వికెట్ తీయగానే బౌలర్లు ఎగిరిగంతేస్తారు. ఇక్కడ ఒక్కో బౌలర్ ఒక్కో సిగ్నేచర్ స్టెప్‌తో అలరిస్తారు. ఈ జాబితాలో వెస్టిండీస్ ఆటగాళ్లు ముందుంటారు. ముఖ్యంగా విండీస్ స్టార్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రేవో వికెట్ తీయగానే అతడు వేసే స్టెప్పులు అభిమానులను ఎంతగానే ఆకట్టుకుంటాయి. ఇలా వికెట్ తీసి సంబరాలు చేసుకునే క‍్రమంలో బౌలర్ గాయపడటం అనేది చాలా అరుదు. అయితే పాక్ బౌలర్ హసన్ అలీ వికెట్ తీసిన ఆనందంలో గాయపడ్డాడు.