న్యూఢిల్లీ: 66వ గణతంత్ర వేడుకల ముగింపునకు సూచికగా విజయ్‌చౌక్‌లో గురువారం నిర్వహించిన బీటింగ్ రిట్రీట్‌లో భారతీయ స్వరాలదే పైచేయి అయింది. ఈ రిట్రీట్‌లో మొత్తం 23 స్వరాలను ఆయా విభాగాలు వినిపించాయి. ఇందులో తొలిసారిగా వినిపించిన భారతీయ స్వరాల్లో ‘వీర్ భారత్’, ‘ఛనా బిలౌరి’, ‘జై జనమ్‌భూమి’, ‘అతుల్య భారత్’, ‘దేశోంకా సర్తాజ్ భారత్’, కుట్టీస్ వెడ్డింగ్, ‘పైపర్ ఓ డ్రమండ్ ’ ‘గోర్ఖా బ్రిగేడ్’, ‘ఓషన్ స్ప్లెండర్’, ‘బ్లూఫీల్డ్’,‘బ్యాటిల్ ఆఫ్ ది స్కై’ , ‘ఆనంద్‌లోకే’, ‘డ్యాషింగ్ దేశ్’, ‘ఫ్లైయింగ్ స్టార్’, ‘గ్లోరియస్ ఇండియా’, ‘బ్లూఫీల్డ్’, ‘భూపల్’, ‘ఇండియన్ సోల్జర్స్’, ‘హత్రోరి’, ‘సలాం టు ది సోల్జర్స్’. ‘గిరిరాజ్’, అబైడ్ విత్ మి’లతోపాటు రెగ్యులర్ షోస్టాపర్ అయిన ‘సారే జహాసే అచ్ఛా’ కూడా ఇందులో ఉన్నాయి. 15 బ్రాస్ , 18 పైప్, డ్రమ్స్ బాండ్స్ ఈ రిట్రీట్‌లో పాలుపంచుకున్నాయి. గంటపాటు జరిగిన ఈ కార్యక్రమంలో నావిక వైమానిక దళానికి చెందిన ఒక్కొక్క బృందం కూడా పాలుపంచుకున్నాయి. ఈ కార్యక్రమానికి మేజర్ గిరీష్‌కుమార్ నాయకత్వం వహించారు. ఇక సుబేదార్ సురేశ్‌కుమార్... కండక్టర్‌గా వ్యవహరించారు.
బీటింగ్ రిట్రీట్‌లో భారతీయ స్వరాలదే పైచేయి
Published Thu, Jan 29 2015 11:18 PM | Last Updated on Sat, Sep 2 2017 8:29 PM
Advertisement
Advertisement