రాజధానిలో రాజవైభోగం
Published Wed, Jan 29 2014 10:37 PM | Last Updated on Mon, Aug 20 2018 5:33 PM
న్యూఢిల్లీ: గణతంత్ర వేడుకల ముగింపు సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం జరిగిన ‘బీటింగ్ రీట్రీట్’ అలనాటి రాజవైభవాన్ని గుర్తుకు తెచ్చింది. మిలటరీ కవాతు, లయబద్ధమైన సంగీ తం అక్కడికి వచ్చినవారిని తన్మయుల్ని చేశాయి. రాష్ట్రపతి భవన్ నుంచి ఆరు గుర్రాల రథంపై రాజ్‌పథ్‌కు వచ్చిన రాష్ట్రపతిని చూస్తూంటే ఒకప్పటి చక్రవర్తుల వైభోగం ప్రత్యక్షమైంది. ఈ కార్యక్రమంలో ప్రధాని మన్మోహన్‌తోపాటు పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తోపాటు పెద్దసంఖ్యలో నగరవాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యుద్దీపాలతో అలంకరించిన రైసినా హిల్స్, రాష్ట్రపతి భవన్, పార్లమెంట్ ఢిల్లీ నగరానికే కొత్త అందాన్ని తీసుకొచ్చాయి.
Advertisement
Advertisement