'ఆ సినిమా నేను చేయలేనేమో..?' | Mani ratnam comments on rajinikanth biography | Sakshi
Sakshi News home page

'ఆ సినిమా నేను చేయలేనేమో..?'

Published Tue, Feb 2 2016 9:32 AM | Last Updated on Sun, Sep 3 2017 4:49 PM

'ఆ సినిమా నేను చేయలేనేమో..?'

'ఆ సినిమా నేను చేయలేనేమో..?'

కేవలం సౌత్ ఇండస్ట్రీలోనే కాదు.. జాతీయ స్థాయిలో ఉత్తమ దర్శకుడిగా మణిరత్నానికి మంచి పేరుంది. ముఖ్యంగా నిజజీవిత కథలను సినిమాటిక్గా తెరకెక్కించటంలో మణి మంచి విజయాలు సాధించారు. రామాయణ, మహాభారతాలను కథా వస్తువులుగా ఎంచుకునే ఈ క్రియేటివ్ జీనియస్, ఇద్దరు, గురు లాంటి సినిమాలతో సెలబ్రిటీల జీవితాలను కూడా వెండితెర మీద ఆవిష్కరించారు.

ఈ నేపథ్యంలో బెంగళూరులో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో మణిరత్నానికి ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీ కాంత్ జీవితకథ ఆధారంగా సినిమా తెరకెక్కించవచ్చు కదా అని అభిమాని అడిగిన ప్రశ్నకు మణి చెప్పిన సమాధానం అందరినీ ఆకట్టుకుంది. 'రజనీ జీవితాన్ని సినిమాగా తెరకెక్కించాలనుకోవటం మంచి ఆలోచనే, కానీ ఆ పాత్రకు సరిపోయే నటుడు దొరకటం చాలా కష్టం. అందుకే ఆ సినిమా నేను చేయలేనేమో' అన్నాడు మణిరత్నం.

గతంలో మణిరత్నం, రజనీకాంత్ల కాంబినేషన్లో వచ్చిన దళపతి ఘనవిజయం సాధించింది. కర్ణుడు, దుర్యోధనుడి పాత్రల ఇన్‌స్పిరేషన్‌తో తెరకెక్కించిన ఈ సినిమాలో మమ్ముట్టి మరో ప్రధాన పాత్రలో నటించాడు. తమిళనాట క్లాసిక్గా నిలిచిపోయిన ఈ సినిమా తరువాత ఈ క్రేజీ కాంబినేషన్లో మరో సినిమా రాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement