పాక్ అధికారులు మధ్యాహ్నం రెండు గంటల తరువాత అభినందన్‌ను వాఘా సరిహద్దు వద్దకు తీసుకురానున్నట్టు సమాచారం. జెనీవా ఒప్పందాన్ని అనుసరించి పాక్ అధికారులు తొలుత అభినందన్‌ను అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీకి అప్పగించనున్నారు.
అభినందన్‌కు స్వాగతం పలకడం కోసం ఆయన తల్లిదండ్రులు గురువారం అర్ధరాత్రి చెన్నై నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. ప్రస్తుతం వారు అమృతసర్‌కు ఫ్లైట్‌లో బయలుదేరారు. విమానంలో తోటి ప్రయాణీకులు నుంచి వారికి అపూర్వ గౌరవంతో పాటు అభినందనలు వెల్లువెత్తాయి. ఇందుకు సంబంధించి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.