పాక్ దెబ్బ షారుఖ్‌కి పడదు..!
వచ్చే నెల వస్తున్న ‘రయీస్’ సినిమా విషయంలో షారుఖ్‌కి పెద్దగా కష్టాలు ఉండకపోవచ్చు అని చెప్పవచ్చు. దేశమంతా పెద్దనోట్ల రద్దు, చిల్లర కష్టాల్లో మునగడం ఒక కారణం అయితే, ఇండియా కూడా పాక్‌కు దీటైన చెబుతూ ఉండటం మరో కారణం. ఇంతకీ సంగతేమి టంటే ‘రయీస్’లో పాకిస్తాన్ హీరో యిన్ మాహిరా ఖాన్ నటించింది. ‘పాక్ వాళ్లు ఎవరైనా మన సినిమాల్లో నటిస్తే ఆ సినిమాలను నిషేధించండి’ అని గతంలో రాజ్ థాక్రే నుంచి హెచ్చరిక వచ్చింది. దాని నుంచి బయటపడటానికి పాక్ వాళ్లు నటించిన ‘ఏ దిల్ హై ముష్కిల్’ సినిమా చాలా తిప్పలు పడాల్సి వచ్చింది.
అయితే పాక్ హీరో అలీ జాఫర్ నటించిన ‘డియర్ జిందగీ’కి ఈ సమస్యలు తగ్గాయి. దానికి కారణం దేశంలో నెలకొన్న పరిస్థితులే. కనుక ఇప్పుడు ‘రయీస్’కి కూడా ఏ అడ్డంకులూ ఉండవని భావిస్తున్నారు. 1980లలో గుజరాత్‌లో మద్యం మాఫియాను నడిపిన ‘రయీస్ ఆలమ్’ అనే వ్యక్తి జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ పాత్రను షారుఖ్ ధరించగా ఇతని ఆట కట్టించే పోలీస్ ఆఫీసర్ ఏసిపి మజ్‌ముదర్ పాత్రలో నవాజుద్దీన్ సిద్దిఖీ నటించాడు.