మాతృభూమిపై అడుగుపెట్టిన అభినందన్‌కు ఘనస్వాగతం లభించింది. పోరాట యోధుడి రాకతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. దాయాది పాకిస్తాన్ చెరలో చిక్కుకున్న భారత వైమానిక దళం వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను భారత్‌కు అప్పగించింది. జెనీవా ఒప్పందాన్ని అనుసరించి పాక్ అధికారులు తొలుత అభినందన్‌ను అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీకి అప్పగించారు. వాఘా బార్డర్‌లో ఐదుగురు ఐఏఎఫ్ అధికారులు అభినందన్‌ను రిసీవ్ చేసుకున్నారు.