కోలీవుడ్ స్టార్ హీరో విజయ్- డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌లో రానున్న'లియో' మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమవుతోన్న ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన 'నా రెడీ' పాట వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ పాటలో మత్తు పదార్థాల వాడకం, రౌడీయిజాన్ని ఎక్కువగా చూపించారంటూ పలువురు కోర్టుకు కూడా వెళ్లారు. వారిలో ఆల్ పీపుల్స్ పొలిటికల్ పార్టీ నాయకురాలు రాజేశ్వరి ప్రియ కూడా ఉన్నారు. ఆమె పలుమార్లు మీడియా సమావేశాలు పెట్టి విజయ్‌ని టార్గెట్ చేసి తప్పబట్టిన విషయం తెలిసిందే.
(ఇదీ చదవండి: ఆలయంలో ప్రేమికులు చేసిన పనిని సమర్థించిన నటి)
ఈ నేపథ్యంలో నటుడు విజయ్ తన అభిమానులను సోషల్ మీడియాలో రెచ్చగొట్టి బెదిరిస్తున్నారని చెన్నై డీజీపీ కార్యాలయంలో రాజేశ్వరి ప్రియ ఫిర్యాదు చేశారు. విజయ్ సినిమాలో వచ్చిన స్మోకింగ్ వీడియోలపై నిరసనలు వ్యక్తం చేసినందుకే... స్మోకింగ్ వల్ల క్యాన్సర్ వస్తుందనే పదాలను చిత్ర బృందం పాటలో పెట్టిందని ఆమె తెలిపింది. తను చేసిన ఈ పోరాటం వల్ల హీరో విజయ్ అభిమానులు సోషల్ మీడియాలో అసభ్యకరంగా మాట్లాడుతూ నిరంతరం బెదిరిస్తున్నారని చెప్పింది. ముఖ్యంగా విజయ్ సోషల్ మీడియా ఐడీని ట్యాగ్ చేస్తూ అందరూ తనపై అసభ్యపదజాలంతో కామెంట్లు పెడుతున్నారని పేర్కొంది. హీరో విజయ్ కూడా తనను బెదిరించాడని తెలిపింది.
(ఇదీ చదవండి: వాళ్లు నాకు ఛాన్సులు ఇవ్వడం లేదు: హీరోయిన్ ఐశ్వర్య)
ఓ మహిళను అసభ్యకరంగా మాట్లాడేలా తన అభిమానులను ప్రేరేపించిన విజయ్‌ని పోలీసులు అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది. సినిమాల్లో అందరూ సిగరెట్లు తాగుతారు.. మరీ విజయ్‌పై మాత్రమే ఫిర్యాదు ఎందుకు? అని ప్రశ్నించగా.. గతంలో రజనీకాంత్‌పై కూడా ఇదే విషయంలో ఫిర్యాదు చేశామని ఆమె గుర్తు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment