రబడకు 6 అవార్డులు | Image for the news result Fast bowler Kagiso Rabada dominates Cricket South Africa awards | Sakshi
Sakshi News home page

రబడకు 6 అవార్డులు

Published Thu, Jul 28 2016 1:03 AM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM

రబడకు 6 అవార్డులు

రబడకు 6 అవార్డులు

జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా క్రికెట్ వార్షిక అవార్డుల్లో పేస్ బౌలర్ కాగిసో రబడ హవా కొనసాగింది. ఈ ఏడాది ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ సహా అతను మొత్తం ఆరు అవార్డులు సొంతం చేసుకున్నాడు. దక్షిణాఫ్రికా చరిత్రలో ఒక ఆటగాడు ఆరు అవార్డులు గెలుచుకోవడం ఇదే తొలిసారి. గతంలో డివిలియర్స్, ఆమ్లా ఒకే ఏడాది ఐదు అవార్డులు నెగ్గారు.

టెస్టు క్రికెటర్, వన్డే క్రికెటర్, ప్లేయర్స్ ప్లేయర్, ఫ్యాన్స్ ప్లేయర్, టి20 అత్యుత్తమ బంతి అవార్డులు రబడకు దక్కాయి. కేవలం టి20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు మాత్రం ఇమ్రాన్ తాహిర్‌కు లభించింది. 2015-16 సీజన్‌లో సఫారీల ప్రధాన బౌలర్లు స్టెయిన్, ఫిలాండర్ వరుస గాయాలతో ఇబ్బంది పడిన సందర్భంలో రబడ ప్రధాన పేసర్‌గా జట్టును ముందుండి నడిపించాడు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement