bowler
-
అరంగేట్రంలోనే అదుర్స్.. ఎవరీ ‘నయా స్పీడ్‌గన్’? (ఫొటోలు)
-
Gareth Morgan: 6 బంతుల్లో 6 వికెట్లు
గోల్డ్‌కోస్ట్: ఆ్రస్టేలియా క్లబ్ క్రికెట్లో ఒక అరుదైన రికార్డు నమోదైంది. గోల్డ్‌కోస్ట్ ప్రీమియర్ లీగ్ డివిజన్–3 పోటీల్లో ఒక బౌలర్ ఓవర్లోని ఆరు బంతుల్లో ఆరు వికెట్లు పడగొట్టడం విశేషం. ముద్గీరబ నేరంగ్ అండ్ డిస్ట్రిక్ట్స్ క్లబ్ కెపె్టన్ గారెత్ మోర్గాన్ ఈ ఘనత సాధించి చరిత్రకెక్కాడు. సర్ఫర్స్ ప్యారడైజ్ సీసీ జట్టుపై అతను ఈ రికార్డు సృష్టించాడు. 40 ఓవర్ల మ్యాచ్‌లో 179 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సర్ఫర్స్ క్లబ్ 39 ఓవర్లలో 174/4 వద్ద నిలిచింది. చివరి ఓవర్లో మరో 5 పరుగులు చేస్తే చాలు. అయితే గారెత్ ఆరు బంతుల్లో ఆరు వికెట్లు తీసి సంచలనం సృష్టించడంతో 4 పరుగుల తేడాతో గెలుపు ముద్గీరబ జట్టు సొంతమైంది. అంతకుముందే ఈ ఇన్నింగ్స్‌లో మరో వికెట్ తీసిన గారెత్ మొత్తంగా 7/16తో ముగించాడు. గతంలో ప్రొఫెషనల్ క్రికెట్లో నీల్ వాగ్నర్ (న్యూజిలాండ్), అల్ అమీన్ (బంగ్లాదేశ్), అభిమన్యు మిథున్ (భారత్) ఒకే ఓవర్లో ఐదు వికెట్లు పడగొట్టారు. -
ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800’ రెడీ
టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌గా రికార్డు సృష్టించిన ప్రముఖ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ (శ్రీలంక క్రికెటర్) జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘800’. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించారు. మురళీధరన్ పాత్రలో ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ఫేమ్ మధుర్ మిట్టల్, మురళీధరన్ భార్య మదిమలర్ పాత్రలో మహిమా నంబియార్ నటించారు. ఈ సినిమా ఆల్ ఇండియా పంపిణీ హక్కులను నిర్మాత, శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ సొంతం చేసుకున్నారు. తమిళంలో రూపొందించిన ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ముత్తయ్య మురళీధరన్గారు బాల్యం నుంచి పడిన ఇబ్బందులు, ఆయన జర్నీ మొత్తం ఈ సినిమాలో ఉంటుంది. సెప్టెంబర్‌లో ట్రైలర్, అక్టోబర్‌లో సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. -
ధోని చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ మేట్ పాపం ఇప్పుడు మాత్రం బస్ కండక్టర్
-
T20 BLAST లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన బౌలర్..
-
పాతికేళ్లకు క్రికెట్ ఏంట్రీ.. ఇంజనీర్ T20 బౌలర్
-
అదే LSG కొంప ముంచింది ఇకనయినా కళ్ళు తెరవండి
-
విచిత్రమైన బౌలర్.. వికెట్ తీసి కామెంటరీ కూడా; వీడియో వైరల్
లండన్: క్రికెట్లో ఒక బౌలర్ వికెట్ తీస్తే సెలబ్రేట్ చేసుకోవడం సాధారణం. అందులో కొంతమంది మాత్రం తాము ఏం చేసినా ప్రత్యేకంగా ఉండాలని భావిస్తుంటారు. ఉదాహరణకు స్టెయిన్ వికెట్ తీస్తే చెయిన్ సా రియాక్షన్ ఇవ్వడం.. ఇమ్రాన్ తాహిర్ వికెట్ తీస్తే గ్రౌండ్ మొత్తం పరుగులు తీయడం.. విండీస్ బౌలర్ కాట్రెల్ వికెట్ తీసిన తర్వాత సెల్యూట్ చేయడం అలవాటు. ఎవరి సెలబ్రేషన్ ఎలా ఉన్నా వాటిని చూసే మనకు మాత్రం వినోదం లభించడం గ్యారంటీ. తాజాగా క్లబ్ క్రికెట్లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఈసీఎస్ టీ10 టోర్నీ సందర్బంగా బనేసా, బుకారెస్ట్ గ్లాడియేటర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో బుకారెస్ట్ గ్లాడియేటర్స్ స్పిన్నర్ పావెల్ ఫ్లోరిన్ వికెట్ తీసిన ఆనందంలో తనదైన శైలిలో సెలబ్రేట్ చేసుకున్నాడు. పావెల్ వేసిన లూప్ డెలివరీని అంచనా వేయడంలో పొరబడ్డ బ్యాట్స్‌మన్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో పావెల్ పిచ్‌పై నుంచి పెవిలియన్ వైపు పరిగెత్తాడు. బౌండరీ చివరల్లో ఆగుతాడునుకుంటే ఎవరు ఊహించని విధంగా కామెంటేటరీ సెక్షన్లోకి వెళ్లి.. '' నేను వికెట్ తీశాను.. నా బౌలింగ్ ఎలా ఉంది'' అంటూ గట్టిగా అరిచాడు. ఆ తర్వాత మళ్లీ గ్రౌండ్లోకి వచ్చి బౌలింగ్‌ను కంటిన్యూ చేశాడు. అతని చర్యలకు సహచర ఆటగాళ్లతో పాటు ప్రత్యర్థి ఆటగాళ్లు నవ్వుకున్నారు. ఏది ఏమైనా పావెల్ ఫ్లోరిన్ చేసిన పని నెటిజన్లను మాత్రం విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఒక వికెట్ తీసినంత మాత్రానా ఇంత చేయాల్సిన అవసరం ఉందా అంటూ కొందరు ఘాటుగా పేర్కొన్నారు. Live the moment #cricket pic.twitter.com/k9cbtmKUrE — Pavel Florin (@PavelFlorin13) July 24, 2021 -
ఎనిమిదేళ్ల క్రితం చేసిన ట్వీట్‌కు ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాడు..
లండన్: లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌లో అరంగేట్రం మ్యాచ్‌లోనే నాలుగు వికెట్లతో సంచలన ప్రదర్శన చేసిన ఇంగ్లండ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఒలీ రాబిన్సన్ గతంలో సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ కారణంగా వివాదాల్లో చిక్కుకున్నాడు. 27 ఏళ్ల రాబిన్సన్ 2012-13లో ట్విటర్ వేదికగా చేసిన జాత్యాంహకార వ్యాఖ్యలే ఇందుకు కారణం. దాదాపు ఎనిమిదేళ్ల కిందట రాబిన్సన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన పోస్ట్ తాజాగా వెలుగుచూడటంతో, అతనిపై ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్(ఈసీబీ) దర్యాప్తునకు ఆదేశించింది. ఈ అంశంపై ఇంగ్లండ్ బ్యాటింగ్ కోచ్ గ్రహం థోర్ఫ్ స్పందిస్తూ.. భవిష్యత్తులో జాతీయ జట్టుకు ఎంపికయ్యే అటగాళ్లకు సంబంధించిన సోషల్ మీడియా చరిత్ర ఆయా దేశాలకు చెందిన క్రికెట్ బోర్డ్‌లు పరిశీలనలోకి తీసుకుంటాయేమోనని వ్యాఖ్యానించాడు. యువ క్రికెటర్లు తెలిసి తెలియని వయసులో చేసిన తప్పుల కారణంగా వివాదాల్లో చిక్కుకోకుండా ఉండాలంటే ఇది సరైన నిర్ణయమని ఆయన అభిప్రాయపడ్డాడు. అయితే, రాబిన్సన్ కూడా ఈ విషయంపై స్పందించాడు. యుక్త వయసులో మిడిమిడి జ్ఞానంతో ఆ తప్పు చేశానని, ఇప్పుడు తాను పరిణితి చెందానని, ఏదిఏమైనా తాను అలాంటి లింగ పక్షపాతంతో కూడిన జాత్యాంహకార వ్యాఖ్యలు చేసి ఉండకూడదని క్షమాణలు చెప్పాడు. గతంలో తన చర్యల వల్ల సిగ్గుపడుతున్నానని, దయ చేసి సభ్య సమాజం తనను మన్నించాలని విజ్ఞప్తి చేశాడు. ఇదిలా ఉంటే, బుధవారం న్యూజిలాండ్‌తో మొదలైన తొలి టెస్ట్‌లో డెవాన్ కాన్వే అద్భుత ద్విశతకం సాయంతో పర్యాటక జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 378 పరుగులకు ఆలౌటైంది. మీడియం పేసర్ ఒలీ రాబిన్సన్(4/75), మార్క్ వుడ్(3/81), జేమ్స్ ఆండర్సన్(2/83)లకు వికెట్లు దక్కాయి. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. ఆరంభంలోనే డామినిక్ సిబ్లీ(0), జాక్ క్రాలీ(2)ల వికెట్లు కోల్పోయినప్పటికీ.. రోరీ బర్న్స్(59 నాటౌట్), కెప్టెన్ జో రూట్(42 నాటౌట్) ఆదుకోవడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు నష్టానికి 111 పరుగులు సాధించింది. చదవండి: కోహ్లీ, రవిశాస్త్రి ఆడియో లీక్.. -
భువీ బర్త్ డే.. కెరీర్ విశేషాలివే..!
హైదరాబాద్: టీమిండియా స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్‌కు ప్రపంచవ్యాప్త క్రీడాభిమానుల నుంచి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. నేడు (ఫిబ్రవరి 5) భువీ 31వ పడిలోకి అడుగుపెట్టాడు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఈ మీడియం పేసర్.. బంతిని రెండువైపులా స్వింగ్ చేయడంలో సమర్ధుడు. ప్రతి బంతిలోనూ వైవిధ్యం చూపగలిగే ఈ ఆటగాడు.. ఆరంభ ఓవర్లలో వికెట్లు తీయడంతో పాటు ఆఖరి ఓవర్లలో బంతి వేగంలో వైవిధ్యాన్ని చూపుతూ పొదుపుగా బౌలింగ్ చేయడంలో దిట్ట. 'నకుల్' బంతికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిన భువీ.. సమర్ధవంతమైన బౌలర్‌గానే కాకుండా నమ్మకమైన లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. టీమిండియా తరపున 21 టెస్ట్‌లు, 114 వన్డేలు, 43 టీ20లు ఆడిన భువీ.. 63 టెస్ట్ వికెట్లు, 132 వన్డే వికెట్లు, 41 టీ20 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్న భువీ.. టీమిండియా సాధించిన అనేక విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. 2011 ఐపీఎల్ సీజన్లో పూణే వారియర్స్ తరపున బరిలోకి దిగిన భువీ.. సంచలన ప్రదర్శనలతో వెలుగులోకి వచ్చి, జాతీయ జట్టులో చోటు సంపాదించాడు. ప్రస్తుతం ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అతను.. గాయం కారణంగా గతేడాది కేవలం నాలుగు మ్యాచ్‌ల్లో మాత్రమే పరిమితమయ్యాడు. ఇటీవల ముగిసిన ముస్తాక్ అలీ టోర్నీలో పునరాగమనం చేసిన భువీ.. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో జట్టులో స్థానం సంపాదించేందుకు కృషి చేస్తున్నాడు. భువీ జన్మదినం సందర్భంగా అతని కెరీర్‌లోని విశేషాలపై ఓ లుక్కేద్దాం. రంజీల్లో సచిన్‌ను డకౌట్ చేసిన తొలి బౌలర్‌గా గుర్తింపు వన్డే కెరీర్లో తొలి బంతికే వికెట్ సాధించాడు 2014 ఇంగ్లండ్ పర్యటనలో 9వ నంబర్ బ్యాట్స్‌మెన్‌గా బరిలోకి దిగి మూడు అర్ధశతకాలు సాధించిన తొలి భారత క్రికెటర్ ఐపీఎల్ చరిత్రలో రెండు వరుస సీజన్లలో(సన్‌రైజర్స్ తరపున 2016, 2017) పర్పుల్ క్యాప్ సాధించిన ఏకైక ఆటగాడు మూడు క్రికెట్ ఫార్మాట్లలో 5వికెట్ల ఘనత సాధించిన తొలి భారత బౌలర్ Just a thread of Bhuvi and Nupur being the cutest together ❤️ @BhuviOfficial#HappyBirthdayBhuvi pic.twitter.com/WLF1v1lnde — Happy Birthday Bhuvs ❤️ (@ishita11x) February 5, 2021 -
‘ఓవర్లో రెండు బౌన్సర్లకు అనుమతించాలి’
న్యూఢిల్లీ: టి20 క్రికెట్లో ప్రస్తుతం ఉన్న నిబంధనలను ఉన్నపళంగా మార్చాల్సిన అవసరం లేదని, అయితే బ్యాట్‌కు, బంతికి మధ్య సమతూకం ఉంచే చర్యలు మాత్రం తీసుకోవాలని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ అన్నారు. ఈ ఫార్మాట్లో బౌలర్‌కు కూడా కాస్త అనుకూలత ఉండేందుకు ఓవర్లో రెండు బౌన్సర్లను అనుమతించాలని ఆయన సూచించారు. ‘టి20 క్రికెట్ ఇప్పుడు అన్ని రకాలుగా బాగుంది. అయితే బ్యాట్స్‌మన్ ఆధిపత్యం బాగా పెరిగిపోయింది. కాబట్టి బౌలర్ కోసం ఓవర్‌కు రెండు బౌన్సర్లు అనుమతించాలి. మైదానాల్లో ఉన్న అవకాశాన్ని బట్టి బౌండరీ దూరం కూడా పెంచాలి’ అని సన్నీ చెప్పారు. మరోవైపు నోబాల్‌లను మూడో అంపైర్లు పర్యవేక్షిస్తున్న విధంగానే బంతి వేయక ముందే క్రీజ్ దాటి ముందుకు వచ్చే నాన్స్ట్రయికర్ల విషయంలో కూడా ఒక కన్నేయాలని అభిప్రాయపడ్డారు. అలా చేస్తే బ్యాట్స్‌మన్ ఖాతాలోంచి ఒక పరుగు తగ్గించాలని వ్యాఖ్యానించిన గావస్కర్... గత మ్యాచ్‌లో ఫించ్‌ను అశ్విన్ మన్కడింగ్ చేయకపోవడాన్ని అభినందించారు. ‘అశ్విన్ చాలా తెలివైన క్రికెటర్. ఇలా చేయడం ద్వారా అతను జట్టు కోచ్ పాంటింగ్ మాటకు విలువిచ్చినట్లు, గౌరవించినట్లు అయింది. ఆపై మళ్లీ చేస్తే వదిలిపెట్టనంటూ హెచ్చరిక జారీ చేయడం కూడా చెప్పుకోదగ్గ విషయం’ అని భారత మాజీ కెప్టెన్ విశ్లేషించారు. -
భలే బ్రాడ్ ...
సరిగ్గా ఐదేళ్ల క్రితం... యాషెస్ సిరీస్‌లో భాగంగా నాటింగ్‌హామ్‌లో ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు. కొత్త బంతితో స్టువర్ట్ బ్రాడ్ చేసిన అద్భుతానికి ఆసీస్ విలవిల్లాడింది. కేవలం 9.3 ఓవర్లలో 15 పరుగులే ఇచ్చి బ్రాడ్ 8 వికెట్లు తీయగా, ఆస్ట్రేలియా 60 పరుగులకే కుప్పకూలింది. ప్రపంచ అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ స్పెల్ బ్రాడ్‌కు చిరకాల గుర్తింపును తెచ్చి పెట్టింది. ఈ మ్యాచ్‌లో తన 300 వికెట్లు మైలురాయిని దాటిన అతను మరింత పదునెక్కిన బౌలింగ్‌తో వేగంగా మరో 200 వికెట్లు తన ఖాతాలో వేసుకొని ‘500’ క్లబ్లో చేరిన అరుదైన ఆటగాడిగా నిలిచాడు. సాక్షి క్రీడా విభాగం: స్టువర్ట్ బ్రాడ్ అంటే ఎక్కువ మంది భారత అభిమానులకు మన యువరాజ్ చేతిలో చావుదెబ్బ తిన్న బౌలర్‌గానే గుర్తుండిపోతాడు. అయితే ఈ ఒక్క ప్రదర్శనతో అతని టెస్టు క్రికెట్ ఘనతలు తక్కువ చేయలేం. 2007 టి20 ప్రపంచకప్‌లో ఒకే ఓవర్లో యువీ వరుసగా 6 సిక్సర్లు బాదేనాటికి బ్రాడ్ ఇంకా టెస్టు క్రికెటర్ కాదు. ఆ తర్వాత దాదాపు మూడు నెలలకు అతని అరంగేట్రం జరిగింది. తక్కువ వ్యవధిలోనే ఇంగ్లండ్ జట్టులో అతను మూడు ఫార్మాట్లలో కూడా కీలక ఆటగాడిగా మారాడు. టి20ల్లో అతను జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. అయితే టెస్టు క్రికెట్‌కే బ్రాడ్ అవసరం ఎక్కువగా ఉందని భావించిన ఇంగ్లండ్ బోర్డు మిగతా ఫార్మాట్ల నుంచి అతనికి విరామం ఇస్తూ వచ్చింది. చివరకు అతను వాటికి దూరమై పూర్తిగా టెస్టులకే పరిమితమయ్యాడు. బ్రాడ్ తన చివరి టి20 మ్యాచ్ 2014లో, చివరి వన్డే 2016లో ఆడాడు. చిరస్మరణీయ ప్రదర్శనలెన్నో... వేగం, కచ్చితత్వంతో పాటు బౌలింగ్‌లో దూకుడు ప్రదర్శించడం అతని శైలి. ఒకసారి జోరు మొదలైందంటే అతడిని ఎదుర్కోవడం ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ప్రమాదకరంగా మారిపోతుంది. వంద టెస్టులు ముగిసేసరికి ఒకే స్పెల్‌లో కనీసం ఐదు వికెట్లు పడగొట్టిన ప్రదర్శనలు అతని నుంచి ఏడు సార్లు వచ్చాయంటేనే ఇది అర్థమవుతుంది. 2007లో శ్రీలంకతో ఆడిన తొలి సిరీస్‌లో విఫలమైనా... కొద్ది రోజులకే న్యూజిలాండ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన అతని ప్రతిభను ప్రపంచానికి చూపించింది. యాషెస్ సిరీస్ ఇంగ్లండ్ ఆటగాళ్లను హీరోలుగా లేదా జీరోలుగా మారుస్తుంది. బ్రాడ్ విషయంలో కూడా అదే జరిగింది. 2009 యాషెస్ టెస్టులో అతను 37 పరుగులకే 5 వికెట్లు తీయడంతో మ్యాచ్ ఇంగ్లండ్‌వైపు మలుపు తిరిగింది. ఆ తర్వాత బ్రాడ్ కెరీర్లో వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. న్యూజిలాండ్‌పై 7/44, వెస్టిండీస్‌పై 7/72, జొహన్నెస్‌బర్గ్‌లో 6/17, భారత్‌పై 2014లో 6/25... ఇలా అతని అద్భుత ప్రదర్శనల్లో కొన్ని. అండర్సన్‌కు జోడీగా... సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్‌తో కలిసి అతని భాగస్వామ్యం ఇంగ్లండ్‌కు ఎన్నో అద్భుత విజయాలు అందించింది. టీమ్ సుదీర్ఘ కాలంగా నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలవడంలో వీరిద్దరు కీలకపాత్ర పోషించారు. అండర్సన్ పలు రికార్డులు నెలకొల్పగా, జూనియర్ సహచరుడిగా బ్రాడ్ అదే బాటలో అతడిని అనుసరించాడు. బ్రాడ్ ఆడిన 140 టెస్టుల్లో అండర్సన్ 117 టెస్టుల్లో భాగస్వామిగా ఉన్నాడు. ఈ మ్యాచ్‌లలో వీరిద్దరు కలిసి 895 వికెట్లు పడగొట్టడం విశేషం. అయితే అండర్సన్ నీడలో ఉండిపోకుండా బ్రాడ్ తన సొంతశైలితో విజయవంతమైన బౌలర్‌గా ఎదిగాడు. అతను లేని సందర్భాల్లో ప్రధాన పేసర్‌గా జట్టు భారం మోశాడు. బ్రాడ్ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన (8/15) టెస్టులో అండర్సన్ ఆడకపోవడం గమనార్హం. కొన్నిసార్లు గాయాలు కెరీర్‌ను ప్రమాదంలో పడేసినా... బ్రాడ్ పడి లేచిన కెరటంలా మళ్లీ దూసుకుపోయాడు. ఒక ఫాస్ట్ బౌలర్ ఇంత సుదీర్ఘ కాలం ఆటలో కొనసాగి పెద్ద సంఖ్యలో టెస్టులు ఆడటం అసాధారణం. ప్రతిభతో పాటు ఎంతో శ్రమ, పట్టుదల, అంకితభావంతోనే అది సాధ్యమవుతుంది. 34 ఏళ్ల బ్రాడ్ దీనిని చేసి చూపించాడు. 500 వికెట్ల మైలురాయిని దాటి టెస్టు చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని లిఖించుకున్నాడు. ► 2 తన టెస్టు కెరీర్లో బ్రాడ్ రెండు ‘హ్యాట్రిక్’లు తీసుకున్నాడు. 2011లో నాటింగ్‌హామ్‌లో భారత్‌పై... 2014లో లీడ్స్‌లో శ్రీలంకపై అతను ఈ ఘనత సాధించాడు. ► 7 టెస్టుల్లో 500కు పైగా వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో బ్రాడ్ ఏడో బౌలర్‌గా నిలిచాడు. మురళీధరన్ (800), వార్న్ (708), కుంబ్లే (619), అండర్సన్ (589), మెక్‌గ్రాత్ (563), వాల్‡్ష (519) మాత్రమే అతనికంటే ముందున్నారు. -
రెక్కలు తొడిగి... రివ్వున దూసుకెళ్లి
చిన్నప్పుడు ఆ అమ్మాయి క్రికెటర్ కావాలనుకుంది... మామూలుగా క్రికెట్ ఆడటమే కాదు దేశానికే ప్రాతినిధ్యం వహించింది...ఆమెను ఇంజనీర్‌గా చూడాలని అమ్మానాన్న అనుకున్నారు... సీరియస్‌గా చదువుపై దృష్టి పెట్టి ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఆ అమ్మాయి తల్లిదండ్రులకిచ్చిన మాటను నిలబెట్టుకుంది... ఎప్పటికైనా ఎయిర్‌ఫోర్స్‌లో పని చేయాలనేది ఆమె కల... అర్హత పరీక్షలో సత్తా చాటి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌గా ఎంపికైంది... ఒకే అమ్మాయిలో ఇన్ని విభిన్న కోణాలు కలగలిస్తే ఆమె శిఖా పాండే అవుతుంది. ప్రస్తుతం టి20 ప్రపంచకప్‌లో భారత్ వరుస విజయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్న పేస్ బౌలర్. ప్రపంచ కప్ గెలిచిన జట్టులో భాగం కావాలనేది శిఖా బలమైన కోరిక. 2017 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో తన రనౌట్‌తోనే ఆమె కల చెదిరింది. ఈ సారైనా అది నెరవేరుతుందా అనేది ఆసక్తికరం. (సాక్షి క్రీడా విభాగం): ప్రొఫెషనల్‌గా ఆటలో సత్తా చాటుతూ మరో వైపు సమాంతరంగా ఉన్నత చదువులను కొనసాగించేవారు క్రికెట్ ప్రపంచంలో అతి తక్కువ మంది కనిపిస్తారు. అనిల్ కుంబ్లే, అశ్విన్, అంజుమ్ చోప్రాలాంటి వారు కూడా ఇంజినీరింగ్‌లు చదివినా దానిని పేరుకు, డిగ్రీ పట్టా అందుకోవడం వరకే పరిమితం చేశారు. మరో వైపు ఆటగాళ్లకు ప్రోత్సాహంగా కొన్ని సంస్థలు ఇచ్చే మేనేజర్ తరహా ఉద్యోగాలు కూడా ఉంటాయి. కానీ భారత మహిళా క్రికెటర్ శిఖా సుభాశ్ పాండే మాత్రం వీటికి భిన్నం. తన సామర్థ్యానికి తగినట్లుగా పోటీల్లో నిలిచి తాను అనుకున్న ఉద్యోగంలో చేరింది. ఒక వైపు క్రికెటర్‌గా భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తూనే ఎయిర్‌పోర్ట్‌లో కూడా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ఆసక్తి, ప్రతిభ ఉంటే ఎన్ని విజయాలైనా సాధించవచ్చని చేతల్లో చూపించిన శిఖా కెరీర్ ఎందరో అమ్మాయిలకు స్ఫూర్తిదాయకం. జూనియర్ క్రికెట్ నుంచి... శిఖా క్రికెట్ కెరీర్ గోవాలో మొదలైంది. గల్లీల్లో కుర్రాళ్లతో కలిసి ఆడిన ఆమె స్కూల్ క్రికెట్లో సత్తా చాటడంతో వరుసగా అవకాశాలు వచ్చాయి. రాష్ట్ర స్థాయిలో అండర్–17, అండర్–19 స్థాయిలో వరుసగా మ్యాచ్‌లు ఆడే అవకాశం లభించింది. అప్పుడప్పుడే ఎదుగుతున్న గోవా క్రికెట్లో పెద్దగా పోటీ కూడా లేని సమయం కావడంతో వేగంగా దూసుకుపోవడం సులువైంది. అదే సమయంలో బీసీసీఐ కూడా మహిళా క్రికెట్‌ను గుర్తించడంతో శిఖా ప్రదర్శన అందరి దృష్టినీ ఆకర్షించింది. దాంతో ఉమెన్ చాలెంజర్ టోర్నీ, సౌత్‌జోన్ అండర్–19 జట్లలో అవకాశాలు దక్కాయి. అనంతరం గోవా సీనియర్ టి20 టీమ్‌లో వచ్చేందుకు కూడా ఎక్కువ సమయం పట్టలేదు. 2011లో భారత పర్యటనకు వచ్చిన వెస్టిండీస్ జట్టుతో టూర్ మ్యాచ్ ఆడిన భారత ‘ఎ’ జట్టులో, ఇంగ్లండ్‌పై ఆడిన బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టులో కూడా చోటు దక్కింది. వరుస వికెట్లతో శిఖా ఈ పోటీల్లో సత్తా చాటింది. ఆపై భారత జట్టులో స్థానం లభించడం లాంఛనమే అయింది. గోవా తరఫున భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తొలి క్రికెటర్‌గా పాండే అరుదైన ఘనత అందుకుంది. ప్రధానంగా పేస్ బౌలరే అయినా...లోయర్ ఆర్డర్లో ధాటిగా ఆడుతూ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. చదువులో తగ్గకుండా... ఆటలో ఎదగాలనుకునేవారికి అందరికంటే ముందుగా కోచ్‌లు, సన్నిహితులు చెప్పే మాట ఒకటే. రెండు పడవల ప్రయాణం మంచిది కాదని, ఏదో ఒక రంగాన్ని ఎంచుకొని పూర్తిగా దానిపైనే దృష్టి పెట్టాలని సూచిస్తుంటారు. కానీ శిఖా అలా అనుకోలేదు. ఆటలో పడి చదువును ఏనాడూ నిర్లక్ష్యం చేయలేదు. స్కూల్నుంచి కాలేజీ వరకు మంచి మార్కులతో నంబర్‌వన్‌గా ఉంటూ తనపై నమ్మకాన్ని నిలబెడుతూ వచ్చింది. అప్లయిడ్ మ్యాథమెటిక్స్ అంటే ఆమెకు చాలా ఇష్టం. తల్లిదండ్రుల కిచ్చిన మాట ప్రకారం గోవా కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్నుంచి ‘ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్’లో పట్టా అందుకుంది. ఆ అర్హతతో పలు పెద్ద కంపెనీలు ఉద్యోగం ఇచ్చేందుకు సిద్ధమైనా... క్రికెట్లో ముందుకు వెళ్లటమే లక్ష్యంగా పెట్టుకుంది. 2011లో ఎయిర్‌ఫోర్స్‌లోకి ఎంపికైన శిఖా ఏడాది శిక్షణ అనంతరం ఫ్లయింగ్ ఏటీసీ ఆఫీసర్‌గా నియమితురాలైంది. అటు క్రికెట్ ఆడుతూ, ఇటు సీరియస్‌గా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఆమె తన కెరీర్‌ను కొనసాగించిన తీరు నిజంగా అద్భుతం. గత టి20 ప్రపంచకప్‌కు ముందు భారత జట్టులో చోటు కోల్పోయినా...పట్టుదలతో పోరాడి తిరిగొచ్చిన శిఖా పునరాగమనంలో మరింత పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థులను పడగొడుతోంది. కరీంనగర్ నుంచి... శిఖా తండ్రి సుభాశ్ పాండే కేంద్రీయ విద్యాలయ(కేవీ) పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేసేవారు. ఉద్యోగరీత్యా వేర్వేరు ప్రాంతాల్లో పని చేసిన ఆయన చివరకు గోవాలో స్థిరపడ్డారు. గతంలో తెలంగాణలోని రామగుండంలో ఆయన పని చేశారు. అదే సమయంలో శిఖా కరీంనగర్‌లోనే పుట్టింది. కేవీ కారణంగానే స్పోర్ట్స్‌పై ఆమెకు ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఢిల్లీలోని పాలమ్ విమానాశ్రయంలో ఆమె ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తోంది. 31 ఏళ్ల శిఖాను పేస్ బౌలర్‌గా, యార్కర్ స్పెషలిస్టుగా తీర్చిదిద్దడంలో భారత మాజీ పేసర్ సుబ్రతో బెనర్జీ కీలక పాత్ర పోషించారు. -
జేఎల్ఆర్ చేతికి ‘బౌలర్’
న్యూఢిల్లీ: ఏ తరహా ప్రాంతంలోనైనా పరుగులు తీసే పెర్ఫామెన్స్ కార్లను, విడి భాగాలను, ర్యాలీ రెయిడ్ వాహనాల్ని తయారు చేసే బ్రిటన్ సంస్థ బౌలర్‌ను టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల విభాగం జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) కొనుగోలు చేసింది. ఆఫ్–రోడ్ కాంపిటీషన్ కార్లను కూడా తయారు చేసే బౌలర్ కంపెనీ ఇకపై జేఎల్ఆర్కు చెందిన స్పెషల్ వెహికల్ ఆపరేషన్స్ వ్యాపారంలో ఒక భాగం కానుంది. అయితే ఎంత మొత్తానికి ఈ సంస్థకు కొనుగోలు చేశారన్న వివరాలను మాత్రం జేఎల్ఆర్ వెల్లడించలేదు. -
ఐపీఎల్లో నాలుగో బౌలర్‌గా
-
ఫిక్సింగ్‌లో లంక మాజీ క్రికెటర్!
దుబాయ్: మ్యాచ్ ఫిక్సింగ్ వివాదంలో మరో శ్రీలంక ఆటగాడు చిక్కుకున్నాడు. ఫిక్సింగ్ ఆరోపణలపై లంక మాజీ పేసర్ దిల్హారా లొకుహెట్టిగేపై ఐసీసీ నిషేధం విధించింది. గత ఏడాది డిసెంబర్లో యూఏఈలో జరిగిన టి10 లీగ్ సందర్భంగా ఫిక్సింగ్ చోటు చేసుకుందనేది ప్రధాన ఆరోపణ. దీనికి సంబంధించి లొకుహెట్టిగేపై ఐసీసీ మూడు వేర్వేరు అభియోగాలు నమోదు చేసింది. ఇటీవల దాదాపు ఇదే తరహాలో ఆరోపణలతో మాజీ పేసర్ నువాన్ జోయ్సాపై కూడా ఐసీసీ అభియోగాలు మోపడం గమనార్హం. శ్రీలంక తరఫున 9 వన్డేలు, 2 టి20లు ఆడిన లొకుహెట్టిగే ప్రస్తుతం ఆస్ట్రేలియాలో నివాసం ఉంటున్నా... అతను లంక బోర్డుకు సంబంధించిన వ్యక్తులతో సంబంధాలు కొనసాగిస్తున్నాడు. -
ఉమేశ్ ఉప్పెన...
సాక్షి, హైదరాబాద్: ‘నేనెప్పుడైనా పొదుపుగా బౌలింగ్ చేసి బయట పడిపోవాలని ప్రయత్నించను... నా చేతిలో బంతి ఉందంటే వికెట్లు తీయడంపైనే దృష్టి పెడతా’... ఇటీవల తన బౌలింగ్ గురించి ఉమేశ్ యాదవ్ చేసిన వ్యాఖ్య ఇది. అతని బౌలింగ్ పదును ఏమిటో తాజాగా హైదరాబాద్ టెస్టులో కనిపించింది. జీవం లేని భారత పిచ్‌లపై ఒక ఫాస్ట్ బౌలర్ టెస్టుల్లో దాదాపు 140 కిలోమీటర్ల వేగంతో బంతులు వేయడం అంత సులువు కాదు. విదేశాల్లో మన పేసర్లు చెలరేగిపోవడం కూడా కొత్త కాదు. కానీ సత్తా ఉంటే భారత్‌లో కూడా పేసర్లు సత్తా చాటగలరని ఉమేశ్ నిరూపించాడు. బౌన్స్‌కు అనుకూలించిన ఉప్పల్ పిచ్‌పై అతను చక్కటి ఫలితం రాబట్టాడు. భారత్‌లో 5 వికెట్లు, 10 వికెట్లు తీసిన బౌలర్ అంటే ఏ అశ్వినో, జడేజానో అని అలవాటుగా మారిపోయిన అందరికీ నేనున్నానని ఉమేశ్ గుర్తు చేశాడు. స్వదేశంలో 19 ఏళ్ల తర్వాత 10 వికెట్ల ఘనత సాధించిన పేసర్‌గా కపిల్, శ్రీనాథ్‌ల సరసన నిలిచాడు. సొంతగడ్డపై వచ్చేసరికి భారత ప్రధాన పేసర్‌గా ఉమేశ్‌కే ఎక్కువ అవకాశాలు దక్కాయి. ఆగస్టు 2016 నుంచి భారత్ ఇక్కడ 18 టెస్టులు ఆడితే అతను 17 ఆడాడు. సొంతగడ్డపై తన ఎంపికకు ప్రతీసారి న్యాయం చేశాడు. మొత్తంగా భారత్‌లో 24 టెస్టుల్లో ఉమేశ్ పడగొట్టిన 73 వికెట్లలో 38 బౌల్డ్ లేదా ఎల్బీడబ్ల్యూలే ఉన్నాయి. ఇది అతని బౌలింగ్ సత్తాను చూపించింది. హైదరాబాద్ టెస్టులో ఉమేశ్ ప్రదర్శన అతని కఠోర శ్రమకు, పట్టుదలకు నిదర్శనం. భారత్‌లో గత రెండేళ్లుగా అద్భుతమైన రికార్డు ఉన్నా విదేశాలకు వెళ్లేసరికి అతనికి తుది జట్టులో స్థానం లభించడమే గగనంగా మారిపోయింది. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లలో కలిపి ఎనిమిది టెస్టుల్లో అతనికి రెండు మ్యాచ్‌లు మాత్రమే లభించాయి. సుదీర్ఘ కాలంగా జట్టుతో ఉన్నా ఇషాంత్, షమీ, భువనేశ్వర్‌ల తర్వాతే అతనికి అవకాశం దక్కేది. ఇప్పుడు పైజాబితాలో బుమ్రా కూడా చేరడంతో ఉమేశ్ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. అయితే దీనికి అతను కుంగిపోలేదు. ఏ దశలోనూ సహనం కోల్పోని ఉమేశ్... ‘వారంతా బాగా ఆడుతుంటే నేను చోటు ఆశించడం తప్పు. నాకు అవకాశం వచ్చినప్పుడు మాత్రం చెలరేగాల్సిందే’ అంటూ నిజాయితీగా వ్యాఖ్యానించాడు. వరుసగా అవకాశాలు దక్కకపోయినా... ఎప్పుడో ఒకసారి మ్యాచ్ అవకాశం దక్కినా 100 శాతానికి పైగా శ్రమిస్తూ పూర్తి ఉత్సాహంతో బౌలింగ్ చేయడం ఉమేశ్‌కు బాగా తెలుసు. రెండో టెస్టులో శార్దుల్ గాయంతో సింగిల్ హ్యాండ్ పేసర్‌గా బౌలింగ్ చేయాల్సి వచ్చింది. ఒక రోజులో భారత గడ్డపై ఒక పేసర్ ఏకంగా 23 ఓవర్లు బౌలింగ్ చేయడం అసాధారణం. కానీ ఉమేశ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఇది అతని ఫిట్నెస్ సామర్థ్యానికి సూచిక. అతని 118 అంతర్జాతీయ మ్యాచ్‌ల కెరీర్లో ఇదే మొదటి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు కావడం విశేషం. వేగానికి స్వింగ్ జోడిస్తే ఆ బౌలింగ్‌కు ఏ ఫార్మాట్లోనైనా తిరుగుండదని నమ్మే ఉమేశ్ ఆస్ట్రేలియాలోని బౌన్సీ పిచ్‌లపై అత్యంత కీలకంగా మారతాడనడంలో సందేహం లేదు. 2012లో పెర్త్ వికెట్‌పై ఐదు వికెట్లు తీసిన అతను ఈసారి మరింత జోష్‌తో అక్కడికి వెళ్లడం ఖాయం. పదో వికెట్ కోసం... విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 33వ ఓవర్ ఉమేశ్ వేశాడు. అప్పటికే విండీస్ 6 వికెట్లు కోల్పోతే అతను 3 వికెట్లు తీశాడు. అయితే తర్వాతి 13 ఓవర్లు స్పిన్నర్లే వేశారు. విండీస్ 9 వికెట్లు కోల్పోయిన దశలో 47వ ఓవర్ జడేజా వేయడానికి సిద్ధమయ్యాడు. బంతిని తీసుకొని ఇక ఓవర్ మొదలు పెట్టడమే ఆలస్యం. అయితే అప్పటి వరకు పెద్దగా దృష్టి పెట్టని కోహ్లికి ఒక్కసారిగా ఉమేశ్ పదో వికెట్ ఘనత గుర్తుకొచ్చినట్లుంది. దాంతో జడేజా నుంచి బంతి తీసుకొని లాంగాన్‌లో ఉన్న ఉమేశ్‌ను పిలిచాడు. జడేజా కూడా నవ్వుతూ అతని భుజం చరిచి బెస్టాఫ్ లక్ చెప్పాడు. ఒకే ఒక్క బంతి... అంతే గాబ్రియెల్ క్లీన్ బౌల్డ్, ఉమేశ్ కెరీర్లో తొలిసారి 10 వికెట్ల ఘనత.. సహచరులంతా గట్టిగా అభినందిస్తూ అతని జుట్టు ముడి తీసి సరదాగా నవ్వుతుండగా ఉమేశ్ సగర్వంగా పెవిలియన్ వైపు చేరాడు. -
వికెట్ తీసిన ఆనందంలో గంతేస్తే..
హరారే: వికెట్ తీయగానే బౌలర్లు ఎగిరిగంతేస్తారు. ఇక్కడ ఒక్కో బౌలర్ ఒక్కో సిగ్నేచర్ స్టెప్‌తో అలరిస్తారు. ఈ జాబితాలో వెస్టిండీస్ ఆటగాళ్లు ముందుంటారు. ముఖ్యంగా విండీస్ స్టార్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రేవో వికెట్ తీయగానే అతడు వేసే స్టెప్పులు అభిమానులను ఎంతగానే ఆకట్టుకుంటాయి. ఇలా వికెట్ తీసి సంబరాలు చేసుకునే క్రమంలో బౌలర్ గాయపడటం అనేది చాలా అరుదు. అయితే పాక్ బౌలర్ హసన్ అలీ వికెట్ తీసిన ఆనందంలో గాయపడ్డాడు. హసన్ అలీ వికెట్ తీయగానే తనదైన రీతిలో సిగ్నేచర్ స్టైల్ (బాంబ్ ఎక్స్ప్లోజన్)తో పాక్ అభిమానులను అలరిస్తుంటాడు. జింబాబ్వేతో వన్డే సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్‌లో హసన్ అలీ ఆతిథ్య బ్యాట్స్‌మన్‌ను ఔట్ చేయగానే తనదైన రీతిలో సంబరాలు ప్రారంభించాడు. తన స్టైల్లో ఆనందం వ్యక్తపరిచే ప్రయత్నం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా మెడ కండరాలు పట్టేశాయి. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది. నెటిజన్లు పాక్ బౌలర్‌పై మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొందరు ఫన్నీగా కామెంట్స్ పెడితే.. మరికొందరు జాలి పడుతున్నారు. దీనిపై స్పందించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్(పీసీబీ) అలీ గాయం అంత తీవ్రతరమైనది కాదని పేర్కొంది. -
వికెట్ తీసి సంబరాలు చేసుకునే క్రమం
-
3.4 ఓవర్లు.. 4 పరుగులు.. 5 వికెట్లు...
దుబాయ్ : పదిహేడేళ్ల పాకిస్థాన్ కుర్రాడు షహీన్ అఫ్రిదీ పేరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోతోంది. బంతితో మైదానంలో షహీన్ దుమ్ము రేగొట్టాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో భాగంగా కేవలం నాలుగు పరుగులు ఇచ్చి.. ఐదు వికెట్లు పడగొట్టాడు. తద్వారా టీ-20 ఫార్మట్‌లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన కనబరిచిన నాలుగో బౌలర్‌గా నిలిచాడు. శుక్రవారం లాహోర్ క్వాలాండర్స్, ముల్తాన్ సుల్తాన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముల్తాన్ జట్టు ఒక దశలో 8 ఓవర్లలో వికెట్ నష్టానికి 60 పరుగులు చేసింది. ఇక అక్కడ నుంచి షహీన్ బంతితో చెలరేగిపోయాడు. 3.4 ఓవర్లు వేసిన షహీన్ కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. 16వ ఓవర్లలో మూడు వికెట్లు దక్కించుకోవటం విశేషం. వెరసి సుల్తాన్ ముల్తాన్ జట్టును 114 పరుగులకే షహీన్ కట్టడి చేశాడు. ఇక ఓవరాల్‌గా టీ20 ఫెర్మామెన్స్ గనుక గమనిస్తే... శ్రీలంక బౌలర్ హెరాత్ న్యూజిలాండ్‌పై, రషీద్ ఖాన్ ఐర్లాండ్‌పై, సోహైల్ తన్వీర్ ట్రిడెంట్స్ జట్టులపై 3 పరుగులిచ్చి ఐదేసి వికెట్లు పడగొట్టారు. ఈ లిస్ట్‌లో కుంబ్లేను (5 పరుగులు 5 వికెట్లు రాజస్థాన్ రాయల్స్ పై) కిందకి నెట్టి షహీన్ ఇప్పుడు నాలుగో స్థానంలో నిలిచాడు. -
వామ్మో.. ప్రత్యేకమైన శైలితో బౌలింగ్
-
వామ్మో.. బౌలింగ్ స్టైల్లో బూమ్రానే మించినోడు!
కొలంబో: ఓ ప్రత్యేక శైలితో బౌలింగ్ చేసే క్రికెటర్లు ఎవరంటే గుర్తొచ్చేది.. టీమిండియా యువ సంచలనం జస్ప్రీత్ బుమ్రా.. అతని బౌలింగ్ శైలే బ్యాట్స్‌మెన్‌ను తెగ ఇబ్బంది పెట్టడం చూశాం. అయితే బుమ్రా స్టైల్‌ను మించిండు.. శ్రీలంక అండర్-19 బౌలర్ కెవిన్ కాధ్ధిగోడా. తాజాగా అండర్-19 ఆసియా కప్‌లో ఆడిన ఈ బౌలర్ గురించే ఇప్పుడంతా చర్చ. కాకపోతే బుమ్రా పేస్ బౌలర్ అయితే కాధ్ధిగోడా స్పిన్ బౌలర్. అయితే ఇతని బౌలింగ్ ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ పాల్ అడమ్స్, ఐపీఎల్ టీమ్ గుజరాత్ లయన్స్ ప్లేయర్ శివిల్ కౌశిక్‌ను గుర్తుచేస్తోందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలా బౌలింగ్ చేయడం చాలా కష్టమని, శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం కూడా చాలా కష్టమని తెలిపారు. శ్రీలంక-ఎ జట్టు ఆటగాడు దమిక సుదర్శన్.. కెవిన్ గురించి మాట్లాడుతూ.. ‘కెవిన్ శైలి చాలా ప్రత్యేకం. ఇలా వేయాలని అతనికి ఎవరూ సూచించలేదు. ఆ శైలి అతనికి సహజంగానే వచ్చింది. మొదట్లో బంతిని సరైన లెంగ్త్‌లో వేయడంలో ఇబ్బంది పడేవాడు. క్రమంగా దాన్ని మెరుగుపరుచుకున్నాడు’ అని తెలిపారు. మైదానంలో నేరుగా అతని శైలిని చూసిన అంపైర్ సరత్ అశోక మాట్లాడుతూ.. ‘విభిన్న శైలిలో బంతిని సరైన ప్రదేశాల్లో వేస్తున్నాడు. కెవిన్‌కు మంచి భవిష్యత్తు ఉంది’ అని పేర్కొన్నారు. ఇప్పటికే లంక నుంచి ముత్తయ్య మురళిధరన్, అజంతా మెండీస్‌లు అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. వారి బాటలో కెవిన్ పయనిస్తాడో లేదో చూడాలి మరి. -
విరగబడి నవ్విన..ఆసీస్ యువ బౌలర్
సాక్షి, న్యూఢిల్లీ: కొత్తగా వచ్చి టీమిండియా టాపార్డర్‌ను కుప్పుకూల్చిన రాత్రికి రాత్రే హీరో అయిన ఆసీస్ యువ బౌలర్ బెహ్రన్ డార్ఫ్ విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు విరగబడి నవ్వారు. గువాహటి వేదికగా జరిగిన రెండో టీ20లో భారత బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ(2), కోహ్లి(0), మనీష్ పాండే (6), శిఖర్ ధావన్(2)లను వరుస ఓవర్లలో పెవిలియన్ చేర్చిన బెహ్రన్కు మ్యాన్ఆఫ్ ది మ్యాచ్ వరించిన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఓ రిపోర్టర్ బెహ్రాన్‌ను ‘సోషల్ మీడియాలో అభిమానులు మిమ్మల్ని డబ్ల్యూ డబ్ల్యూఈ రెజ్లర్ జాన్సీనాతో పోల్చుతున్నారు. మీరేమైనా ఇది విన్నారా..? అని అడిగాడు.’ దీనికి బెహ్రాన్ విరగబడి నవ్వుతూ.. లేదు అతను నాకంటే పెద్దవాడు.. అంతటి వాడయ్యేందుకు కష్టపడుతా అని సమాధానం ఇచ్చారు. Fair to say @JDorff5 didn't expect this question after his four-wicket haul against India! pic.twitter.com/cwTbkx0Kfj — cricket.com.au (@CricketAus) 10 October 2017 -
బంతి తగిలి విలవిల్లాడిపోయాడు!
ఎడ్జ్ బాస్టన్: క్రికెట్లో గాయాలు సహజం. కానీ కొన్ని గాయాలు ప్రాణానికే ప్రమాదం. ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మరణం క్రికెట్లో ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో అందరికి తెలిసిన విషయమే. అయితే ఇంచు మించు అలాంటి సంఘటనే ఎడ్జ్‌బాస్టన్‌లో నాటింగమ్‌షైర్, బర్మింగ్‌హోం జట్ల మధ్య జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌లో నాటింగమ్‌షైర్ బౌలర్ ల్యూక్ ఫ్లేచర్ తీవ్రంగా గాయపడ్డాడు. 28 ఏళ్ల ఫ్లేచర్ బౌలింగ్‌లో బర్మింగ్‌హోమ్ బ్యాట్స్‌మన్ సామ్ హెయిన్స్ పవర్ఫుల్ స్ట్రేట్ డ్రైవ్ కొట్టాడు. ఆ బంతి కాస్త ఫ్లేచర్ తలకు బలంగా తగలడంతో అతను కుప్పకూలిపోయాడు. దీంతో మైదానమంతా షాక్ గురైంది. వెంటనే ఫ్లేచర్ను సమీప ఆసుపత్రికి తరలించారు. దీంతో మ్యాచ్ 30 నిమిషాల పాటు నిలిచిపోయింది. ఇప్పుడు అతని పరిస్థితి నిలకడగా ఉందంటూ ఇంగ్లండ్ ఆటగాడు జేక్ బాల్ ట్వీట్ చేశాడు. ఇక ఫ్లేచర్ తనకు మద్దతుగా మెసెజ్ చేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఇక ఈ మ్యాచ్‌లో బర్మింగ్‌హోమ్ జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గింది. Horrible injury to @fletcherluke but looks like he's doing well off to hospital #legend pic.twitter.com/dXsdYsGSqW — Jake Ball (@JakeBall) July 8, 2017 -
4 బంతుల్లో 92 పరుగుల బౌలర్ పై..
ఢాకా:ఇటీవల బంగ్లాదేశ్ డివిజన్ లీగ్ క్రికెట్ మ్యాచ్ లో అంపైర్ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేసి నాలుగు బంతుల్లో 92 పరుగులిచ్చి ప్రత్యర్ధి జట్టు విజయానికి కారణమైన లాల్ మతియా జట్టు బౌలర్ సుజోన్ మహ్మద్ పై 10 ఏళ్ల నిషేధం పడింది. ఆ మ్యాచ్ లో అతను వ్యవహరించిన తీరుపై పూర్తిస్థాయి విచారణ చేపట్టిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పదేళ్ల పాటు నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దాంతో అతను సుదీర్ఘ కాలం పాటు ఏ క్రికెట్ మ్యాచ్ ల్లో పాల్గొనే అవకాశమే లేకుండా పోయింది. 'మా విచారణలో అతను తప్పు చేసినట్లు తేలింది. కావాలనే వైడ్లు, నోబాల్స్ వేసి ప్రత్యర్థి విజయానికి కారణమయ్యాడు. ఇది క్రీడా స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం. మా దేశ క్రికెట్ కు భంగం కల్గించే ఏ చర్యను ఉపేక్షించం. అందుచేతం అతనిపై 10 ఏళ్ల పాటు నిషేధం విధిస్తున్నాం'అని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు క్రమశిక్షణా కమిటి చీఫ్ షేక్ సోహెల్ తెలిపారు. గత కొన్ని రోజుల క్రితం ఢాకా సెకండ్ డివిజన్ లీగ్ 50 ఓవర్ల మ్యాచ్‌లో లాల్మతియా క్లబ్, ఆక్సియామ్ గ్రూప్‌లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లాల్మతియా 14 ఓవర్లలో 88 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం లాల్మతియా బౌలర్ సుజోన్ మహ్ముద్ తొలి ఓవర్లోనే వరుసగా 13 వైడ్లు, 3 నోబాల్స్ వేయగా ఇవన్నీ బౌండరీ దాటాయి. దీంతో జట్టు ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే 80 పరుగులు చేసింది. ఆక్సియామ్ ఓపెనర్ ముస్తాఫిజుర్ రెహమన్ ఆ తర్వాతి మూడు బంతులను కూడా బౌండరీకి తరలించాడు. దీంతో జట్టు కేవలం 4 బంతులు ఎదుర్కొని 92 పరుగులు చేసింది. -
అప్పుడలా...ఇప్పుడిలా..
-
బౌలర్ గా మారి అతుక్కుపోయాడు!
మొహాలీ:ఇటీవల కాలంలో భారత యువ క్రికెటర్లు తమకు అందివచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకోవడంలో ఎటువంటి నిర్లక్ష్యం చూపెట్టడం లేదు. ప్రస్తుతం భారత క్రికెట్లో కీలకంగా మారిన జస్ప్రిత్ బూమ్రా, హార్దిక్ పాండ్యాలు తమకు ఇచ్చిన అవకాశాల్ని ఒడిసి పట్టుకుని జట్టులో సెటిల్ అయిపోయారు. మరోవైపు మరో్ యువ క్రికెటర్ మనీష్ పాండే కూడా భారత జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. దాంతో జట్టులో స్థానం ఆశిస్తున్న పలువురు వెటరన్స్ కు ఎదురుచూపులు తప్పడం లేదు. ఇప్పుడు మహారాష్ట్ర ఆటగాడు కేదర్ జాదవ్ మరోసారి ఊహించని విధంగా జట్టులోకి వచ్చి అతుక్కుపోయాడు. 2014 లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ ద్వారా భారత వన్డే జట్టులో అరంగేట్రం చేసిన కేదర్ జాదవ్‌కు ఆ తరువాత పెద్దగా అవకాశాలు రాలేదని చెప్పవచ్చు. తన అరంగేట్రం తరువాత ఇప్పటివరకూ 10 అంతర్జాతీయ వన్డేలు ఆడిన కేదర్ జాదవ్.. తొలుత వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్. దానిలో భాగంగానే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు వికెట్ కీపర్ గా పూర్తి బాధ్యతలు కూడా నిర్వర్తించాడు కూడా. అయితే మారుతున్న పరిస్థుతుల దృష్ట్యా న్యూజిలాండ్ తో సిరీస్ లో అతను ఆఫ్ బ్రేక్ బౌలర్‌గా మారాడు. ఇప్పుడు అదే ఆ క్రికెటర్ కు వరంలా మారింది. ఈ వన్డే సిరీస్‌లో అనూహ్యంగా జట్టులో స్థానం దక్కించుకున్న జాదవ్.. అటు బ్యాట్స్తోనూ, ఇటు బంతితోనూ ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటివరకూ జరిగిన మూడు వన్డేల్లో జాదవ్ ఆరు వికెట్లు సాధించాడు. తొలి వన్డేలో రెండు వికెట్లు తీసిన ఈ క్రికెటర్.. రెండో వన్డేలో 11 పరుగులిచ్చి ఒక వికెట్ సాధించాడు. కాగా, కీలకమైన మూడో వన్డేలో మూడు వికెట్లు తీసి కివీస్ టాపార్డర్‌కు షాకిచ్చాడు. న్యూజిలాండ్ 12.0 ఓవర్లలో వికెట్ నష్టానికి 73 పరుగులు చేసి పటిష్టంగా ఉన్న స్థితిలో కెప్టెన్ విలియమ్సన్ ను ఎల్బీగా పెవిలియన్ కు పంపడంతో వికెట్ల వేటను ఆరంభించిన కేదర్.. ఆ తరువాత రాస్ టేలర్, టామ్ లాధమ్లను అవుట్ అవుట్ చేసి అతనిలో బౌలింగ్ ప్రతిభను మరోసారి చాటుకున్నాడు. అయితే ఈ వికెట్లను తీసే క్రమంలో అతను వేసిన ఓవర్లు 10 మాత్రమే కావడం విశేషం. కేవలం మూడు వన్డేల్లో 60 బంతులు మాత్రమే వేసిన కేదర్.. 10.0 స్ట్రైక్ రేట్‌ను నమోదు చేశాడు. మరోవైపు తొలి వన్డేలో 10 పరుగులతో నాటౌట్ గా నిలిచిన కేదర్.. రెండో వన్డేలో 41 పరుగులు చేశాడు. దాంతో తాను కూడా ఆల్ రౌండర్ గా సరిపోతాననే సంకేతాల్ని పంపాడు ఈ 31 ఏళ్ల క్రికెటర్. -
రబడకు 6 అవార్డులు
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా క్రికెట్ వార్షిక అవార్డుల్లో పేస్ బౌలర్ కాగిసో రబడ హవా కొనసాగింది. ఈ ఏడాది ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ సహా అతను మొత్తం ఆరు అవార్డులు సొంతం చేసుకున్నాడు. దక్షిణాఫ్రికా చరిత్రలో ఒక ఆటగాడు ఆరు అవార్డులు గెలుచుకోవడం ఇదే తొలిసారి. గతంలో డివిలియర్స్, ఆమ్లా ఒకే ఏడాది ఐదు అవార్డులు నెగ్గారు. టెస్టు క్రికెటర్, వన్డే క్రికెటర్, ప్లేయర్స్ ప్లేయర్, ఫ్యాన్స్ ప్లేయర్, టి20 అత్యుత్తమ బంతి అవార్డులు రబడకు దక్కాయి. కేవలం టి20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు మాత్రం ఇమ్రాన్ తాహిర్‌కు లభించింది. 2015-16 సీజన్లో సఫారీల ప్రధాన బౌలర్లు స్టెయిన్, ఫిలాండర్ వరుస గాయాలతో ఇబ్బంది పడిన సందర్భంలో రబడ ప్రధాన పేసర్‌గా జట్టును ముందుండి నడిపించాడు.