
న్యూఢిల్లీ: సంపన్న వ్యాపారవేత్త, అదానీ గ్రూపు అధినేత గౌతమ్ అదానీ స్వీయ చరిత్ర (బయోగ్రఫీ) ఆధారంగా ఓ పుస్తకం ఈ ఏడాది అక్టోబర్‌లో విడుదల కానుంది. పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ (పీఆర్‌హెచ్‌ఐ) సోమవారం ఈ విషయాన్ని ప్రకటించింది. ‘గౌతమ్ అదానీ: ద మ్యాన్ హూ చేంజ్‌డ్ ఇండియా’ పేరుతో ఈ పుస్తకాన్ని జర్నలిస్ట్ ఆర్‌ఎన్ భాస్కర్ రాశారు.
గౌతమ్ అదానీ జీవితం గురించి తెలియని కొత్త అంశాలు కూడా ఈ పుస్తకంలో ఉంటాయని పెంగ్విన్ తెలిపింది. చిన్న నాటి విశేషాలు, వ్యాపారం ప్రారంభించడం, అవకాశాలను గుర్తించడం తదితర అంశాలకు చోటు ఇచ్చినట్టు పేర్కొంది.
చదవండి: ‘టైమ్స్’అత్యంత ప్రభావశీల వ్యక్తుల్లో గౌతమ్ అదానీ..కరుణా!
Comments
Please login to add a commentAdd a comment