
హైదరాబాద్: వీవీఎస్ లక్ష్మణ్.. క్రికెట్ ప్రపంచానికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. తన క్రికెట్ కెరీర్‌లో ‘వెరీ వెరీ స్పెషల్’గా గుర్తింపు పొందిన వీవీఎస్ తాజాగా చేసిన ట్వీట్ ఆసక్తిని రేపుతోంది. త్వరలోనే వెరీ వెరీ స్పెషల్ స్టోరీ రాబోతుందంటూ లక్ష్మన్ తన ట్వీటర్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. అయితే వెరీ వెరీ స్పెషల్‌గా రాబోతున్నది ఏంటాని క్రికెట్ ప్రేమికుల్లో చర్చ సాగుతోంది. అతని జీవిత కథ ఆధారంగా ఒక పుస్తకాన్ని వీవీఎస్ లక్ష్మణ్ తీసుకు రాబోతున్నాడా? లేక ఈ పేరుతో ఏమైనా సినిమా రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నాడా? అనేది ఆసక్తికరం. ఈ వెరీ వెరీ స్పెషల్ స్టోరీ అంటూ లక్ష్మణ్ చేసిన ట్వీట్‌లో ఉన్న ఆంతర్యమేమిటో అతనే చెప్పాలి.
రక్త మూలకణ దాతగా వీవీఎస్
లక్ష్మణ్ బ్లడ్ స్టెమ్‌సెల్ డోనర్ (రక్త మూలకణ దాత)గా పేరును నమోదు చేయించుకున్నాడు. స్వచ్ఛంద సంస్థ దాత్రి నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన లక్ష్మణ్ ప్రతి ఒక్కరు బ్లడ్ స్టెమ్‌సెల్ దానం చేయవచ్చని, మరొకరి జీవితం పొడిగింపునకు అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నాడు. లాభాపేక్ష లేకుండా రక్తదానం చేసి మరొకరి ప్రాణం కాపాడాలని పిలుపునిచ్చాడు.మంచి పనికి ప్రతి ఒక్కరూ కదిలిరావాలని, ఇతరులకు స్ఫూర్తిగా నిలవాలని లక్ష్మణ్ కోరాడు.
A very very special announcement - coming soon ! pic.twitter.com/ReuOdfI08l
— VVS Laxman (@VVSLaxman281) 30 October 2018