భారత రిపబ్లిక్ డే జనవరి 26న వేడుకలు జరగనున్నాయి. ఈ ఏడాది జరిగే గణతంత్ర సంబరాలు చేసుకునేందుకు కోట్లాది ప్రజలు సిద్ధమయ్యారు. అయితే ఒక్కసారి స్వాతంత్ర్య పోరాటంలో అమరులైన వారి చరిత్రలు గురించి తెలుసుకుందాం. ఈ కాలంలో పుస్తకాలు చదివే సమయం లేకపోయినా.. చరిత్రను తెరపై ఆవిష్కరించిన చిత్రాలెన్నో ఉన్నాయి. ఈ గణతంత్ర దినోత్సవం రోజున ఎంచక్కా కుటుంబంతో కలిసి చూడాల్సిన స్వాతంత్ర్య పోరాట సినిమాలను కొన్నింటిని మీకు గుర్తు చేస్తున్నాం. ఈ గణతంత్ర దినోత్సవాన్ని దేశభక్తితో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చే బాలీవుడ్ టాప్ టెన్ చిత్రాలపై ఓ లుక్కేయండి.
అమీర్ ఖాన్ లగాన్
అశుతోష్ గోవారికర్ తెరకెక్కించిన చిత్రం లగాన్. ఈ సినిమాలో అధిక మొత్తంలో బ్రిటీష్ పన్నుల నుంచి ప్రజలను విముక్తి చేయడానికి రైతు చేస్తున్న పోరాటాన్ని చక్కగా తెరకెక్కించారు. అన్యాయమైన వ్యవస్థకు వ్యతిరేకంగా స్వాతంత్ర్యం పొందేందుకు బ్రిటిష్ వారికి ఇష్టమైన క్రీడ అయిన క్రికెట్‌లో ఓడించడం ఈ చిత్రంలో చూపించారు.
షారుఖ్ ఖాన్ స్వదేశ్
షారుఖ్ ఖాన్ నటించిన చిత్రం స్వదేశ్. నాసాలో పనిచేసే శాస్ర్తవేత్తగా ఇందులో కనిపించారు. ఈ చిత్రంలో హీరో తన అమ్మను చూసేందుకు భారతదేశానికి వచ్చే వస్తాడు. ఆ తరువాత ఇక్కడి పరిస్థితులకు చలించిపోయి స్వేదేశంలోనే ఉండాలని నిర్ణయించుకుంటాడు. నాసా ప్రధాన కార్యాలయంలో చిత్రీకరించబడిన మొదటి భారతీయ చిత్రం స్వదేశ్.
రంగ్ దే బసంతి
రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా తెరకెక్కించిన సినిమా రంగ్ దే బసంతి. ఈ చిత్రంలో భారతదేశంలోని సామాజిక సమస్యలను కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇండియాలోని ఐదుగురు స్వాతంత్ర్య సమరయోధుల కథను డాక్యుమెంట్ చేయడానికి ఒక బ్రిటిష్ విద్యార్థి భారత్‌కు వస్తాడు. ఇందులో ఐదుగురు భారతీయ విప్లవకారుల పాత్రలు చూపించారు. ఇది బ్రిటీష్ ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా పోరాడాటం చక్కగా తెరకెక్కించారు.
చక్ దే ఇండియా
కబీర్ ఖాన్ తెరకెక్కించిన మూవీ చక్ దే ఇండియా. ఈ సినిమాలో దేశభక్తిని అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ చిత్రంలో షారూక్ ఖాన్ భారత మహిళా హాకీ జట్టు కోచ్ పాత్రలో కనిపిస్తారు. ఇండియా కోల్పోయిన తన ఖ్యాతిని తిరిగి కాపాడుకోవాలనే సందేశంతో తెరకెక్కించారు. అంతర్జాతీయ టోర్నమెంట్‌లో భారత జట్టు హాకీ జట్టు గెలవాలనే కోరికను బలంగా చూపించారు.
రాజీ- ఆలియా భట్
ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రాజీ. రా ఎజెంట్ పాత్రలో ఆలియా భట్ నటించింది. ఈ చిత్రంలో ఇండియాకు కీలకమైన విలువైన సమాచారాన్ని సంపాదించాలనే ఉద్దేశ్యంతో ఆమె ఒక పాకిస్తాన్ సైనికుడిని వివాహం చేసుకుని ఆ దేశానికి వెళ్లిపోతుంది. దేశం పట్ల ఆమెకున్న ప్రేమతో కుటుంబాన్ని కోల్పోతుంది. ఈ సినిమాలో అలియా భట్, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రల్లో నటించారు.
కేసరి- సిక్కు సైనికుల కథ
సారాంఘరి యుద్ధంలో పోరాడిన వీర సిక్కు సైనికుల కథను ఈ సినిమాలో చూపించారు. అమరులైన వీరికి కేసరి నివాళులు అర్పించారు. పదివేల మంది పష్టూన్ ఆక్రమణదారులతో జరిగిన పోరాటాలను చక్కగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో 21 మంది సిక్కు సైనికులకు నాయకత్వం వహించిన హవల్దార్ ఇషార్ సింగ్ నేతృత్వంలోని యుద్ధాన్ని ఈ కథలో ఆవిష్కరించారు. భారతదేశ చరిత్రలో గొప్ప యుద్ధాలలో ఇది ఒకటిగా నిలిచింది.
మణికర్ణిక- కంగనా రనౌత్
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మణికర్ణిక. ఈ చిత్రంలో ఝాన్సీ రాణి పాత్రను ఆమె పోషించింది. ఈస్ట్ ఇండియన్ కంపెనీ రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఝాన్సీ రాణి చేసిన పోరాటాన్ని చక్కగా తెరకెక్కించారు. ఆమె తిరుగుబాటు బ్రిటీష్ వారిపై విపరీతమైన స్వాతంత్ర్య యుద్ధంగా మారింది. ఝాన్సీ రాణి మణికర్ణిక పాత్రలో కంగనా రనౌత్ మెప్పించింది.
యూరి -ది సర్జికల్ స్ట్రైక్
యూరిలో జరిగిన దాడికి ప్రతీకారంగా జరిగిన సర్జికల్ స్ట్రైక్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. 2016లో కాశ్మీర్‌లోని ఒక భాగమైన సైనిక స్థావరం యూరీపై మిలిటెంట్లు దాడి చేశారు. ఆ తర్వాత భారత సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్ అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. ఆధారంగా రూపొందించబడింది. ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ సినిమా రూపంలో అమరులైన భారత సైనికులకు ఘన నివాళి అర్పించారు. విక్కీ కౌశల్‌లో మేజర్ విహాన్ సింగ్ షెర్గిల్ పాత్రలో కనిపించారు.
షేర్షా- కార్గిల్ యుద్ధం
షేర్షా పాకిస్తాన్‌పై కార్గిల్ యుద్ధం నాటి సంఘటనల ఆధారంగా షేర్షా మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రం ద్వారా కెప్టెన్ విక్రమ్ బాత్రా త్యాగాలకు గుర్తుగా నివాళులు అర్పించారు. కెప్టెన్ బాత్రా పాత్రలో బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా నటించారు.
సర్దార్ ఉధమ్ సింగ్- 1919 జలియన్ వాలాబాగ్ ఉదంతం
బ్రిటీష్ పాలనలోని 1919 కాలంలో జరిగిన మారణహోమం జలియన్ వాలాబాగ్ ఉదంతం. ఈ మారణకాండకు ప్రతీకారంగా మైఖేల్ ఓ డయర్‌ను భారతీయ విప్లవకారుడు సర్దార్ ఉధమ్ సింగ్ హత్య చేశారు. అతని జీవిత ప్రయాణాన్ని షూజిత్ సిర్కార్ ఈ సినిమాలో చూపించారు. ఈ చిత్రంలో విక్కీ కౌశల్ భారతీయ విప్లవకారుడు ఉధమ్ సింగ్ పాత్రను పోషించాడు. భారతీయ చరిత్రలో నిలిచిపోయిన వీరుడికి ఈ చిత్రం ద్వారా ఘన నివాళి అర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment