నేనా! ముఖ్యమంత్రా? | ramya krishna act to tamilnadu cm role ? | Sakshi
Sakshi News home page

నేనా! ముఖ్యమంత్రా?

Published Sat, Aug 8 2015 2:58 AM | Last Updated on Tue, Aug 14 2018 2:24 PM

నేనా! ముఖ్యమంత్రా? - Sakshi

నేనా! ముఖ్యమంత్రా?

ముఖ్యమంత్రి జయలలిత ప్రతిభావంతురాలు. చాలా ధైర్యవంతురాలు అంటూ పొగడ్తల వర్షం కరిపిస్తున్నారు నటి రమ్యక్రిష్ణ. ఇంతకీ ఆమె సడన్‌గా ముఖ్యమంత్రిని పొగడాల్సిన అవసరం ఏమోచ్చింది. ఈ మధ్య నటీమణులు రాజకీయ రంగం ప్రవేశం అంటూ తెగ వార్తలు ప్రచారం అవుతున్నాయి. కొంపదీసి రమ్యక్రిష్ణకు కూడా అలాంటి ఆలోచన పుట్టుకొచ్చిందా? అనేగా మీ సందేహం. ఆమెకలాంటి ఆలోచన ఉందో? లేదో గానీ ప్రస్తుతానికి రమ్యక్రిష్ణ సినిమాల గురించే మాట్లాడుతున్నారు. నటి విద్యాబాలన్ దివంగత సంచలన శృంగార తార సిల్క్ స్మిత జీవిత చరిత్రలో నటిస్తుండగా మహిళా సంఘాలు ఆందోళనలు చేశాయి. అయినా ఆ చిత్రం విడుదలయ్యి విజయం సాధించడమే కాకుండా నటి విద్యాబాలన్‌కు జాతీయ అవార్డు వరించింది. ఆ తరువాత కహాని, తదితర చిత్రాలు చేశారు.ప్రస్తుతం ఇందిరగాంధీ జీవిత చరిత్రతో తెరకెక్కుతున్న చిత్రంలో ఇందిరాగాంధీగా నటిస్తున్నారు.

కాగా తమిళంలో ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర వెండితెర కెక్కనున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. అసలు విషయం ఏమిటంటే ఇందులో జయలలిత పాత్రలో నటి రమ్యక్రిష్ణ నటించనన్నారనే ప్రచారం జరుగుతోంది. పడయప్పా(తెలుగులో నరసింహా) చిత్రంలో నీలాంబరి, బాహుబలిలో శివకామి పాత్రల్లో ఒదిగి పోయిన రమ్యక్రిష్ణ చెవికి ఈ వార్త తాకడంతో ఆమె ఒకింత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ తానా? ముఖ్యమంత్రిగానా?అన్నారు. నిజంగా అలాంటి అవకాశం వస్తే అంతకంటే గర్వపడే విషయం ఏముంటుంది అన్నారు. ముఖ్యమంత్రి జయలలిత ప్రతిభావంతురాలు. చాలా ధైర్యశాలిఅని కీర్తించారు. అయితే ఆమె పాత్రలో నటించాలని తన వద్దకు ఎవరూ రాలేదన్నారు. జరుగుతున్నదంతా అసత్యప్రచారం అంటూ కొట్టిపారేశారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement