నీషియన్ని నియమించుకున్నామని అనిల్ అన్నారు. అయితే, మధురిమ సహకరించకపోవడంవల్ల అనుకున్న రోజుల్లో పూర్తి చేయలేకపోయామని చెప్పారు. మధురిమ కథనం వేరేలా ఉంది. తల్లిదండ్రులు లేకుండా ఒంటరిగా షూటింగ్స్‌కి వెళ్లనని, కానీ, వీసా వ్యవహారాలు చూసే వ్యక్తి నిర్లక్ష్యం కారణంగా తన తల్లి న్యూజిల్యాండ్‌కి రాలేకపోయారని మధురిమ అన్నారు. ఒంటరిగా వెళ్లిన తనకు పర్సనల్ అసిస్టెంట్‌ని కూడా సమకూర్చలేదని, తన పారితోషికంలో పది శాతం అడ్వాన్స్ అయినా ఇవ్వలేదని మధురిమ తెలిపారు. ఈ చిత్రం కారణంగా తను కమిట్ అయిన వేరే చిత్రాలకు ఇబ్బంది ఏర్పడిందని, 90 శాతం సినిమా పూర్తయినా పారితోషికం గురించి మాట్లాడకపోవడంతో, ప్రశ్నించానని ఆమె పేర్కొన్నారు. పారితోషికం గురించి అడిగినందుకే తనను ‘క్రిమినల్’లా చిత్రిస్తున్నారని కూడా వాపోయారు. అనిల్ మాటలు వింటే అతనిదే కరెక్ట్ అనిపిస్తుంది. మధురిమ మాటలు వింటే తన వైపే న్యాయం ఉన్నట్లుగా అనిపిస్తుంది. మరి.. తప్పెవరిదో?