
మృణ్మయీ దేశ్‌పాండే.. అనుకోకుండా అవకాశం వచ్చి యాక్ట్రెస్ అవలేదు. లక్ష్యంతోనే అయింది. అందం, అభినయం రెండూ కలబోసుకున్న వర్సటైల్ నటి ఆమె. టీవీ, సినిమా, ఓటీటీ.. వేదికేదైనా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను పోషిస్తూ తన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేనంతగా, మృణ్మయీ.. ఇండస్ట్రీలో సింగిల్ పీస్ అన్నంతగా గుర్తింపుతెచ్చుకుంటోంది! ఆమె వివరాలు కొన్ని ..

పుట్టింది షోలాపూర్‌లో.. పెరిగింది పుణెలో. చదువు, ఆటలు.. అన్నిట్లో ఫస్టే. స్కూల్ రోజుల నుంచే థియేటర్‌లో ప్రవేశం ఉంది.

బడిలో జరిగే నాటక ప్రదర్శనల్లో పాల్గొనేది. ఆ ఆసక్తితోనే ఇంటర్మీడియెట్ అయిపోయాక.. కళలు ముఖ్యంగా థియేటర్‌కి ప్రాధాన్యమున్న కాలేజ్‌లో చేరాలని పుణెలోని ఎన్నో కాలేజ్‌లను పరిశీలించి థియేటర్‌కి అత్యంత ప్రాధాన్యమిచ్చే ఎస్‌పీ కాలేజ్ (సర్ పరశురామ్‌భావూ)లో చేరింది. అక్కడ బీకామ్ చదువుకుంటూనే తన అభినయకళకు మరిన్ని మెరుగులు దిద్దుకుంది.

‘ఇట్స్ బ్రేకింగ్ న్యూస్’ అనే మరాఠీ సినిమాతో కెరీర్ మొదలుపెట్టింది.

ఈ చిత్రం ఆమెకు బాలీవుడ్‌లోనూ చాన్స్ తెచ్చిపెట్టింది ‘హమ్‌నే జీనా సీఖ్ లియా’తో. వీటి కమర్షియల్ సక్సెస్‌తో సంబంధం లేకుండా.. ఆమె నటనా కౌశలానికే అవకాశాలు క్యూ కట్టాయి.

ఆ వరుసలోదే ‘నటసామ్రాట్ (తెలుగులో ‘రంగమార్తాండ’)’ మరాఠీ సినిమా. అందులోని ఆమె నటన నానాపాటేకర్ చేత శభాష్ అనిపించుకుంది.

పెళ్లయితే కెరీర్ ఎండ్ అవుతుందనే ఆలోచనా.. ప్రాక్టీస్‌నూ బ్రేక్ చేసింది మృణ్మయి.. కెరీర్ గ్రాఫ్ రెయిజ్ అవుతున్న టైమ్‌లోనే పెళ్లి చేసుకుని! ‘పెళ్లికి ముందు కంటే పెళ్లయిన తర్వాతే మంచి సినిమాలు చేస్తున్నాను’ అంటుంది. ఆమె భర్త.. స్వప్నిల్ రావు. బిజినెస్‌మన్.

‘మన్ ఫకీరా’ అనే సినిమాకు దర్శకత్వం వహించి తనలోని దర్శక ప్రతిభనూ చాటుకుంది. ఈ సినిమా కాస్ట్ అండ్ క్రూతో కలసి ప్లకార్డ్స్‌తో ప్రమోషన్‌ని ప్లాన్ చేసింది మృణ్మయీ.

‘ముంబై డైరీస్’తో ఓటీటీలోనూ పోటీపడుతున్న మృణ్మయీకి సాహసాలూ ఇష్టమే! మోటర్ సైకిల్ రైడింగ్స్, ట్రెకింగ్ ఆమె హాబీలు.

ఈ ప్రకృతిలో కనిపించే ప్రతి దృశ్యం.. ఎవ్రీ ఎక్స్‌పీరియెన్స్ నాకు ఇన్సిపిరేషనే అంటోంది మృణ్మయీ పాండే
















