సొంత భాష చిత్రాల్లో కంటే కొంతమంది పరభాషా చిత్రాల్లో బాగా పాపులర్ అవుతుంటారు. ఆ కోవలోని నటే సంయుక్త హోర్నాడ్. తెలుగు సినిమాలతో పాటు వరుస సిరీస్‌లూ చేస్తూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంటున్న ఆమె పరిచయం బ్రీఫ్‌గా.. అవార్డ్ విన్నర్ సంయుక్త హోర్నాడ్ అసలు పేరు.. సంయుక్త బేలవాడి. వారిది కళాకారుల కుటుంబం. తల్లి సుధా బేలవాడి నటి. తండ్రి ఎమ్‌జీ సత్య రావు రచయిత. నానమ్మ భార్గవి నారాయణ్ మేకప్ ఆర్టిస్ట్.
చదువు పూర్తి చేసిన వెంటనే యాంకర్‌గా మారింది. పలు టీవీ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించింది. 2011లో ‘లైఫూ ఇష్టనే’ కన్నడం చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసింది. మొదటి అవకాశంతోనే అదరగొట్టి, వరుసగా పలు భాషల్లో సినిమా అవకాశాలను అందుకుంది. ‘ఉలవచారు బిర్యాని’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించి, 2014 ‘ఉత్తమ సహాయ నటి’ ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకుంది.
తర్వాత ‘కృష్ణ అండ్ హిజ్ లీలా’ సినిమాలోనూ నటించింది. సంయుక్త జంతు ప్రేమికురాలు. మూగజీవుల సంరక్షకురాలిగా పలు స్వచ్ఛంద సంస్థల కార్యక్రమాల్లో పాల్గొంటూ తన వంతు సేవ చేస్తోంది. ఈ మధ్యనే ‘పీపుల్ ట్రీ ఫౌండేషన్’ సంస్థను స్థాపించి, పేద రోగులకు ఉచిత చికిత్స అందేలా చూస్తోంది. ప్రస్తుతం జీ5లో ‘గాడ్స్ ఆఫ్ ధర్మపురి’, ఆహాలో ‘ లాక్డ్’, డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో ‘ఝాన్సీ’ సిరీస్‌లతో అలరిస్తోంది.
ఓటీటీతో మంచి, చెడు రెండూ ఉన్నాయి. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఇంట్లోంచే ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తున్నారు. ఇది డిస్ట్రిబ్యూటర్లకు నష్టం కలిగిస్తున్నా.. ఇప్పుడిప్పుడే సినీ ప్రయాణం ప్రారంభిస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్లకు, జూనియర్ ఆర్టిస్టులకు, చిన్న నిర్మాతలకు మేలు చేస్తోంది. –సంయుక్త హోర్నాడ్
Comments
Please login to add a commentAdd a comment