న్యూఢిల్లీ: నోట్లరద్దుపై పార్లమెంటరీ ఆర్థిక స్థాయీ సంఘంరూపొందించిన నివేదిక బుట్టదాఖలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీరప్ప మొయిలీ చైర్మన్‌గా, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ సభ్యుడిగా ఉన్న కమిటీలోని మొత్తం 31 సభ్యుల్లో అధికార బీజేపీకి చెందినవారే 17 మంది ఉన్నారు. నివేదికలోని అంశాలను బీజేపీ ఎంపీలు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. ముసాయిదా నివేదిక మార్చికే సిద్ధమయినా, బీజేపీ సభ్యుల వైఖరి వల్ల దానికి ఆమోదం లభించలేదు.
కమిటీలో మెజారిటీ సభ్యులు బీజేపీ ఎంపీలే కావడంతో ముసాయిదా నివేదికకు ఆమోదం లభించడం ఇక కష్టమే అని తెలుస్తోంది. ఈ నెల 31తో కమిటీ ముగుస్తున్న నేపథ్యంలో నివేదిక చిత్తుకాగితానికే పరిమితమవుతుందని భావిస్తున్నారు. రూ.500, రూ.1000 నోట్లను రద్దుచేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం అనాలోచితమని కమిటీ తన నివేదికలో దుయ్యబట్టింది.
Comments
Please login to add a commentAdd a comment