
కరాచీ: పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది జీవిత చరిత్ర పుస్తక రూపంలో రానుంది. ‘గేమ్ చేంజర్’ పేరుతో వస్తున్న ఈ ఆటోబయోగ్రఫీ ఈ నెల 30న విడుదలవుతుంది. పాత్రికేయుడు వజాహత్ ఖాన్‌తో కలిసి అఫ్రిది ఈ పుస్తకాన్ని రాశాడు. 16 ఏళ్ల వయసులో 1996లో తన తొలి ఇన్నింగ్స్‌లోనే వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ (37 బంతుల్లో) నమోదు చేసిన అఫ్రిది అరంగేట్రం సంచలన రీతిలో మొదలైంది. ఆ తర్వాత 20 సంవత్సరాలు కెరీర్‌లో విధ్వంసకర ఆటగాడిగా అతను తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. పాకిస్తాన్ తరఫున అఫ్రిది 27 టెస్టులు, 398 వన్డేలు, 99 టి20లు ఆడటంతో పాటు మూడు ఫార్మాట్‌లలోనూ కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు.
Comments
Please login to add a commentAdd a comment