
సాక్షి, న్యూఢిల్లీ: కొత్తగా వచ్చి టీమిండియా టాపార్డర్‌ను కుప్పుకూల్చిన రాత్రికి రాత్రే హీరో అయిన ఆసీస్ యువ బౌలర్ బెహ్రన్ డార్ఫ్ విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు విరగబడి నవ్వారు. గువాహటి వేదికగా జరిగిన రెండో టీ20లో భారత బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ(2), కోహ్లి(0), మనీష్ పాండే (6), శిఖర్ ధావన్(2)లను వరుస ఓవర్లలో పెవిలియన్ చేర్చిన బెహ్రన్‌కు మ్యాన్‌ఆఫ్ ది మ్యాచ్ వరించిన విషయం తెలిసిందే.
మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఓ రిపోర్టర్ బెహ్రాన్‌ను ‘సోషల్ మీడియాలో అభిమానులు మిమ్మల్ని డబ్ల్యూ డబ్ల్యూఈ రెజ్లర్ జాన్‌సీనాతో పోల్చుతున్నారు. మీరేమైనా ఇది విన్నారా..? అని అడిగాడు.’ దీనికి బెహ్రాన్ విరగబడి నవ్వుతూ.. లేదు అతను నాకంటే పెద్దవాడు.. అంతటి వాడయ్యేందుకు కష్టపడుతా అని సమాధానం ఇచ్చారు.
Fair to say @JDorff5 didn't expect this question after his four-wicket haul against India! pic.twitter.com/cwTbkx0Kfj
— cricket.com.au (@CricketAus) 10 October 2017
Comments
Please login to add a commentAdd a comment