Beating Retreat
-
లయ తప్పిన రిట్రీట్ ధ్వని
గణతంత్ర దినోత్సవ ముగింపులో చేసే ‘బీటింగ్ రిట్రీట్ మార్చ్’లో సంగీతం మారి ఉండవచ్చు, కానీ బీటింగ్ రిట్రీట్ భావనను మనం పరిరక్షించుకుంటూ వచ్చాము. దాన్ని ఎన్నడూ విదేశీయమైనదిగా మనం భావించలేదు. అది భారతీయ సైన్యంలాగే భారతీయతతో కూడి ఉండేది. మనకు ఈరోజు ఉన్న సైన్యం కూడా బ్రిటిష్ వారు రూపొందించిందే. బీటింగ్ రిట్రీట్‌కి ఉన్న బ్రిటిష్ మూలం కారణంగా అది మనకు చీకాకు కలిగించలేదు. నిజానికది వారసత్వంగా వచ్చిన విలువలకు, సంప్రదాయాలకు ప్రతీకగా గౌరవం పొందుతోంది కూడా. అయితే ఎప్పటికీ ఈ ప్రాధాన్యం ఉంటుందా? మీరు ఎంత ముసలివాళ్లయితే, అంత ఎక్కు వగా గతాన్ని పట్టుకుని వేళ్లాడతారని చెబు తుంటారు. అది తప్పకుండా నిజమేనని నేను తలుస్తున్నాను. గత వారం గణతంత్ర దినోత్సవ ముగింపు వేళ జరిపే ‘బీటింగ్ రిట్రీట్’పై నా చికాకుతో కూడిన స్పందనకు ఇది ఒక విశ్వస నీయ వివరణలా కనిపిస్తుంది. నేను దాన్ని ఇష్టపడలేదు. కానీ నేను ఈ విషయాన్ని తర్వాత పేర్కొంటాను. ఓ వారం క్రితం నేను చూసిన ఆ కార్యక్రమం నేపథ్యం గురించి మొదట నన్ను వివరించనీయండి. నేను దానిపై ఇలా అనుభూతి చెందుతున్నాను. బీటింగ్ రిట్రీట్ ఒక మిలిటరీ వేడుక. బహుశా రెండవ జేమ్స్ ఇంగ్లండ్ రాజుగా ఉన్నప్పుడు 17వ శతాబ్దంలో ఇది ప్రారంభమైంది. ఒక రాత్రిపూట సైనిక దళాలు తిరోగమిస్తున్నప్పుడు యుద్ధ ముగింపు నకు సంకేతంగా బీటింగ్ రిట్రీట్‌ని మొదలెట్టారు. 1950లలో భారత దేశం కూడా రిపబ్లిక్ డే ఉత్సవాలకు సంబంధించి మూడురోజుల ముగింపు సందర్భంగా ఈ భావనను బ్రిటిష్ సంప్రదాయం నుంచి అరువు తెచ్చుకుంది. సంవత్సరాలు గడిచే కొద్దీ ఇంగ్లిష్ కవాతుల నుంచి భారతీయులే స్వయంగా స్వరపర్చడం వరకు ‘బీటింగ్ రిట్రీట్ మార్చ్’లో సంగీతం మారి ఉండవచ్చు, కానీ బీటింగ్ రిట్రీట్ భావ నను మాత్రం మనం పరిరక్షించుకుంటూ వచ్చాము. నిజానికి దాన్ని మనం ఆదరిస్తూ వచ్చాము. దాన్ని ఎన్నడూ విదేశీయమైనదిగా మనం భావించలేదు. అది భారతీయ సైన్యంలాగే భారతీయతతో కూడి ఉండేది. పైగా గుర్తుంచుకోండి. మనకు ఈరోజు ఉన్న సైన్యం కూడా బ్రిటిష్ వారు రూపొందించిందే. బీటింగ్ రిట్రీట్‌కి ఉన్న బ్రిటిష్ మూలం కారణంగా అది మనకు చికాకు కలిగించలేదు. నిజానికది వారసత్వంగా వచ్చిన విలువలకు, సంప్రదాయాలకు ప్రతీకగా గౌరవం పొందుతోంది కూడా. గణతంత్ర దినోత్సవ సందర్భంగా బీటింగ్ రిట్రీట్కే నేను ఎల్ల ప్పుడూ ప్రాధాన్యం ఇస్తుంటాను. నిస్సందేహంగా, సైనికుల కవాతు కచ్చితత్వం చూసి ఆశ్చర్యపడుతుంటాను. భూమ్యాకర్షణ శక్తిని సైతం డేర్ డెవిల్స్ ధిక్కరించడాన్ని చూస్తూ ఆశ్చర్య చకితుడినవుతుంటాను. నేను దాన్ని తోసిపుచ్చలేను. కానీ రిట్రీట్ సంగీతం; నార్త్, సౌత్ బ్లాక్ వెనుక నిలిపి ఉంచిన బ్యాండ్ల వర్ణరంజితమైన యూనిఫాంలు, రక్షణ గోడ వద్ద ఉన్న ఒంటెలు, చివరగా దిగంతాల వద్ద సూర్యుడు అస్తమించే సమయం ఎల్లప్పుడూ నన్ను వెంటాడుతుంటుంది. నా జ్ఞాపకాల్లో ఎన్నటికీ నిలిచి ఉండిపోయింది ఏమిటంటే రైసినా హిల్స్‌ని అధిరోహిస్తూ, ‘సారే జహాసే అచ్ఛా... హిందూ సితా హమార హమారా’ అని ఆలపిస్తూ ఉండే రిట్రీటింగ్ బ్యాండ్లు. వారు శిఖరాన్ని సమీపిస్తున్నప్పుడు సూర్యుడు అస్తమించడం ప్రారంభమవుతుంది. వెంటనే లెక్కలేనన్ని పసుపు పచ్చ దీపాలు మొత్తం విస్టాను ప్రకాశవంతం చేసేవి. ఇది ప్రతి ఒక్కరినీ ఆనందంలో ముంచెత్తేది. నేటి పద జాలాన్ని ఉపయోగించి చెప్పాలంటే... అదొక విస్మయం కలిగించే క్షణం. అయ్యో... అది చాలావరకు ఇప్పుడు ఒక చరిత్రగా మిగిలిపోయింది. ఇక అది జరగని పని. ప్రారంభ ప్రయత్నంగా మార్పు చేసిన సంగీతం భయానకమైనది కాకున్నా, కఠోరంగా ఉంటోంది. భార తీయ లేదా బ్రిటిష్ మూలానికి చెందినవైనా సరే పాదతాడనంతో చేసే సైనిక కవాతుల సంగీతం ఇకపై వినిపించదు. దీని స్థానంలో రాగాలు వచ్చి చేరాయి. సైనిక వేడుకల్లో వాటికి తావులేదు. వీటిని ఇంట్లో లేదా కాన్సర్ట్ హాల్లో అయితే బాగా ఆస్వాదించవచ్చు. విజయ్ చౌక్‌లో సైనిక బ్యాండ్లు ఆలపించేవి కాదు. మరీ ఘోరమైన విషయం ఏమిటంటే, ఈ సంవత్సరం ఆలపించిన బీటింగ్ రిట్రీట్ రాగం (ఇది సరైన పదమే అయితే) ఏమాత్రం లయబద్ధంగా లేదు. మాధుర్యంతోనూ లేదు. దీంట్లో సంగీతం కంటే రొద మాత్రమే ఎక్కువగా ఉండింది. అది నరకద్వారంలో ఎవరైనా ఊహించే రొదలా ఉండింది కానీ స్వర్గ లోకపు ద్వారాల వద్ద వినిపించే సంగీతంలా లేదు. ఈ ఒక్క మార్పు దాని అర్థాన్ని మాత్రమే కాదు, బీటింగ్ రిట్రీట్ తక్షణ సారాన్నే ధ్వంసం చేసిపడేసింది. అయినా సరే ఎవరైనా దీన్ని పరిగణిస్తారా? దీనిలోని ఇతర అంశాలు కూడా అదృశ్యమైపోయాయి. ఎత్తయిన ప్రాంతంలో ఉన్న గంటల నుంచి వినిపించే దాని శ్రావ్యమైన మాధుర్యం కూడా పరిత్యజించబడింది. భవనాలను వెలిగించే లక్ష లాది పసుపుపచ్చ బల్బుల స్థానంలో బహుళరంగులు గోడలపై ప్రదర్శితమవుతున్నాయి. అంతకు ముందున్నవి ధ్వనింపజేసే ఆశ్చర్యం, ఆనందం స్థానంలో ఇప్పుడు ఒక యాంటీ క్లైమేట్‌ని తలపించే నీరస మైన అసంతృప్తి చోటు చేసుకుంది. బీటింగ్ రిట్రీట్‌లోని ఆనాటి మ్యాజిక్ కనుమరుగైనట్లు కనిపిస్తోంది. ఒక సాధారణమైన, ఉత్తేజపూరితం కానిది మాత్రమే మనకు ఇప్పుడు మిగిలింది. ఒకప్పుడు బీటింగ్ రిట్రీట్‌కి చెందిన అద్భుతం కానీ, మనోహర దృశ్యం కానీ ఇప్పుడు లేవు. మనకు జ్ఞాపకాలు మాత్రమే మిగిలాయి. కాలంతోపాటు అవి కనుమరుగైపోతాయి. గత వారం రిట్రీట్ సందర్భంగా వర్షం కురిసినప్పుడు, దేవుళ్లు సైతం విలపిస్తున్నట్లుగా నేను అనుభూతి చెందాను. అది తగిన స్పందనలాగే కనిపించింది. ప్రపంచం మారుతోందనీ, ఆ మార్పు వెనకాలే నేను మిగిలిపోయాననీ గుర్తించాను. అందుకే నేను విషాదంతో ఉన్నాను. అందుకే నేను ఇంత ప్రతికూల దృక్పథంతో ఉంటుండవచ్చు. చివ రగా, నేను ముందుకేసి చూస్తున్నప్పుడు, నా మనస్సును రెండు ప్రశ్నలు చుట్టుముట్టాయి. ఇక్కడ చుట్టుముట్టడం అనేది సరైన పదం. ఎందుకంటే వాటికి నేను సమాధానం చెప్పలేను మరి. సారే జహా సే అచ్ఛా పాట పాడి ఎంతకాలమైంది! కచ్చితంగా దాని మూలాలే ఆ పాటను అనుమానించేలా చేశాయా? అలాగయితే బీటింగ్ రిట్రీట్ ఎప్పుడు ముగిసిపోతుంది? ఏమైనా దాని వలసవాద చరిత్రను మీరు తోసిపుచ్చలేరు కదా. పైగా అది ఆత్మనిర్భర్ కాదు కూడా మరి. కరణ్ థాపర్ ,వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
అట్టారీ-వాఘా సరిహద్దుల్లో ఘనంగా బీటింగ్ రీట్రీట్ వేడుకలు
న్యూఢిల్లీ: భారత 76వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అట్టారీ-వాఘా సరిహద్దుల్లో ఘనంగా బీటింగ్ రీట్రీట్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారత్, పాకిస్థాన్ సైనికులు కవాతు చేశారు. ఇరు దేశాల సైనికులు ఉత్సాహంగా పరస్పరం కరచాలనం చేసుకోవడం ఆకట్టుకుంది. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉన్న అట్టారీ సరిహద్దులో జరిగే ఈ వేడుకలను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో ఇరు దేశాల పౌరులు హాజరయ్యారు. భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం సాయంత్రం జరిగిన ఈ వేడుకల్లో పాక్ రేంజర్లు, బీఎస్ఎఫ్ జవాన్లు పరస్పరం స్వీట్లు పంచుకున్నారు. 1959 నుంచి ప్రతి ఏటా ఇరు దేశాల సైనికులు ఈ బీటింగ్ రీట్రీట్ వేడుకలను నిర్వహిస్తున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా పలు నృత్య ప్రదర్శనలు, గీతాలపనలు నిర్వహించారు. ఇదీ చదవండి: Azadi Ka Amrit Mahotsav: అప్పుడు తులం బంగారం విలువ 88 రూపాయల 62 పైసలు! ఈ విషయాలు తెలుసా? -
గణతంత్ర దినోత్సవ ముగింపు వేడుకలు ఫొటోలు
-
గణతంత్ర దినోత్సవ ముగింపు వేడుకలు.. వెయ్యి డ్రోన్లతో ప్రదర్శన
న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవ ముగింపు వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈరోజు(శనివారం) రిపబ్లిక్ డే ముగింపు వేడుకల్లో భాగంగా బీటింగ్ రిట్రీట్‌లో డ్రోన్ల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్వదేశీ సాంకేతికత ద్వారా రూపొందించబడిన 1,000 డ్రోన్లతో 10 నిమిషాల పాటు ప్రదర్శన ఏర్పాటు చేశారు. 75 సంవత్సరాల స్వాతంత్య్రాన్ని పురస్కరించుకుని ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’గా జరుపుకునే వేడుకలో భాగంగా డ్రోన్ షో, లేజర్ షోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అదే సమయంలో ప్రొజెక్షన్ మ్యాపింగ్ షో కనువిందు చేసింది. ఈ వేడుకల్లో రాష్ట్రపతి, ప్రధాని, రక్షణ మంత్రి సహా కేంద్రమంత్రులు, ప్రముఖులు, ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. యుద్ధాల్లో సాయం కాలం సమీపించిన అనంతరం ఇరుపక్షాల సైనికులు వెనక్కుతగ్గేందుకు గుర్తుగా ఈ బీటింగ్ రిట్రీట్ను నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో భాగంగా అనేక కొత్త ట్యూన్లను చేర్చారు. రక్షణ శాఖ సహాయంతో కొత్త ట్యూన్లు చేర్చబడ్డాయి.‘హింద్ కి సేన’, కేరళ’, ‘ఏ మేరే వతన్‌కే లోగోన్’ ట్యూన్లు ఉన్నాయి. ‘సారే జహాన్ సే అచ్చా’ ట్యూన్‌తో బీటింగ్ రిట్రీట్ పరేడ్ ముగియనుంది. ఇక డ్రోన్ ప్రదర్శనను ఢిల్లీకి చెందిన బోట్‌ల్యాబ్స్ డైనమిక్స్ స్టార్టప్ సంస్థ నిర్వహించింది. -
సరిహద్దుల్లో బీటింగ్ రిట్రీట్
-
బీటింగ్ రిట్రీట్ వేడుక రద్దు
-
‘బీటింగ్ రిట్రీట్’లో పాక్ క్రికెటర్ అతి
న్యూఢిల్లీ: భారత్–పాకిస్తాన్ల మధ్య అట్టారి–వాఘా సరిహద్దులో నిర్వహించే జెండా అవనత కార్యక్రమం ‘బీటింగ్ రిట్రీట్’ సందర్భంగా పాకిస్తాన్ క్రికెటర్ హసన్ అలీ అత్యుత్సాహం ప్రదర్శించాడు. శనివారం బీటింగ్ రిట్రీట్ జరుగుతుండగా గ్యాలరీ నుంచి పాక్ రేంజర్లు కవాతు చేస్తున్న చోటుకు దూసుకొచ్చిన అలీ.. భారత అభిమానుల వైపు తిరిగి తొడలు చరుస్తూ, రెండు చేతులు గాల్లోకి లేపి వికెట్లు తీసినట్లు సంబరాలు చేసుకున్నాడు. అనంతరం మరో వ్యక్తి అతడిని వెనక్కు తీసుకెళ్లాడు. దీంతో ఈ ఘటనపై సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ విషయమై బీఎస్ఎఫ్ ఐజీ(పంజాబ్ ఫ్రాంటియర్) ముకుల్ గోయల్ మాట్లాడుతూ..‘ అలీ చర్య బీటింగ్ రిట్రీట్కున్న గౌరవాన్ని దెబ్బతీసింది. ఇరుదేశాల పౌరులు గ్యాలరీలో కూర్చొని ఎలాంటి సంజ్ఞలనైనా చేయొచ్చు. కానీ కవాతు మధ్యలోకి ఇలా రావడానికి వీల్లేదు. ఈ ఘటనపై పాకిస్తాన్ రేంజర్లకు మా నిరసన తెలియజేస్తాం’ అని వెల్లడించారు. అలీ వీడియోను పాక్ క్రికెట్ బోర్డు ట్వీటర్లో పోస్ట్ చేయడం గమనార్హం. -
పాక్ యువ క్రికెటర్‌పై భారత సైన్యం ఆగ్రహం
-
పాక్ క్రికెటర్ చేష్టలు.. భగ్గుమన్న భారత సైన్యం
సాక్షి, న్యూఢిల్లీ : పాక్ యువ క్రికెటర్ హసన్ అలీపై భారత సైన్యం ఆగ్రహంతో ఊగిపోతోంది. అట్టరీ-వాఘా సరిహద్దులో భారత్-పాక్ దళాల బీటింగ్ రిట్రీట్ సమయంలో హసన్ చేసిన నిర్వాకమే ఇందుకు కారణం. ప్రొటోకాల్ ప్రకారం భారత్ తరపున బీఎస్ఎఫ్.. పాక్ తరపున రేంజర్లు రెచ్చగొట్టే సంజ్ఞలతో అక్కడ హాజరయ్యే ఇరు దేశాల ప్రజలను అలరిస్తుంటారు. ఆనవాయితీగా జరిగే ఈ ప్రదర్శన మధ్యలో ఎవరూ రావటానికి వీల్లేదు. కానీ, పాక్ క్రికెటర్ హసన్ మాత్రం అత్యుత్సాహం ప్రదర్శించాడు. గ్యాలరీ నుంచి లేచి వచ్చి పరుగు పరుగున మధ్యలో నిల్చుని వికెట్లు తీసే సమయంలో చేసే తన మార్క్ సంజ్ఞను ప్రదర్శించాడు. అయితే ఈ క్రమంలో అతను బీఎస్ఎఫ్ దళాలు, భారతీయుల ప్రేక్షకుల గ్యాలరీ వైపు చూస్తూ రెచ్చగొట్టే చేష్టలు చేశాడు. ఈ చర్యలపై భారత సైన్యం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ‘ఇలాంటి చర్యలను మేం ఉపేక్షించబోం. పెరేడ్ తర్వాత ఎవరూ ఇలాంటి చేష్టలు చేసినా మేం పట్టించుకునేవాళ్లం కాదు. కానీ, మధ్యలో వచ్చి ఇలా రెచ్చిపోవటం ముమ్మాటికీ ఖండించదగ్గ అంశమే. ఈ మేరకు హసన్‌తో క్షమాపణలు చెప్పించాలని.. ఘటనపై పూర్తి వివరణ ఇవ్వాలని పాక్ సైన్యానికి లేఖ రాశాం’ అని బీఎస్ఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. అఫ్రిది.. నువ్వు ఎక్కడ పుట్టావ్? అయితే పాక్ సైన్యం మాత్రం ఈ వ్యవహారంపై ఇప్పటిదాకా నోరు మెదపలేదు. మరోపక్క పాకిస్థాన్ క్రికెట్ బోర్డు శనివారం తమ ఆటగాళ్లు వాఘాను సందర్శించిన ఫోటోలను ట్వీటర్లో పోస్టు చేయగా.. డాన్ పత్రిక హసన్ చేసిన పనిని కొనియాడుతూ ఓ కథనం ప్రచురించింది. బీటింగ్ రిట్రీట్ గురించి... ఈ కార్యక్రమం ప్రతిరోజూ సాయంత్రం సూర్యాస్తమయానికి రెండు గంటలముందు జరుగుతుంది. 1959నుండి ఈ ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది. భారతదేశానికి చెందిన సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) సైనికులు, పాకిస్తాన్‌కు చెందిన పాకిస్తాన్ రేంజర్స్ సైనికులు కలిసి ఈ కవాతును నిర్వహిస్తారు. సూర్యాస్తమయానికి సరిగ్గా వారి దేశ పతాకాలను క్రిందకు దించి పరస్పరం కరచాలనం చేసుకుని వెనుదిరుగుతారు. ఈ కవాతును బీటింగ్ రిట్రీట్ అని పిలుస్తారు. ఈ గగుర్పొడిచే కార్యక్రమాన్ని ఇరుదేశాల పౌరులు ఉత్సాహంగా తిలకిస్తారు. ఇరుదేశాల ప్రజలలో దేశభక్తిని పెంపొందించే ఈ కవాతు ప్రతికూల పరిస్థితులలో కూడా నిరాటంకంగా జరుగుతుంది. -
సైనిక సంప్రదాయాన్ని మార్చిన ‘బీటింగ్ రిట్రీట్’
ఆదిత్య హృదయం పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగం, ఎకనమిక్ సర్వే తర్వాత బీటింగ్ ద రిట్రీట్ (సైనిక సంరంభోత్సవం) గురించి తెలుసుకోవడానికి మీకు సమయం లేకపోతే, మీరు కోల్పోయింది ఏదీ లేదని నేను నొక్కి చెబుతాను. ప్రతి ఏడాదిలాగే ఈసారీ నేను దాన్ని తిలకించటానికి ప్రయత్నించాను కానీ పూర్తిగా అసంతృప్తి, ఆశాభంగం కలిగించింది. పైగా అసహ్యం వేసింది కూడా. బీటింగ్ ద రిట్రీట్ ఎప్పుడూ నాకు ఇష్టమైన కార్యక్రమంగా ఉంటూ వచ్చింది. ఇది ఏ ప్రమేయం లేకుండానే మనతో డ్యాన్స్ చేయించే సంగీతంతో, అత్యంత నిర్దిష్టమైన మార్చింగ్తో కూడిన సంరంభోత్సవం. కార్యక్రమం చివర్లో ప్రదర్శించే లేజర్ లైటింగ్ మిరిమిట్లు గొలుపుతుంది. కాని ఈ అన్ని అంశాల్లోనూ ఈ కార్యక్రమం ఈ సంవత్సరం ఘోరంగా తయారైంది. ఈ కార్యక్రమాన్ని మరింత మెరుగుపర్చామని భావిస్తున్న వ్యక్తులు నిజానికి దాని హృదయాన్ని తూట్లు పొడిచేశారు. నా స్నేహితుడు, బిజినెస్ స్టాండర్డ్ పత్రికలో స్ట్రాటెజిక్ ఎఫైర్స్ ఎడిటర్ కల్నల్ అజయ్ శుక్లా ఈ కార్యక్రమానికి సరిగ్గా సరిపోయే ‘ట్వీటింగ్ రిట్రీట్’ శీర్షికతో తన విచారాన్ని వ్యక్తం చేశారు. ‘సైనిక ఉత్సవానికి వీరేం చేశారో నాకు తెలీదు. డ్రమ్మర్ల డ్యాన్సింగ్, సితార్ ప్లేయర్లు, సంగీతం అన్నీ ఉన్నాయి కానీ మిలిటరీకి సంబంధించిన స్పృహ లేకుండా చేశారు. అర్థరహితమైన మార్పులతో ఒక గొప్ప సంప్రదాయాన్ని బలిపెట్టడానికి సైనికాధికారులు ఎలా అనుమతించారో చూస్తుంటే విచారమేస్తుంది!’ బాధ్యతారహితమైన మన సైనిక జనరల్స్ బీటింగ్ ద రిట్రీట్ ఒక సంప్రదాయమని, నిరంతర కొనసాగింపే దాని ఆత్మ అనే విషయాన్ని మర్చిపోయారు. పూర్తిగా పతనమయ్యే స్థాయికి దాన్ని మార్చేశారు. ఈ విశిష్ట సైనిక సంప్రదాయం 1690లో ప్రారంభమైంది. ఇంగ్లండ్ చక్రవర్తి జేమ్స్–ఐఐ యుద్ధం ముగిసిన రోజు చివరలో సైనిక దళాలు వెనక్కు వచ్చే సందర్భంగా సైనిక వాయిద్యాలను మోగించాలని ఆదేశించాడు. కాబట్టి అది ఒక ముగింపుకు సంబంధించిన సమ్మేళనం. అంతిమ పరిణామానికి అది చిహ్నం. ఇది పూర్తిగా సైనిక సంరంభ కార్యక్రమం. శతాబ్దాలుగా బీటింగ్ ద రిట్రీట్ ఒక అత్యద్భుతమైన సంగీతం, అత్యంత నిర్దిష్టంగా సాగే మిలిటరీ డ్రిల్‌కు మారుపేరుగా ఉంటూ వస్తోంది. చక్కటి పొందికతో పాదాలను కదపడమే ఈ మ్యూజికల్ మార్చ్ విశేషం. విషాదమేమిటంటే, గత సోమవారం ఈ కార్యక్రమాన్ని భారతీయులే కంపోజ్ చేసి ఉండవచ్చు కానీ వాళ్లు అసలైన కవాతును మాత్రం చేయించలేదు. రెండు. ఈ కార్యక్రమం కోసం వాడే సంగీత వాయిద్యాలు సాంప్రదాయిక మిలిటరీ బ్యాండ్‌కు సంబంధించినవిగానే ఉండాలి. అందరూ ఇష్టపడే సితారకు ఈసారి వారు చోటు ఇవ్వలేదు. వచ్చే ఏడాదికి వారు షెహనాయ్‌ని పరిచయం చేస్తారా? మూడు. బ్యాండ్ తప్పకుండా సంగీతానికి అనుగుణంగా మార్చ్ చేయాలి లేదా డ్రిల్ చేయాలి. సమర్థవంతమైన డ్రమ్మింగ్ మెప్పించవచ్చు కానీ దాన్ని సరైన విధంగా మేళనం చేయలేదు. ఇలాంటి సంగీతంతో మీరు మార్చ్ చేయలేరు. పైగా జాజ్ సంగీ తాన్ని పరిచయం చేయడానికి చేసిన ప్రయత్నం అయితే మరీ అసంబద్ధంగా కనిపించింది. నేను 1960లు, 70లు, 80ల నాటి బీటింగ్ రిట్రీట్స్ను గుర్తు తెచ్చుకున్నాను. అవి శ్రోతలకు దిగ్భ్రమ కలిగించేవి. బ్యాండ్లు కూడా మేటి సంగీతంతో అలరించేవి. బాలీ వుడ్ అనుకరణలను పక్కనబెడితే సైనిక కవాతు నిజానికి అలాంటి ప్రభావం కలిగిస్తుంది మరి. చివరగా, సూర్యుడు దిగంతంలోకి జారుకుంటున్నవేళ, సాయంవేళ దీపకాంతులను ప్రతిబింబించేది. రైసినా హిల్స్ విద్యుద్దీపాలతో మెరిసిపోయేది. ప్రతి ఒక్కరూ ఆ క్షణం తీసుకువచ్చే ఆకస్మిక వాతావరణంతో ఉక్కిరిబిక్కిరి అయ్యేవారు. కానీ ఈ సంవత్సరం వారు లైటింగ్ కూడా మార్చేశారు. జాతీయ పతాక రంగులను ప్రతిబింబించే లైటింగ్‌లో దిగ్భ్రమ కలిగించే ప్రభావం లేకుండా పోయింది. కొత్త లైటింగ్ చీకటిలో మెప్పించవచ్చు కానీ సాయంత్రం ప్రారంభంలో అది కలిగించే ప్రభావం పెద్దగా ఉండదు. మీరు ఊహించే పతాకదశను ప్రదర్శించడంలో అది మిమ్మల్ని వంచిస్తుంది అంతే. కాని ‘అబైడ్ విత్ మి’, ‘సారే జహాసె అచ్ఛా’ గీతాలాపనతో వారు కాస్త దయ చూపినందుకు నేను కృతజ్ఞుడిని. వీటిని కూడా వారు ఉపసంహరిస్తారేమోనని నేను భావించాను. ఎందుకంటే మొదటి గీతం క్రిస్టియన్ కీర్తన. చివరి గీతాన్ని స్వరపర్చింది పాకిస్తాన్ సంస్థాపకులలో ఒకరు. ఈ సంవత్సరానికి మటుకు ఈ రెండూ బతికిపోయాయి మరి. మొత్తంగా నా అభిప్రాయం చాలా సరళమైంది. సంప్రదాయానికి విలువ ఇవ్వని దేశం తన గతాన్ని గౌరవించదు, పైగా అది విలువ ఇచ్చే జాతీయ మనోభావాలను కూడా పలుచన చేస్తుంది. ఈ ప్రపంచంలో ఎప్పటికీ మీరు మార్చకూడని కొన్ని విషయాలు ఉంటాయి. ప్రతి సంవత్సరం మీరు వాటిని అదేవిధంగా కొనసాగిస్తూ ఉండాలి. బీటింగ్ రిట్రీట్ అలాంటి అంశాల్లో ఒకటి. - కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : karanthapar@itvindia.net -
బీటింగ్ రిట్రీట్‌లో భారతీయ స్వరాలదే పైచేయి
న్యూఢిల్లీ: 66వ గణతంత్ర వేడుకల ముగింపునకు సూచికగా విజయ్‌చౌక్‌లో గురువారం నిర్వహించిన బీటింగ్ రిట్రీట్‌లో భారతీయ స్వరాలదే పైచేయి అయింది. ఈ రిట్రీట్‌లో మొత్తం 23 స్వరాలను ఆయా విభాగాలు వినిపించాయి. ఇందులో తొలిసారిగా వినిపించిన భారతీయ స్వరాల్లో ‘వీర్ భారత్’, ‘ఛనా బిలౌరి’, ‘జై జనమ్భూమి’, ‘అతుల్య భారత్’, ‘దేశోంకా సర్తాజ్ భారత్’, కుట్టీస్ వెడ్డింగ్, ‘పైపర్ ఓ డ్రమండ్ ’ ‘గోర్ఖా బ్రిగేడ్’, ‘ఓషన్ స్ప్లెండర్’, ‘బ్లూఫీల్డ్’,‘బ్యాటిల్ ఆఫ్ ది స్కై’ , ‘ఆనంద్లోకే’, ‘డ్యాషింగ్ దేశ్’, ‘ఫ్లైయింగ్ స్టార్’, ‘గ్లోరియస్ ఇండియా’, ‘బ్లూఫీల్డ్’, ‘భూపల్’, ‘ఇండియన్ సోల్జర్స్’, ‘హత్రోరి’, ‘సలాం టు ది సోల్జర్స్’. ‘గిరిరాజ్’, అబైడ్ విత్ మి’లతోపాటు రెగ్యులర్ షోస్టాపర్ అయిన ‘సారే జహాసే అచ్ఛా’ కూడా ఇందులో ఉన్నాయి. 15 బ్రాస్ , 18 పైప్, డ్రమ్స్ బాండ్స్ ఈ రిట్రీట్‌లో పాలుపంచుకున్నాయి. గంటపాటు జరిగిన ఈ కార్యక్రమంలో నావిక వైమానిక దళానికి చెందిన ఒక్కొక్క బృందం కూడా పాలుపంచుకున్నాయి. ఈ కార్యక్రమానికి మేజర్ గిరీష్‌కుమార్ నాయకత్వం వహించారు. ఇక సుబేదార్ సురేశ్‌కుమార్... కండక్టర్‌గా వ్యవహరించారు. -
రాజధానిలో రాజవైభోగం
న్యూఢిల్లీ: గణతంత్ర వేడుకల ముగింపు సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం జరిగిన ‘బీటింగ్ రీట్రీట్’ అలనాటి రాజవైభవాన్ని గుర్తుకు తెచ్చింది. మిలటరీ కవాతు, లయబద్ధమైన సంగీ తం అక్కడికి వచ్చినవారిని తన్మయుల్ని చేశాయి. రాష్ట్రపతి భవన్ నుంచి ఆరు గుర్రాల రథంపై రాజ్‌పథ్‌కు వచ్చిన రాష్ట్రపతిని చూస్తూంటే ఒకప్పటి చక్రవర్తుల వైభోగం ప్రత్యక్షమైంది. ఈ కార్యక్రమంలో ప్రధాని మన్మోహన్తోపాటు పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తోపాటు పెద్దసంఖ్యలో నగరవాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యుద్దీపాలతో అలంకరించిన రైసినా హిల్స్, రాష్ట్రపతి భవన్, పార్లమెంట్ ఢిల్లీ నగరానికే కొత్త అందాన్ని తీసుకొచ్చాయి.