dalapathi
-
Actor Vijay: ‘ఎదుగుదలకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు’
చెన్నై: ‘తమిళగ వెట్రి కళగం’పార్టీని ప్రకటించిన సినీనటుడు విజయ్ దళపతి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రత్యేక కమిటీలు, బృందాలను రంగంలోకి దించబోతున్నారని సమాచారం. తాజాగా విజయ్ ఒక లేఖను విడుదల చేశారు. ‘నా ఎదుగుదలకు సహకరించిన పెద్దలు అందరికీ ధన్యవాదాలు. సినీరంగ ప్రముఖులు, వివిధ రాజకీయపార్టీ నేతలు, అభిమానులు, అండగా నిలిచిన మీడియా అందరికీ కృతజ్ఞతలు. గుండెల్లో నింపుకున్న అభిమానులు అందిరికీ థ్యాంక్యూ. తమిళ ప్రజలు సంక్షేమం కోసం రాజకీయ ప్రస్థానం ప్రారంభిస్తున్నా.. విజయం సాధిస్తా..’ అని విజయ్ లేఖలో పేర్కొన్నారు. -
Tamil Nadu politics: రాజకీయాల్లోకి ‘దళపతి’ విజయ్
సాక్షి, చెన్నై: తమిళ రాజకీయ ముఖచిత్రంపై మరో అగ్రతార మెరిసింది. క్రియాశీలక రాజకీయాల్లో అడుగుపెడుతున్నట్లు తమిళ అభిమానుల ‘దళపతి’, ప్రముఖ నటుడు విజయ్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ప్రకటన విడుదలచేశారు. ‘‘తమిళగ వెట్రి కళగం పేరుతో రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నాం. పార్టీ రిజిస్ట్రేషన్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం వద్ద దరఖాస్తు చేశాం. 2026లో తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో విజయకేతనం ఎగరేయడమే మా లక్ష్యం. లోక్‌సభ ఎన్నికల్లో ఎవరికీ మద్దతివ్వబోం. అవినీతి, అధ్వాన్న పరిపాలన, విభజన రాజకీయాలతో పాలిటిక్స్‌ను భ్రషు్టపట్టించారు. నిస్వార్థంగా, పారదర్శకంగా, మార్గదర్శకంగా, అద్భుతమైన పరిపాలనకు బాటలు పరిచే రాజకీయ ఉద్యమం కోసం తమిళ ప్రజలు ఎదురుచూస్తున్నారు. కుల, మత విభేదాలకు అతీతంగా పాలించే అవినీతిరహిత ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు ’’ అని విజయ్ వ్యాఖ్యానించారు. పార్టీ అధ్యక్షుడు విజయ్, సీనియర్ నేతలు గత నెల 25వ తేదీన పార్టీ సర్వసభ్య మండలి, కార్యనిర్వాహణ మండలి సమావేశంలో పాల్గొని పార్టీ నియమావళి, నిబంధనలకు ఆమోద ముద్ర వేశారని పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఎన్నాళ్లనుంచో సేవ చేద్దామనుకుంటున్నా ‘‘రాజకీయాల్లో మార్పులు తేగల సత్తా ప్రజా ఉద్యమానికే ఉంది. అది మాత్రమే తమిళనాడు పౌరుల హక్కులను కాపాడగలదు. కన్న తల్లిదండ్రులతోపాటు నాకు పేరు ప్రతిష్టలు తెచి్చన రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలని ఎన్నాళ్ల నుంచో అనుకుంటున్నా. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి, విజయం సాధించి ప్రజలు కలలుగన్న రాజకీయ మార్పుకు బాటలు వేయడమే మా లక్ష్యం. ఈసీ నుంచి అనుమతులు వచ్చాక పార్టీ కార్యక్రమాలు మొదలుపెడతాం. లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యాక పార్టీ కార్యకర్తలను సంఘటితం చేసి పార్టీ విధానాలు, పార్టీ జెండా, పార్టీ గుర్తు, ఇతర కార్యాచరణకు తుదిరూపునిస్తాం’’ అని విజయ్ స్పష్టంచేశారు. ‘‘ రాజకీయాలంటే సినిమా ప్రపంచం నుంచి నాకు ఒక విరామం కాదు. తపనతో రాజకీయాల్లోకి వస్తున్నా. రాజనీతి అంటే ప్రజలకు గొప్పగా సేవ చేయడం. ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలు పూర్తిచేసి రాజకీయాలకు అంకితమవుతా’’ అని అన్నారు. -
చిరంజీవి, విజయ్ విషయంలో చాలా బాధపడ్డాను: రష్మిక మందన్న
నిత్యం వార్తల్లో ఉండే హీరోయిన్లలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఒకరు. నటిగా శాండిల్ వుడ్లో పుట్టి టాలీవుడ్లో ఎదిగి, కోలీవుడ్‌లోనూ మెరిసి తాజాగా బాలీవుడ్లో వాలిన ఫీనిక్స్ బర్డ్ రష్మిక. అయితే తమిళం, హిందీ భాషల్లో నటించిన చిత్రాలు ఆశించిన విధంగా విజయాన్ని సాధించలేదనే కొరత ఉందన్నది ఆమె మాటల్లోనే వ్యక్తం అవుతోంది. కాగా హిందీ చిత్రాలతో బిజీగా ఉండటం వల్లో, ఇతర కారణాల వల్లో గానీ ఇటీవల టాలీవుడ్లో అవకాశాలను జారవిడుచుకుంటోంది. (ఇదీ చదవండి: ప్రభాస్ 'ప్రాజెక్ట్ కె' టైటిల్, గ్లింప్స్ విడుదల.. హాలీవుడ్ రేంజ్లో సీన్స్) కాగా ఈ భామ ఇటీవల ఒక భేటీలో తన సినీ జీవితం గురించి పేర్కొంటూ కష్టపడి పని చేస్తే ఏ రంగంలోనైనా నంబర్ వన్ కావచ్చని చెప్పింది. తాను ప్రారంభ దశలో మోడలింగ్ చేసి ఆ తర్వాత నటిగా పరిచయం అయినట్లు పేర్కొంది. సినిమా రంగంలో అదృష్టం చాలా ముఖ్యమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. తాను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాతో పాటు తమిళంలో విజయ్ సూపర్ హిట్ సినిమా మాస్టర్ వంటి చిత్రాల్లో నటించే అవకాశాలు వచ్చినా, చేజార్చుకున్నానని తెలిపింది. అంత పెద్దస్టార్స్ తో నటించే అవకాశం రావడం నిజంగా అదృష్టమని, అలాంటిది ఆ అవకాశాలను వదులుకోవడం బాధనిపించిందని పేర్కొంది. సినిమా రంగంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమని పేర్కొంది. ప్రేమ పెళ్లి అనేది కొన్ని సమయాల్లో విడదీయలేని బంధం అవుతాయని పేర్కొంది. అయితే కొన్ని సార్లు అవి బలహీనంగా కూడా మారతాయని చెప్పింది. (ఇదీ చదవండి: గుంటూరు కారం కోసం మహేష్ రెమ్యునరేషన్ అన్ని కోట్లా..!) -
హీరో విజయ్ నన్ను బెదిరిస్తున్నాడు.. అరెస్ట్ చేయండి: ప్రియ
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్- డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో రానున్న'లియో' మాస్, యాక్షన్ ఎంటర్టైనర్గా సిద్ధమవుతోన్న ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన 'నా రెడీ' పాట వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ పాటలో మత్తు పదార్థాల వాడకం, రౌడీయిజాన్ని ఎక్కువగా చూపించారంటూ పలువురు కోర్టుకు కూడా వెళ్లారు. వారిలో ఆల్ పీపుల్స్ పొలిటికల్ పార్టీ నాయకురాలు రాజేశ్వరి ప్రియ కూడా ఉన్నారు. ఆమె పలుమార్లు మీడియా సమావేశాలు పెట్టి విజయ్‌ని టార్గెట్ చేసి తప్పబట్టిన విషయం తెలిసిందే. (ఇదీ చదవండి: ఆలయంలో ప్రేమికులు చేసిన పనిని సమర్థించిన నటి) ఈ నేపథ్యంలో నటుడు విజయ్ తన అభిమానులను సోషల్ మీడియాలో రెచ్చగొట్టి బెదిరిస్తున్నారని చెన్నై డీజీపీ కార్యాలయంలో రాజేశ్వరి ప్రియ ఫిర్యాదు చేశారు. విజయ్ సినిమాలో వచ్చిన స్మోకింగ్ వీడియోలపై నిరసనలు వ్యక్తం చేసినందుకే... స్మోకింగ్ వల్ల క్యాన్సర్ వస్తుందనే పదాలను చిత్ర బృందం పాటలో పెట్టిందని ఆమె తెలిపింది. తను చేసిన ఈ పోరాటం వల్ల హీరో విజయ్ అభిమానులు సోషల్ మీడియాలో అసభ్యకరంగా మాట్లాడుతూ నిరంతరం బెదిరిస్తున్నారని చెప్పింది. ముఖ్యంగా విజయ్ సోషల్ మీడియా ఐడీని ట్యాగ్ చేస్తూ అందరూ తనపై అసభ్యపదజాలంతో కామెంట్లు పెడుతున్నారని పేర్కొంది. హీరో విజయ్ కూడా తనను బెదిరించాడని తెలిపింది. (ఇదీ చదవండి: వాళ్లు నాకు ఛాన్సులు ఇవ్వడం లేదు: హీరోయిన్ ఐశ్వర్య) ఓ మహిళను అసభ్యకరంగా మాట్లాడేలా తన అభిమానులను ప్రేరేపించిన విజయ్‌ని పోలీసులు అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది. సినిమాల్లో అందరూ సిగరెట్లు తాగుతారు.. మరీ విజయ్‌పై మాత్రమే ఫిర్యాదు ఎందుకు? అని ప్రశ్నించగా.. గతంలో రజనీకాంత్‌పై కూడా ఇదే విషయంలో ఫిర్యాదు చేశామని ఆమె గుర్తు చేసింది. -
ఆ వార్తల్లో నిజం లేదు.. మణిరత్నం సినిమాలు భద్రపరుస్తాం
‘దళపతి’ (1991), ‘రోజా’ (1992), బొంబాయి (1995), ‘యువ’ (2004).. ఇలా ఎన్నో అద్భుత చిత్రాలను అందించారు దర్శకుడు మణిరత్నం. ఇప్పటివరకూ ఆయన 26 సినిమాలు తీశారు. వాటిలో ‘క్లాసిక్’ అనదగ్గవి చాలా ఉన్నాయి. ఆ క్లాసిక్స్‌ని భద్రపరిచే ప్రయత్నం జరుగుతోంది. ఈ విషయం గురించి ఈ ప్రాజెక్ట్‌తో అసోసియేట్ అయిన శివేంద్ర సింగ్ మాట్లాడుతూ– ‘‘క్లాసిక్ సినిమాలను ఇప్పటి సాంకేతికతో భద్రపరచడం, మెరుగులు దిద్దడం వంటి అంశాలపై 2017లో చెన్నైలో వర్క్‌షాప్ చేశాం. అప్పుడు మణిరత్నంతో మాట్లాడాను. ఆయన సినిమాల్లో కొన్ని ప్రింట్స్, నెగటివ్స్ మెరుగైన స్థితిలో లేవు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘దళపతి’, ‘రోజా’, ‘బొంబాయి’ వంటి ఆణిముత్యాలను ‘ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్’ (ఎఫ్‌హెచ్‌ఎఫ్)లో ఎలా భద్రపరుస్తామో వివరించాం. మణిరత్నం సానుకూలంగా స్పందించారు. సినిమాలను 8కె రిజల్యూషన్‌లో భద్రపరుస్తాం. ఇప్పుడు అందరూ 4కె రిజల్యూషన్‌ను మాత్రమే వినియోగిస్తున్నారు. పాత ప్రింట్స్, నెగటివ్‌లను జాగ్రత్తగా డీల్ చేస్తున్నాం. ఈ డిజిటలైజేషన్ ప్రాసెస్‌లో ప్రసాద్ కార్పొరేషన్ సహకారం ఉంది. అలాగే మేం ఒక ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ కోసం ఇలా చేస్తున్నామని వస్తున్న వార్తల్లో నిజం లేదు’’ అని పేర్కొన్నారు. -
కర్ణుని గుండెల్లో బడబాగ్ని
ఏ జన్మలో అయినా శిశువుకు దొరికే ప్రథమ వరం ఏమిటంటే తల్లి ఒడి.ఎలా ఉంటుంది ఆ ఒడి.వెచ్చగా ఉంటుంది. నేనున్నానని దగ్గరగా ఉంటుంది. పక్కటెముకల చెంత పరుండబెట్టుకుని ధైర్యం ఇస్తుంది. గుండె లయను వినిపిస్తూ కలత పడవలసిన అవసరం లేదనే సంభాషణ చేస్తుంది. ఒడి– స్తన్యాన్ని దగ్గరగా ఉంచుంది. ఒడి– అమ్మను దగ్గరగా ఉంచుతుంది. ఒడి– నాకో అమ్ముంది అనే అతిశయాన్ని ఇస్తుంది.అది ఉన్నవాళ్లకు దాని విలువ తెలుసో లేదో.కాని లేని వాళ్లకు మాత్రం దాని విలువ కచ్చితంగా తెలుసు. ఆ రోజు భోగి.అక్కర్లేనివన్నీ అగ్నిలో ఆహుతి చేస్తున్నారు. విసిరి పారేస్తున్నారు. పాతవాటిల్ని నమిలేస్తున్న మంట ఆ ప్రభాతాన ఎర్రగా నాలుకలు సాచి ఉంది. ఆ తల్లికి నొప్పులు. నొప్పులంటే ఏమిటో తెలియని వయసు. పదమూడో పద్నాలుగో. నెలలు నిండిపోయాయి. ఇల్లు వద్దనుకుంది. ఊరు వద్దనుకుంది. కడుపులో ఉన్న శిశువును వద్దనుకుంటే మళ్లీ దగ్గరకు తీసుకుంటుందేమో. ఆ శిశువు ఆ తల్లికి అడ్డం.కాని శిశువు కదా. తన కడుపున పుట్టాడు కదా. ఎలా వదిలిపెట్టడం. తప్పదు. గూడ్స్ బండి ఏదో కదులుతుంటే పసుపుబట్టలో చుట్టి అందులో పడుకుకోబెట్టి మళ్లీ ఉండబట్టలేక దాని వెంట పరిగెట్టినా... కూ అని కూతపెడుతూ బిడ్డను మోసుకెళుతూ పసికందు రోదనను తనలో లీనం చేసుకుంటూ ఆ బండి వెళ్లిపోయింది.శిశువు దూరమైంది.కాని పాశం దూరం కాగలదా? ఆ బిడ్డను ఎవరో చేరదీశారు. ఏ మురికి వాడలోనో ఆ మురికి జన్మ ఊపిరి పీల్చుకోగలిగింది. పెరిగి పెద్దదై యువకుడిగా మారగలిగింది. ఆ యువకుడి గుండెల్లో ఎప్పుడూ ఒకటే ప్రశ్న. అమ్మ నన్నెందుకు పారేసింది? ఆ చేయి స్పర్శ కావాలనిపిస్తుంది. ఆ చేయి శిరస్సు మీద పెట్టి నిమిరితే అనుభవించాలని ఉంటుంది. ఆ తల్లి ఒడిలో తలను పరుండబెట్టి సేదతీరాలని ఉంటుంది. ఏం... ఆ తల్లిని పట్టుకుని గట్టిగా ఏడవాలని ఉండదూ?సమాజంలో ఎప్పుడూ ఒక ప్రశ్న.మీ అమ్మ పేరేమిటి?తెలియదు.నాన్న పేరు?తెలియదు.అనుభవించినవారికే తెలుస్తుంది నెత్తుటి గాటు. ఉబికి ఉబికి పొంగే ఆశ్రువు. ఆ యువకుడికి అప్పుడు ఒక స్నేహితుడు దొరుకుతాడు. నేనున్నానంటాడు. గాలికి గమ్యం లేకుండా ఎగురుతున్న జెండా ముక్క ఒక గుంజెకు తగులుకుంటే ఎలా ఉంటుంది? అది అక్కడ రెపరెపలాడే వీలు దక్కించుకుంటే ఎలా ఉంటుంది? ఆ యువకుడికి ఆ స్నేహితుణ్ణి చూస్తే అలాగే అనిపించింది. ఇప్పుడు ఈ ప్రాణానికి అర్థముంది. అది ఇవ్వడానికి ఒక స్నేహితుడు దొరికాడు. అవును. ఈ జన్మ ఈ స్నేహితుని కోసమే. అనాథ రజనీకాంత్, గ్యాంగ్‌స్టర్ మమ్ముట్టి ప్రాణానికి ప్రాణం అవుతారు. ఇద్దరూ పేదవాళ్లకు మిత్రులు. పేదల కష్టాలకు చట్టానికి ఆవల ఉన్న పరిష్కారాలను చేసి పెడుతుంటారు. ఆపదలో ఉన్నవాళ్లకు దేవుళ్లు. రజనీకాంత్ కులం ఏమిటి మతం ఏమిటి తల్లిదండ్రులు ఎవరు అనేది చూడకుండా మమ్ముట్టి అతణ్ణి గౌరవించాడు. తన దళపతిని చేసుకున్నాడు. తోడబుట్టినవాడనుకున్నాడు. అందుకు రజనీకాంత్‌కు మమ్ముట్టి అంటే కృతజ్ఞత. ప్రేమ. అర్పణం. కాని రజనీకాంత్ ప్రేమించిన అమ్మాయి రజనీకాంత్‌కు దక్కలేదు. తల్లిదండ్రీ లేనివాడికి పిల్లనివ్వను అని చెబుతాడు అమ్మాయి తండ్రి. భారతంలో కర్ణుని ఆత్మగౌరవానికి వీర పరీక్షలు ఎదురయ్యాయే తప్ప ఇలా సాంఘిక పరీక్షలు ఎదురు కాలేదు. పోలీసులు కేసులు పెట్టినప్పుడల్లా ‘నీ తల్లి పేరేమిటి... తండ్రి పేరేమిటి?’ అని అవమానిస్తూనే ఉంటారు. ఈ అన్ని సందర్భాల్లోనూ రజనీకాంత్‌కు దొరికే ఒక ఒక ఓదార్పు మమ్ముట్టి స్నేహమే. అందుకే ఊరిలోని పెద్దమనిషి వాణ్ణి వదిలేసి నా పక్షంలో చేరిపో అనంటే వెళ్లడు. ఉండిపోతాడు. ఆ పెద్దమనిషి ప్రమాదకారి. ఇది ప్రమాదం. కురుక్షేత్రం కేవలం భౌతిక సవాళ్లనే విసరలేదు. మానసికమైన మల్లయుద్ధాన్ని కూడా ఆహ్వానించింది. మమ్ముట్టి, రజనీకాంత్‌లను నిరోధించడానికి వచ్చిన కలెక్టర్ అరవింద్ స్వామి వాళ్లను నిరోధించ ప్రయత్నించి వాళ్లిద్దరికీ విరోధి అవుతాడు. అతణ్ణి చంపేయాలి. కాని అతడు రజనీకాంత్‌కు తమ్ముడు. ఏ తల్లయితే తనను విసిరేసిందో ఆ తల్లి కడుపున పుట్టినవాడు. ఆ తల్లి ఈ సంగతి తెలుసుకుని తన పెద్దకొడుకు దగ్గరకు భిక్షకు వస్తుంది– కొడుకు ప్రాణాలు ఇమ్మని. తల్లినీ తమ్ముణ్ణి స్వీకరిస్తే స్నేహితుడికి ప్రమాదం. స్నేహితుడు కావాలనుకుంటే తమ్ముడి ప్రాణాలకు ప్రమాదం.అయినా సరే స్నేహితుడే ముఖ్యం అనుకుంటాడు రజనీకాంత్.రక్తబంధాలు అనాథ వదిలేసినప్పుడు స్నేహమే ఐశ్వర్యం ఇచ్చింది. ఆ సంగతి మర్చిపోడు రజనీకాంత్. స్నేహానికి అర్థం అదే కదా. కురుక్షేత్రం వస్తుంది.ఊళ్లోని పెద్దమనిషి స్నేహితులిద్దరి మీదా దాడి చేయిస్తాడు.వాస్తవానికి కర్ణుడు చనిపోతే సుయోధనుడు బదులు తీర్చుకోవాలి.కాని మమ్ముట్టి చనిపోతే రజనీకాంత్ బదులు తీర్చుకుంటాడు. కొన్ని బంధాలు వీడ్కోలు తీసుకున్నప్పుడు కొత్త బంధాలు గుండెలకు హత్తుకుంటాయి. రజనీకాంత్ జీవితంలో ఇప్పుడు స్నేహితుడులేకపోవచ్చు. తల్లి ఉంది. పుట్టిన కొద్ది గంటల్లోపే దూరమైన ఆ శిశువు సుదీర్ఘమైన పరితాపం, వేదన తర్వాత తల్లి ఒడికి చేరి పొందిన ప్రశాంతతో కథ ముగుస్తుంది.లక్షలు, కోట్లు, మిద్దెలు, మేడల వేటలో మనిషి మర్చిపోతున్న వరం కూడా అదే– తల్లి ఒడి. భారతం కథ మణిరత్నం దర్శకత్వంలో 1991లో వచ్చిన ‘దళపతి’ ఆ కాలంలో విడుదలకు ముందు అతి పెద్ద సంచలనంగా మారింది. రజనీకాంత్, మణిరత్నం కాంబినేషన్లో వస్తున్న మొదటి సినిమా కావడం, మమ్ముట్టి కూడా ఉండటం వల్ల మల్టీస్టారర్ కావడం, ఇళయరాజా చేసిన పాటలు విడుదలకు ముందే పెద్ద హిట్ కావడం ఇవన్నీ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచాయి. ‘దళపతి’ టైటిల్ కూడా పెద్ద హంగామాను ఎక్స్పెక్ట్ చేసేలా చేసింది. కాని చివరకు ఇది ‘భారతం కథ’ అని తెలియడం కొంత ప్రేక్షకులను నిరాశ పరిచింది. నేరుగా విలన్ కథలో లేకపోవడం, హీరోయిజంను పెంచే కథనం లేకపోవడం కొంత లోటు. కాని భావోద్వేగాల కురుక్షేత్రాన్ని మాత్రం ఈ కథ బలంగా పట్టుకోగలిగింది. తల్లి కాదనుకున్న బిడ్డడి అంతర్మథనం రజనీకాంత్‌లో, తల్లిని పారేసిన తల్లి వేదన శ్రీవిద్యలో చాలా శక్తిమంతంగా దర్శకుడు చూపిస్తాడు. సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ, తోట తరణి సెట్స్ పెద్ద పేరు తెచ్చాయి. ‘ఆడజన్మకు ఎన్ని సోకాలో’, ‘చిలకమ్మ చిటికేయంగా’, ‘యమునా తటిలో’... ఇవన్నీ పెద్ద హిట్స్. బాలు, ఏసుదాస్ కలిసి పాడిన ‘సింగారాల పైరుల్లోన’ ఇప్పటికీ ఆ గాయకుల మేలిమి కలయికకు ఒక నజరానాగా నిలిచింది. రజనీకాంత్‌ను అప్పటి సినిమాల ధోరణికి భిన్నంగా సహజంగా అందమైన హెయిర్‌స్టయిల్‌తో ఈ సినిమా చూపించింది. మణిరత్నం, ఇళయరాజా కలిసి పని చేసిన చివరి సినిమాగా, అరవింద్ స్వామి తొలి సినిమాగా ఇది గుర్తుండిపోతుంది. – కె -
నీకు నాకు మధ్యలో ఏదో ఉంది
‘‘మనం చాలా పాటలు వింటుంటాం. కొన్ని పాటలు మన చెవుల వరకే పరిమితం అయితే కొన్ని పాటలు మన హృదయాన్ని హత్తుకుంటాయి. ‘దళపతి’ చిత్రంలో ‘నీకు నాకు మధ్య ఏదో ఉంది’ పాట అలాంటిదే’’ అంటున్నారు సదా. సదా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘దళపతి’. కవితా అగర్వాల్ హీరోయిన్. ‘నీకు నాకు ఏదో ఉంది’ అనే పాట యూట్యూబ్‌లో కోటి వ్యూస్‌తో సంచలనం చేస్తుండటంతో దర్శకుడు సదా మాట్లాడుతూ – ‘‘ఫాస్ట్ బీట్ పాటలకు లైఫ్ చాలా తక్కువ. మెలోడీ పాటలే ఎక్కువ కాలం శ్రోతల మదిలో మెదులుతాయి. ఈ పాట కూడా ఇలాంటిదే. త్వరలో రానున్న ‘దళపతి’ సినిమాకు ఇదే ప్రధాన ఆకర్షణ. ఈ పాటను కంపోజ్ చేసి, పాడిన యాజమాన్యకు, శ్రేయా ఘోషల్‌కు, పాటను రచించిన రాంబాబు గోసాలకు చాలా థ్యాంక్స్. ఇంత హిట్ అయిన ఈ పాట పేరునే నా నెక్ట్స్ సినిమాకు టైటిల్‌గా పెట్టుకుంటాను’’ అని అన్నారు. ఈ సినిమాను బాబురావు పెద్దపుడి నిర్మిస్తున్నారు. -
కొత్త దళపతి
రజనీకాంత్–మణిరత్నం కాంబినేషన్లో వచ్చిన ‘దళపతి’ తెలుగు, తమిళ భాషల్లో ఎంత హిట్టయ్యిందో తెలిసిందే. పాతికేళ్ల క్రితం విడుదలైన ఆ సినిమా ప్రస్తావన ఇప్పుడెందుకు అనుకుంటున్నారా? అసలు విషయానికొస్తే... సదా, కవితా అగర్వాల్ జంటగా ‘దళపతి’ పేరుతో తాజాగా ఓ సినిమా రూపొందింది. సదా దర్శకత్వంలో బాబురావు పెదపూడి నిర్మించిన ఈ చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. సదా మాట్లాడుతూ– ‘‘విభిన్న కథాంశంతో యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. ఇటీవలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘సదా ఈ సినిమాను చక్కగా తెరకెక్కించారు. అవుట్‌పుట్ బాగా వచ్చింది. యాజమాన్య సంగీతం అందించిన పాటలకు, ముఖ్యంగా శ్రేయాఘోషల్ పాటకు అనూహ్య స్పందన వచ్చింది. రజనీకాంత్ ‘దళపతి’లా మా సినిమా కూడా హిట్టవుతుంది. త్వరలో విడుదల చేస్తాం’’ అన్నారు. -
'ఆ సినిమా నేను చేయలేనేమో..?'
కేవలం సౌత్ ఇండస్ట్రీలోనే కాదు.. జాతీయ స్థాయిలో ఉత్తమ దర్శకుడిగా మణిరత్నానికి మంచి పేరుంది. ముఖ్యంగా నిజజీవిత కథలను సినిమాటిక్‌గా తెరకెక్కించటంలో మణి మంచి విజయాలు సాధించారు. రామాయణ, మహాభారతాలను కథా వస్తువులుగా ఎంచుకునే ఈ క్రియేటివ్ జీనియస్, ఇద్దరు, గురు లాంటి సినిమాలతో సెలబ్రిటీల జీవితాలను కూడా వెండితెర మీద ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో బెంగళూరులో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో మణిరత్నానికి ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీ కాంత్ జీవితకథ ఆధారంగా సినిమా తెరకెక్కించవచ్చు కదా అని అభిమాని అడిగిన ప్రశ్నకు మణి చెప్పిన సమాధానం అందరినీ ఆకట్టుకుంది. 'రజనీ జీవితాన్ని సినిమాగా తెరకెక్కించాలనుకోవటం మంచి ఆలోచనే, కానీ ఆ పాత్రకు సరిపోయే నటుడు దొరకటం చాలా కష్టం. అందుకే ఆ సినిమా నేను చేయలేనేమో' అన్నాడు మణిరత్నం. గతంలో మణిరత్నం, రజనీకాంత్‌ల కాంబినేషన్లో వచ్చిన దళపతి ఘనవిజయం సాధించింది. కర్ణుడు, దుర్యోధనుడి పాత్రల ఇన్స్పిరేషన్తో తెరకెక్కించిన ఈ సినిమాలో మమ్ముట్టి మరో ప్రధాన పాత్రలో నటించాడు. తమిళనాట క్లాసిక్‌గా నిలిచిపోయిన ఈ సినిమా తరువాత ఈ క్రేజీ కాంబినేషన్లో మరో సినిమా రాలేదు.