వాఘా సరిహద్దుకు భారత వాయుసేన(ఐఏఎఫ్) పైలట్, వింగ్ కమాండర్ వర్ధమాన్ అభినందన్ చేరుకున్నారు. వైమానికదళ అధికారులు అభినందన్‌కు ఘన స్వాగతం పలికారు. జయహో అభినందన్ నినాదాలతో వాఘా సరిహద్దు మార్మోగిపోయింది. పాక్ చెర నుంచి విడుదలై అభినందన్ క్షేమంగా రావడంతో జై హింద్, భారత్ మాతాకీ జై నినాదాలతో వాఘా సరిహద్దులో ఆనందోత్సాహలు వెల్లివిరిశాయి.