
టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌గా రికార్డు సృష్టించిన ప్రముఖ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ (శ్రీలంక క్రికెటర్) జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘800’. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించారు. మురళీధరన్ పాత్రలో ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ఫేమ్ మధుర్ మిట్టల్, మురళీధరన్ భార్య మదిమలర్ పాత్రలో మహిమా నంబియార్ నటించారు.
ఈ సినిమా ఆల్ ఇండియా పంపిణీ హక్కులను నిర్మాత, శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ సొంతం చేసుకున్నారు. తమిళంలో రూపొందించిన ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ముత్తయ్య మురళీధరన్‌గారు బాల్యం నుంచి పడిన ఇబ్బందులు, ఆయన జర్నీ మొత్తం ఈ సినిమాలో ఉంటుంది. సెప్టెంబర్‌లో ట్రైలర్, అక్టోబర్‌లో సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment