
న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవ ముగింపు వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈరోజు(శనివారం) రిపబ్లిక్ డే ముగింపు వేడుకల్లో భాగంగా బీటింగ్ రిట్రీట్‌లో డ్రోన్ల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్వదేశీ సాంకేతికత ద్వారా రూపొందించబడిన 1,000 డ్రోన్‌లతో 10 నిమిషాల పాటు ప్రదర్శన ఏర్పాటు చేశారు.
75 సంవత్సరాల స్వాతంత్య్రాన్ని పురస్కరించుకుని ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’గా జరుపుకునే వేడుకలో భాగంగా డ్రోన్ షో, లేజర్ షోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అదే సమయంలో ప్రొజెక్షన్ మ్యాపింగ్ షో కనువిందు చేసింది. ఈ వేడుకల్లో రాష్ట్రపతి, ప్రధాని, రక్షణ మంత్రి సహా కేంద్రమంత్రులు, ప్రముఖులు, ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. యుద్ధాల్లో సాయం కాలం సమీపించిన అనంతరం ఇరుపక్షాల సైనికులు వెనక్కుతగ్గేందుకు గుర్తుగా ఈ బీటింగ్ రిట్రీట్‌ను నిర్వహిస్తారు.
ఈ వేడుకల్లో భాగంగా అనేక కొత్త ట్యూన్‌లను చేర్చారు. రక్షణ శాఖ సహాయంతో కొత్త ట్యూన్లు చేర్చబడ్డాయి.‘హింద్ కి సేన’, కేరళ’, ‘ఏ మేరే వతన్‌కే లోగోన్’ ట్యూన్లు ఉన్నాయి. ‘సారే జహాన్ సే అచ్చా’ ట్యూన్‌తో బీటింగ్ రిట్రీట్ పరేడ్ ముగియనుంది. ఇక డ్రోన్ ప్రదర్శనను ఢిల్లీకి చెందిన బోట్‌ల్యాబ్స్ డైనమిక్స్ స్టార్టప్ సంస్థ నిర్వహించింది.
Comments
Please login to add a commentAdd a comment