పాక్ యువ క్రికెటర్ హసన్ అలీపై భారత సైన్యం ఆగ్రహంతో ఊగిపోతోంది. అట్టరీ-వాఘా సరిహద్దులో భారత్-పాక్ దళాల బీటింగ్ రిట్రీట్ సమయంలో హసన్ చేసిన నిర్వాకమే ఇందుకు కారణం. ప్రొటోకాల్ ప్రకారం భారత్ తరపున బీఎస్‌ఎఫ్.. పాక్ తరపున రేంజర్లు రెచ్చగొట్టే సంజ్ఞలతో అక్కడ హాజరయ్యే ఇరు దేశాల ప్రజలను అలరిస్తుంటారు.