Rabada
-
రాహుల్ పోరాటం
‘బాక్సింగ్ డే’ టెస్టు సవాళ్లతో మొదలైంది. బంతి ఒక బుల్లెట్‌గా బ్యాటర్లను అదేపనిగా ఢీకొట్టింది. పేసర్లు గర్జిస్తుంటే... ప్రధాన బ్యాటర్లు సైతం చేతులెత్తేశారు. అడుగడుగునా కఠిన సవాళ్లు ఎదురవుతున్న సెంచూరియన్ పిచ్‌పై మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు దిగిన కేఎల్ రాహుల్ అసాధారణ పోరాటం చేశాడు. అజేయ అర్ధ సెంచరీతో భారత్ ఇన్నింగ్స్‌ను ఆదుకున్నాడు. సెంచూరియన్: సఫారీ పేస్ దళానికి భారత బ్యాటింగ్ బలగమంతా వణికితే ఒకే ఒక్కడు కేఎల్ రాహుల్ మాత్రం పెను సవాలుకు తన బ్యాటింగ్ సత్తాతో ఎదురు నిలిచాడు. తొలిటెస్టులో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ వర్షం కారణంగా ఆట నిలిచి సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 59 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (105 బంతుల్లో 70 బ్యాటింగ్; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) భారత్ మొదటిరోజే ఆలౌట్ కాకుండా అడ్డుపడ్డాడు. అజేయ అర్ధసెంచరీతో ఇన్నింగ్స్‌ను ఆదుకున్నాడు. రబడ ఐదు వికెట్లతో (5/44) చెలరేగాడు. ఈ మ్యాచ్ ద్వారా భారత యువ సీమర్ ప్రసిధ్ కృష్ణ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. రోహిత్ 5, గిల్ 2 టాస్ నెగ్గిన ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. సీమర్లు తమ కెప్టెన్ నిర్ణయం సరైందనిపించడానికి ఎంతో సేపు పట్టలేదు. కెపె్టన్ రోహిత్ శర్మ (5)ను రబడ అవుట్ చేయగా, కాసేపటికే బర్గర్ వరుస ఓవర్లలో యశస్వి జైస్వాల్ (17), శుబ్‌మన్ గిల్ (2)లను పెవిలియన్ చేర్చాడు. 24 పరుగులకే టీమిండియా విలువైన వికెట్లు కూలాయి. ఈ దశలో అనుభవజు్ఞడైన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (64 బంతుల్లో 38; 5 ఫోర్లు), శ్రేయస్ అయ్యర్ (50 బంతుల్లో 31; 3 ఫోర్లు, 1 సిక్స్) ఇన్నింగ్స్‌ను కనిపెట్టుకున్నారు. తొలిసెషన్లో మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుకున్నారు. భారత్ 91/3 స్కోరు వద్ద లంచ్ బ్రేక్‌కు వెళ్లింది. రబడ దెబ్బకు మళ్లీ... అదేంటో ఏమో మ్యాచ్ మొదలైనపుడు కష్టాల్లో పడ్డట్లే... రెండో సెషన్ మొదలైనపుడు కూడా భారత్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. కలిసొచ్చిన పిచ్... పనికొచ్చిన ఎక్స్ట్రా బౌన్స్‌తో వైవిధ్యమైన బంతులు వేసిన రబడ మ్యాచ్‌ను దక్షిణాఫ్రికా నియంత్రణలోకి తెచ్చాడు. సెషన్ ఆరంభమైన ఓవర్లోనే అయ్యర్, జట్టు స్కోరు వంద పూర్తయ్యాక కోహ్లి, అశ్విన్ (8)లను రబడ పెవిలియన్ చేర్చాడు. ఓ దశలో 121/6 స్కోరు వద్ద భారత్ ఆలౌట్‌కు దాదాపు చేరువైంది. ఎందుకంటే ఒక్క రాహుల్ మినహా ప్రధాన బ్యాటర్లెవరూ మిగల్లేదు! వీరోచిత పోరాటం కష్టమైన పిచ్... నిప్పులు చెరుగుతున్న బౌలర్లు... భారత్‌కు అన్నీ కష్టాలే! ఇలాంటి పరిస్థితిలో రాహుల్ అద్వితీయ పోరాటం చేశాడు. కీలక బ్యాటర్లెవరూ లేకపోయినా... టెయిలెండర్ శార్దుల్ ఠాకూర్ (33 బంతుల్లో 24; 3 ఫోర్లు)తో రెండో సెషన్‌ను నడిపించాడు. అయితే వేగంగా ఆడే క్రమంలో శార్దుల్ వికెట్‌ను పారేసుకున్నాడు. బుమ్రా క్రీజులోకి రాగా... టీమిండియా 176/7 వద్ద టీ బ్రేక్‌కు వెళ్లింది. విరామనంతరం రాహుల్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే కాసేపటికే బుమ్రా (1)ను జాన్సెన్ బౌల్డ్ చేశాడు. సిరాజ్ (0 బ్యాటింగ్) క్రీజులోకి రాగా... రాహుల్ కష్టపడి జట్టు స్కోరును 200 దాటించాడు. బ్యాడ్‌లైట్, వర్షం వల్ల ఫైనల్ సెషన్ ఎక్కువసేపు సాగలేదు. 208/8 స్కోరు వద్ద వాన రావడంతో తొలిరోజు ఆట అక్కడితోనే ఆగిపోయింది. మ్యాచ్ ఆరంభం కూడా ఆలస్యం కావడంతో మొదటి రోజు కేవలం 59 ఓవర్ల ఆటే సాధ్యమైంది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: యశస్వి (సి) వెరిన్ (బి) బర్గర్ 17; రోహిత్ (సి) బర్గర్ (బి) రబడ 5; గిల్ (సి) వెరిన్ (బి) బర్గర్ 2; కోహ్లి (సి) వెరిన్ (బి) రబడ 38; అయ్యర్ (బి) రబడ 31; రాహుల్ (బ్యాటింగ్) 70; అశ్విన్ (సి) సబ్–ముల్డర్ (బి) రబడ 8; శార్దుల్ (సి) ఎల్గర్ (బి) రబడ 24; బుమ్రా (బి) జాన్సెన్ 1; సిరాజ్ (బ్యాటింగ్) 0; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (59 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి) 208. వికెట్ల పతనం: 1–13, 2–23, 3–24, 4–92, 5–107, 6–121, 7–164, 8–191. బౌలింగ్: రబడ 17–3–44–5, మార్కొ జాన్సెన్ 15–1–52–1, బర్గర్ 15–4–50–2, కొయెట్జీ 12–1–53–0. -
IND Vs SA: దక్షిణాఫ్రికా బౌలర్ రాకాసి బౌన్సర్.. శార్దూల్‌కు తప్పిన ప్రమాదం
సెంచూరియన్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి రోజు ఆటముగిసింది. మొదటి రోజు ఆటముగిసే సమయానికి టీమిండియా 8 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో సఫారీ పేసర్లు భారత బ్యాటర్లకు చుక్కలు చూపించారు. నిప్పులు చెరిగే బంతులను సంధించారు. ఈ క్రమంలో టీమిండియా బౌలింగ్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌కు పెను ప్రమాదం తప్పింది. ఏమి జరిగిందంటే? భారత తొలి ఇన్నింగ్స్ 44 ఓవర్లో మూడో బంతిని గంటకు 148 కిలోమీటర్ల వేగంతో ప్రోటీస్ యువ పేసర్ కోయిట్జీ బౌన్సర్‌గా సంధించాడు. శార్ధూల్ ఆ బంతిని ఫుల్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతిని అంచనా వేయడంలో శార్ధూల్ విఫలమయ్యాడు. దీంతో బంతి బ్యాట్‌కు మిస్స్ అయ్యి అతడి హెల్మెట్‌కు బలంగా తాకింది. ఠాకూర్ నుదిటిపై వాపు వచ్చింది. మైదానంలో నొప్పితో విల్లావిల్లాడు. వెంటనే ఫిజియో వచ్చి కంకషన్ టెస్టు చేశాడు. ఆ తర్వాత శార్దూల్ మళ్లీ బ్యాటింగ్ ప్రారంభించాడు. రబాడ వేసిన ఓవర్లో మళ్లీ బంతి శార్ధూల్ చేతికి తగిలింది. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించాడు. అయితే దెబ్బ తగిలిన తర్వాతి బంతికే శార్దూల్ (33 బంతుల్లో 24) ఔటయ్యాడు. చదవండి: IND vs SA 1st Test: టీమిండియాతో తొలి టెస్టు.. దక్షిణాఫ్రికాకు బిగ్ షాక్ -
'వాళ్లు మళ్లీ జట్టుకు ఎంపికవుతారో లేదో తెలియదు'
దక్షిణాఫ్రికా పలువురు స్టార్ ఆటగాళ్లు బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌తో కన్నా ఐపీఎల్-2022లో ఆడటానికి ప్రాధాన్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు కగిసో రబాడ , లుంగీ ఎన్గిడి, మార్కో జెన్సన్, ఐడెన్ మార్క్రామ్, రాసి వాన్ డెర్ డుస్సెన్ ఐపీఎల్-2022లో పాల్గొన్నారు. కాగా ఈ తమ జట్టు ఆటగాళ్లు తీసుకున్న నిర్ణయం పట్ల దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్ ఆదినుంచే ఆసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. అదే విధంగా ఆ జట్టు కోచ్ మార్క్ బౌచర్ తమ ఆటగాళ్లు తీసుకున్న నిర్ణయం పట్ల సంతృప్తిగా లేనట్లు తెలుస్తోంది. అయితే తమ జట్టును కాదని క్యాష్ రిచ్ లీగ్‌లో పాల్గొనడానికి వెళ్ళిన ఆటగాళ్ళపై చర్యలు తీసుకువడానికి దక్షిణాఫ్రికా క్రికెట్ సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఐపీఎల్లో ఆడుతున్న ప్రోటీస్ ఆటగాళ్లు తమ స్థానాలను జట్టులో కోల్పోయే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా తాజాగా దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ చేసిన వాఖ్యలు.. ఈ వార్తలకు మరింత ఆజ్యం పోసినట్టైంది. బంగ్లాదేశ్‌తో రెండో టెస్ట్ అనంతరం విలేకరుల సమావేశంలో ఎల్గర్ మాట్లాడాడు. ఆ క్రమంలో ఐపీఎల్లో పాల్గోన్న ఆటగాళ్లపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు అని ప్రశ్నించగా.. దానికి బదులుగా "దక్షిణాఫ్రికా తరఫున ఆడేందుకు వీరు మళ్లీ జట్టుకు ఎంపిక అవుతారో లేదో నాకు తెలియదు. అది ఇప్పుడు నా చేతుల్లో లేదు అని ఎల్గర్ పేర్కొన్నాడు. ఇక బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను దక్షిణాఫ్రికా క్లీన్ స్వీప్ చేసింది. చదవండి: IPL 2022: 'అది కోహ్లి బ్యాటింగ్ కాదు.. అతడిలో పవర్ తగ్గింది' -
145 కిమీ పైగా స్పీడ్‌తో బౌల్ చేసే ఆ బౌలర్‌ని ఏ జట్టైనా కోరుకుంటుంది.. కేఎల్ రాహుల్
ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముహూర్తం సమీపిస్తున్న వేళ ప్రతి జట్టు ఆటగాళ్ల ఎంపిక విషయంలో నిమగ్నమై ఉంది. ఏ ఆటగాడిపై ఎంత డబ్బు వెచ్చించాలనే అంశంలో ఆయా జట్లు కుస్తీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేఎల్ సారధ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్ కూడా తమ జట్టు సభ్యులను ఎంచుకునే పనిలో బిజీగా ఉంది. రాహుల్‌తో పాటు డ్రాఫ్టెడ్ ఆటగాళ్లుగా మార్కస్ స్టోయినిస్, రవి బిష్ణోయ్‌లను ఎంచుకున్న ఎల్ఎస్జే.. దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడపై కన్నేసినట్లు తెలుస్తోంది. వేలంలో రబాడను ఎలాగైనా సొంతం చేసుకోవాలని ఆ జట్టు మాస్టర్ ప్లాన్ వేస్తుందని సమాచారం. ఇందుకోసం అతనిపై 12 కోట్ల వరకు వెచ్చించేందుకు సైతం సిద్ధంగా ఉందని తెలుస్తోంది. ఈ విషయమై జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ ఓ క్లూను వదిలాడు. 145 కిమీ పైగా వేగంతో నిప్పులు చెరిగే బౌలర్‌ను ఏ జట్టైనా కోరుకుంటుందని రబాడను ఉద్ధేశించి వ్యాఖ్యానించాడు. రబాడతో పాటు దక్షిణాఫ్రికా ఆటగాళ్లైన మార్కో జన్సెన్, వాన్‌డెర్ డస్సెన్లపై కూడా లక్నో జట్టు కన్నేసినట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురికి భారీ ధర చెల్లించి సొంతం చేసుకోవాలని జట్టు యాజమాన్యం భావిస్తుంది. కాగా, రబాడ గత ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. అతనికి ఢిల్లీ జట్టు 4.2 కోట్లు చెల్లించి సొంతం చేసుకుంది. గత సీజన్లో 15 మ్యాచ్‌లు ఆడిన రబాడ, 15 వికెట్లతో పర్వాలేదనిపించగా.. అంతకుముందు సీజన్(2020)లో ఆకాశమే హద్దుగా చెలరేగి ఏకంగా 30 వికెట్ల సత్తా చాటాడు. అతను 2019 సీజన్లో సైతం 25 వికెట్లతో రాణించాడు. ఐపీఎల్లో ఇప్పటివరకు 50 మ్యాచ్‌లు ఆడిన ఈ 26 ఏళ్ల స్టార్ పేసర్ మొత్తం 76 వికెట్లు తీశాడు. అయితే, ఈ ఏడాది రిటెన్షన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని వదులుకోవడం విశేషం. రిషబ్ పంత్, పృథ్వీ షా, అక్షర్ పటేల్‌ను రీటైన్ చేసుకున్న ఢిల్లీ.. రబాడ సహచరుడు నోర్జేను అంటిపెట్టుకుంది. చదవండి: వెంకటేశ్ అయ్యర్‌కు అంత సీన్ లేదు.. గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు -
అతి పెద్ద సవాల్.. దక్షిణాఫ్రికాపై గెలవడం అంత ఈజీ కాదు
దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా టీమిండియా మూడు టెస్ట్‌లు, మూడు వన్డేలు ఆడనుంది. ఇక టెస్ట్ సిరీస్‌లో భాగంగా డిసెంబర్ 26న సెంచూరియన్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఇప్పటికే దక్షిణాఫ్రికాకు చేరుకున్న భారత జట్టు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. కాగా సఫారీ గడ్డపై తొలి టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకోవాలని కోహ్లి సేన ఊవ్విళ్లూరుతోంది. అయితే, ఈ పర్యటనలో దక్షిణాఫ్రికా పేసర్లు టీమిండియా బ్యాటర్లకు గట్టి సవాలు విసురుతారని భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు. 2018లో భారత జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటించినప్పుడు బ్యాటర్లకు ప్రోటీస్ స్టార్ పేసర్ కగిసో రబడా చుక్కలు చూపించాడని అతడు తెలిపాడు. "దక్షిణాఫ్రికా జట్టుకు అత్యత్తుమ పేస్ ఎటాక్ బౌలింగ్ విభాగం ఉంది. ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ అన్రిచ్ నోర్ట్జే గాయం కారణంగా సిరీస్‌కు దూరమయ్యాడు. ఇది భారత్‌కు కాస్త ఉపశమనం కలిగించే అంశం. కానీ ఆ జట్టులో రబడా వంటి స్టార్ పేసర్ ఉన్నాడు. ప్రపంచ అత్యత్తుమ బౌలర్ల్లలో రబడా ఒకడు. వారి వారి పేస్ బౌలర్లు భారత్‌కు ఖచ్చితంగా సవాలు విసురుతారు" అని అతడు పేర్కొన్నాడు. కాగా 2018 సిరీస్‌లో 15 వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికా సిరీస్ కైవసం చేసుకోవడంలో రబడా కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇక భారత్ బౌలింగ్ గురించి మాట్లాడుతూ.. "భారత బౌలింగ్ విభాగంలో ప్రపంచస్ధాయి బౌలర్లు ఉన్నారు. జట్టులో జస్ప్రీత్ బుమ్రా,మహమ్మద్ షమీ వంటి అనుభవజ్ఞులైన పేసర్లు ఉన్నారు. టెస్ట్ సిరీస్‌లో భారత్ 400పైగా పరుగులు సాధిస్తే విజయం సాధించవచ్చు. కానీ ప్రోటీస్ పేసర్లను ఎదుర్కొని రుగులు రాబట్టడం అంత సులభం కాదు అని జాఫర్ పేర్కొన్నాడు. చదవండి: VIjay Hazare Trophy: ప్రశాంత్ చోప్రా 99, షారుఖ్ 79.. సెమీస్‌లో హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు -
ఈ ఏడాది ఐపీఎల్లో వీరి మెరుపులు లేనట్టేనా..?
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్లో పలువురు విదేశీ ఆటగాళ్ల మెరుపులను అభిమానులు మిస్ కానున్నారా..? అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే వారు తమ దేశం తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాల్సి ఉండడమే ఇందుకు కారణం. ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరంకానున్న ఆటగాళ్ల జాబితాను పరిశీలిస్తే.. అందులో అందరూ దక్షిణఫ్రికా క్రికెటర్లే ఉన్నారు. స్వదేశంలో పాకిస్థాన్‌తో 3 వన్డేలు, 4 టీ20లు ఆడాల్సి ఉండటంతో ఆ స్టార్లందరూ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఐపీఎల్‌కు దూరంకానున్న దక్షిణాఫ్రికా క్రికెటర్లలో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న క్వింటన్ డికాక్, ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు రబాడ, అన్రిచ్ నోర్జ్, చెన్నై సూపర్ కింగ్స్ సభ్యులు లుంగి ఎంగిడి, ఫాఫ్ డుప్లెసిస్‌లు ఉన్నారు. వీరిలో ముఖ్యంగా క్వింటన్ డికాక్, రబాడ, ఫాఫ్ డుప్లెసిస్‌లు తమతమ ఫ్రాంఛైజీల గెలుపోటములను ప్రభావితం చేయగల సత్తా ఉన్న ఆటగాళ్లు. డికాక్ గత సీజన్లో ముంబై ఇండియన్స్‌కు తరుపుముక్కగా నిలిచాడు. అతను ఆడిని 16 మ్యాచ్‌ల్లో 140.5 స్ట్రెక్‌రేట్‌తో 503 పరుగులు చేసి, ముంబై టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక ఫాఫ్ డుప్లెసిస్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. చెన్నై సూపర్ కింగ్స్ ప్రధాన ఆటగాళ్లలో ఒకడైన ఆయన గత సీజన్లో 13 మ్యాచ్‌ల్లో 40.81 సగటుతో 449 పరుగులు సాధించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న రబాడ.. గత రెండు సీజన్లలో 29 మ్యాచ్‌లాడి 55 వికెట్లు తీశాడు. గత సీజన్లో 17 మ్యాచ్‌లాడిన ఆయన 8.34 ఎకానమీతో ఏకంగా 30 వికెట్లు పడగొట్టాడు. ఫాస్ట్ బౌలర్లు అన్రిచ్ నోర్జ్, లుంగి ఎంగిడిలు సైతం వారివారి ఫ్రాంఛైజీల జయాపజయాలను ప్రభావితం చేయగల ఆటగాళ్లే. -
ఐపీఎల్ నుంచి రబడ ఔట్
న్యూఢిల్లీ: రేపటి నుంచి ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్–11కు దక్షిణాఫ్రికా పేసర్ రబడ దూరమయ్యాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్ తరఫున ఆడాల్సిన అతను గాయంతో ఈ సీజన్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. వెన్నునొప్పితో అతను మూడు నెలల పాటు ఆటకు దూరం కానున్నాడు. -
రబడ వచ్చేశాడు
కేప్‌టౌన్: దక్షిణాఫ్రికా– ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌కు మళ్లీ జీవం వచ్చింది! అద్భుతమైన బౌలింగ్‌తో రెండో టెస్టులో ఆసీస్ బ్యాట్స్‌మెన్ పని పట్టిన యువ పేసర్ కగిసో రబడ గురువారం నుంచి జరిగే మూడో టెస్టులో బరిలోకి దిగనున్నాడు. తనపై విధించిన రెండు టెస్టుల నిషేధంపై రబడ చేసిన అప్పీల్లో ఫలితం అతనికి అనుకూలంగా వచ్చింది. సోమవారం దాదాపు ఆరు గంటల పాటు రబడ విచారణ సాగింది. దక్షిణాఫ్రికాకు చెందిన ప్రఖ్యాత న్యాయవాది డాలి ఎంపొఫూ తమ పేసర్ తరఫున వాదించారు. పోర్ట్ ఎలిజబెత్ టెస్టులో ఆసీస్ కెప్టెన్ స్మిత్‌ను ఉద్దేశపూర్వకంగా తాను ఢీకొట్టలేదంటూ రబడ పదే పదే చెప్పాడు. ఈ వాదనతో ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ అప్పీల్ కమిషనర్ మైకేల్ హెరాన్ ఏకీభవించారు. వీడియోలో కూడా అతను కావాలని చేసినట్లుగా లేదని హెరాన్ తేల్చారు. దాంతో రబడపై విధించిన మూడు డీమెరిట్ పాయింట్ల శిక్షను ఒక డీమెరిట్ పాయింట్‌కు తగ్గించడంతో పాటు మ్యాచ్ ఫీజులో 25 శాతాన్ని మాత్రమే జరిమానాగా విధించారు. దాంతో రబడ డీమెరిట్ పాయింట్ల సంఖ్య ఆరుకు తగ్గింది. ఫలితంగా రెండు టెస్టుల నిషేధాన్ని ఐసీసీ ఎత్తివేసింది. రెండో టెస్టులో 11 వికెట్లతో సఫారీలకు విజయాన్ని అందించిన రబడ సిరీస్‌కు దూరమైతే ఆ జట్టు పరిస్థితి మిగిలిన రెండు టెస్టుల్లో ఇబ్బందికరంగా ఉండేది. అయితే తాజా తీర్పుతో సఫారీ సేన ఊపిరి పీల్చుకుంది. రేపటి నుంచి కేప్‌టౌన్‌లో మూడో టెస్టు జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి దక్షిణాఫ్రికాకు ఊరట లభించినా ప్రమాదం ఇంకా పూర్తిగా దాటిపోలేదు. పోర్ట్ ఎలిజబెత్ టెస్టులో స్మిత్ ఘటన తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో వార్నర్‌ను దూషించినందుకు మరో డీమెరిట్ పాయింట్ రబడ ఖాతాలో చేరింది. దాంతో ప్రస్తుతం అతని పాయింట్ల సంఖ్య ఏడు వద్ద నిలిచింది. మూడో టెస్టులో ఏ దశలోనైనా పరిధి దాటితే మరో పాయింట్ చేరి మళ్లీ నిషేధం పడవచ్చు. అందువల్ల రబడను అదుపులో ఉంచాల్సిన బాధ్యత డుప్లెసిస్, అతని సహచరులపైనే ఉంది. -
నంబర్‌వన్ బౌలర్ రబడ
దుబాయ్: ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో 11 వికెట్లు తీసి దక్షిణాఫ్రికాను గెలిపించిన పేసర్ కగిసొ రబడ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో 902 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. భారత స్పిన్నర్ అశ్విన్ రెండు స్థానాల్ని మెరుగుపర్చుకొని నాలుగో స్థానానికి ఎగబాకాడు. జడేజా మూడో ర్యాంకులోనే కొనసాగుతున్నాడు. బ్యాటింగ్ ర్యాంకుల్లో భారత కెప్టెన్ కోహ్లి రెండో స్థానంలో, పుజారా ఆరో ర్యాంకులో ఉన్నారు. టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్ అగ్రస్థానంలో, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా వరుసగా రెండు, మూడు ర్యాంకుల్లో ఉన్నాయి. -
దక్షిణాఫ్రికా ప్రతీకార విజయం
పోర్ట్ ఎలిజబెత్: సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో చావుదెబ్బ తిన్న దక్షిణాఫ్రికా వెంటనే కోలుకుంది. నాలుగో రోజే ముగిసిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా 6 వికెట్ల తేడాతో ఆసీస్‌ను చిత్తు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో సఫారీ జట్టు 22.5 ఓవర్లలో 4 వికెట్లకు 102 పరుగులు చేసి విజయాన్నందుకుంది. డివిలియర్స్ (28), ఆమ్లా (27), మార్క్రమ్ (21) చకచకా ఆడి పని పూర్తి చేశారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 180/5తో సోమవారం ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 239 పరుగులకు ఆలౌటైంది. ప్రధాన బ్యాట్స్‌మన్ మిషెల్ మార్‡్ష (45)ను తొలి ఓవర్లోనే రబడ క్లీన్‌బౌల్డ్ చేయడంతో కంగారూల పతనం ప్రారంభమైంది. 37 పరుగుల వ్యవధిలో ఆసీస్ మిగిలిన ఆరు వికెట్లు చేజార్చుకుంది. టిమ్ పైన్ (28 నాటౌట్) కొద్దిగా పోరాడాడు. తొలి ఇన్నింగ్స్‌లాగే మరోసారి చెలరేగిన రబడ 54 పరుగులకే 6 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని కుప్పకూల్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో 139 పరుగుల ఆధిక్యాన్ని కోల్పోయిన ఆసీస్ దక్షిణాఫ్రికాకు 101 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ టెస్టులో మొత్తం 11 వికెట్లు తీసిన రబడ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. మూడో టెస్టు ఈ నెల 22 నుంచి కేప్‌టౌన్‌లో జరుగుతుంది. రబడ ఖేల్ ఖతం పేసర్‌పై రెండు టెస్టుల నిషేధం కేవలం 28 టెస్టుల కెరీర్... నాలుగో సారి మ్యాచ్‌లో పది వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికా తరఫున స్టెయిన్, ఎన్తిని తర్వాత ఆ ఘనత సాధించిన బౌలర్ కగిసో రబడ అత్యద్భుత బౌలింగ్ గణాంకాలు ఇవి. పోర్ట్ ఎలిజబెత్‌లో ఆస్ట్రేలియా పని పట్టిన ఈ యువ బౌలర్ తన ఆగ్రహాన్ని మాత్రం అదుపులో ఉంచుకోలేక తనను, తన జట్టును తీవ్రంగా నష్టపరిచాడు. దక్షిణాఫ్రికా భయపడినట్లుగానే రబడపై 2 మ్యాచ్‌ల నిషేధం పడింది. ఈ సిరీస్‌లో 15 వికెట్లతో చెలరేగిన రబడ తాజా ఐసీసీ శిక్షతో ఈ సిరీస్‌లోని తర్వాతి రెండు టెస్టులకు దూరమయ్యాడు. అతనిపై మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా కూడా విధించారు. తొలి ఇన్నింగ్స్‌లో స్మిత్ భుజాన్ని ఉద్దేశపూర్వకంగా ఢీకొన్న ఘటనపై ఆదివారం సాయంత్రమే రిఫరీ ముందు విచారణకు హాజరైన రబడ దానికి కొద్ది సేపు ముందే మరో తప్పు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో వార్నర్‌ను బౌల్డ్ చేసిన తర్వాత అతని వైపు చూస్తూ తీవ్రంగా అరిచాడు. దీనికి సంబంధించి రబడపై సోమవారం లెవల్–1 ఫిర్యాదు నమోదైంది. స్మిత్ ఘటన లెవల్–2 కాబట్టి 3 డీమెరిట్ పాయింట్ల శిక్ష పడింది. జనవరి 2017 నుంచి వేర్వేరు ఘటనల్లో (డిక్వెలా, స్టోక్స్, ధావన్‌లతో గొడవ) ఇప్పటికే ఐదు డీమెరిట్ పాయింట్లు ఈ పేసర్ ఖాతాలో ఉన్నాయి. దాంతో పాయింట్ల సంఖ్య ఎనిమిదికి చేరి రెండు టెస్టుల నిషేధం పడింది. వార్నర్ ఘటనలో కూడా 15 శాతం మ్యాచ్ ఫీజు జరిమానాతో పాటు 1 డీమెరిట్ పాయింట్‌ను ఐసీసీ శిక్షగా విధించింది. దాంతో రబడ మొత్తం పాయింట్ల సంఖ్య 9కి చేరింది. -
రబడకు 5 వికెట్లు
పోర్ట్ ఎలిజబెత్: ఆస్ట్రేలియాతో శుక్రవారం ప్రారంభమైన రెండో టెస్టులో పేస్ బౌలింగ్ త్రయం చెలరేగింది. రబడ (5/96), ఇన్‌గిడి (3/51), ఫిలాండర్ (2/25) ప్రత్యర్థిని దెబ్బ తీశారు. ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 243 పరుగులకే ఆలౌటైంది. వార్నర్ (100 బంతుల్లో 63; 9 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం తొలి రోజు ఆట ముగిసే సరికి దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 39 పరుగులు చేసింది. మార్క్రమ్ (11) ఔట్ కాగా...ఎల్గర్ (11 బ్యా టింగ్), రబడ (17 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్‌కు ఓపెనర్లు వార్నర్, బెన్‌క్రాఫ్ట్ (38) శుభారంభం అందించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 98 పరుగులు జోడించారు. అయితే 19 పరుగుల వ్యవధిలో ఆసీస్ 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. నాలుగో వికెట్‌కు 44 పరుగులు జోడించి స్మిత్ (25), షాన్ మార్‡్ష (24) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ స్థితిలో రబడ అద్భుత స్పెల్ ఆటను మలుపు తిప్పింది. కేవలం 18 బంతుల తేడాతో అతను ఐదు వికెట్లు తీసి కంగారూల వెన్ను వెరిచాడు. స్మిత్, షాన్ మార్‡్షలతో పాటు మిషెల్ మార్‡్ష (4), కమిన్స్ (0), స్టార్క్ (8)లను రబడ పెవిలియన్ పంపించాడు. ఒక దశలో 182/8తో ఆసీస్ ఇన్నింగ్స్ తొందరగానే ముగిసేలా కనిపించింది. అయితే వికెట్ కీపర్ టిమ్ పైన్ (36) సఫారీలను అడ్డుకున్నాడు. లయన్ (17), హాజల్‌వుడ్ (10 నాటౌట్) సహకారంతో మరిన్ని పరుగులు జోడించాడు. చివరి 2 వికెట్లకు ఆసీస్ 61 పరుగులు చేయడం విశేషం. -
ఆరుసార్లు అతడికే..
జోహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా పర్యటనలో భారత ఓపెనర్ రోహిత్ శర్మ వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. టెస్టుల్లోనే కాక వన్డేల్లోనూ అతను ఘోరంగా విఫలమవుతున్నాడు. రెండు టెస్టుల్లో వరుసగా 11, 10, 10, 47 పరుగులు చేసి మూడో టెస్టుకు జట్టులో చోటు కోల్పోయిన రోహిత్.. తనకు మంచి రికార్డున్న వన్డేల్లో సైతం మరింత పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. ఆరు వన్డేల ద్వైపాక్షిక సిరీస్‌లో ఇప్పటివరకూ సఫారీలతో జరిగిన నాలుగు వన్డేల్లో రోహిత్ నమోదు చేసిన స్కోర్లు 20, 15, 0, 5. ఈ పర్యటనలో ఇప్పటిదాకా ఎనిమిది ఇన్నింగ్స్‌లు ఆడిన రోహిత్.. ఆరుసార్లు దక్షిణాఫ్రికా యువ ఫాస్ట్‌బౌలర్ కాగిసో రబడా బౌలింగ్‌లోనే అవుట్ కావడం గమనార్హం. 145 కిలోమీటర్లకు తగ్గని వేగంతో బంతులేసే రబడా దెబ్బకు రోహిత్ విలవిల్లాడుతున్నాడు. అయితే శనివారం రోహిత్ అవుటైన బంతి అంత కష్టమైందేమీ కాదు. యార్కర్, గుడ్ లెంగ్త్ మిక్సింగ్ డెలవరీకి డ్రైవ్ చేయబోయిన రోహిత్ శర్మ.. రబాడకే దొరికేశాడు. ఒకవైపు తన లాగే ఫాస్ట్ పిచ్‌లపై ఆడలేడని పేరున్న ధావన్ వన్డేల్లో నిలకడగా రాణిస్తుండగా.. రోహిత్ మాత్రం తీవ్రంగా నిరాశపరుస్తూ తన స్థానాన్ని ప్రశ్నార్థకం చేసుకునే పరిస్థితిని కొనితెచ్చుకున్నాడు. తదుపరి రెండు వన్డేల్లో రోహిత్ కనుక నిరాశపరిస్తే మాత్రం అతన్ని కొన్నాళ్లపాటు పక్కన పెట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదు. టీమిండియా జట్టులో నెలకొన్న పోటీ నేపథ్యంలో సఫారీలతో రెండు వన్డేలు రోహిత్‌కు చాలా కీలకం. -
ఈ ఏడు ‘కింగ్ ఆఫ్ ది బౌలర్’ ఎవరు..?
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెస్టు క్రికెట్ బౌలర్లలో ఈ ఏడు తీవ్ర పోటీ నెలకొంది. అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో అగ్రస్థానం కోసం ఐదుగురు బౌలర్లు తీవ్రంగా పోటీపడుతున్నారు. ఈ ఏడాది పూర్తి కావడానికి మరో నెలరోజుల సమయం ఉండటంతో ఆ స్థానం ఎవరి దక్కుతుందనే విషయంపై క్రికెట్ అభిమానుల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గతేడాది ఏకపక్షంగా 72 వికెట్లతో అశ్విన్ ఈస్థానం దక్కించుకోగా.. రంగనా హెరాత్ 57 వికెట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతానికి దక్షిణాఫ్రికా పేసర్ కేఎస్ రబడ 54 వికెట్లతో ప్రథమ స్థానంలో ఉండగా.. శ్రీలంక స్పిన్నర్ రంగనా హెరాత్ 52, ఆసీస్ స్పిన్నర్ లియోన్ నాథన్ 50, భారత్ స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్ 48, రవీంద్ర జడేజా 47 వికెట్లతో రేసులో ఉన్నారు. అయితే దక్షిణాఫ్రికా బౌలర్ రబడాకు అంతగా అవకాశం కనిపించడం లేదు. దక్షిణాఫ్రికా డిసెంబర్ 26న జింబాబ్వేతో ఏకైక టెస్టు మాత్రమే ఆడనుంది. ఈ ఏకైక టెస్టు తర్వాత కొత్త సంవత్సరంలోనే భారత్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక అగ్రస్థానం దక్కించుకునే అవకాశం ఆసీస్ ప్లేయర్ లియోన్‌కు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంకా మూడు టెస్టులు ఆడే అవకాశం లియోన్‌కు ఉంది. కానీ ఈ సిరీస్ స్పిన్‌కు అంతగా అనుకూలించని ఆస్ట్రేలియాలో జరుగుతోంది. ఉపఖండ పిచ్‌లపై రెచ్చిపోయే అశ్విన్, జడేజాలకు ఇంకా ఒక ఇన్నింగ్స్, పూర్తి టెస్ట్ మ్యాచ్ ఆడే అవకాశం ఉంది. కానీ భారత్ దక్షిణాఫ్రికా పర్యటనను దృష్టిలో ఉంచుకొని పేస్ పిచ్‌లు సిద్దం చేస్తుండటంతో ఈ జోడి అంతగా ప్రభావం చూపలేకపోతుంది. హెరాత్‌కు కూడా ఇదే పరిస్థతి. శ్రీలంకతో ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్టులో లంక రెండో ఇన్నింగ్స్‌లో, మూడో టెస్టులో ఈ ద్వయం రెచ్చిపోతే అగ్రస్థానం కైవసం చేసుకోవడం అంత కష్టేమేమి కాదు. -
ఢిల్లీ నుంచి రబడ, మోరిస్, మాథ్యూస్ ఔట్
న్యూఢిల్లీ: వచ్చేనెలలో జరిగే చాంపియన్స్‌ట్రోఫీలో తమ జట్ల తరఫున ఆడేందుకు వీలుగా కగిసో రబడ, క్రిస్ మోరిస్ (దక్షిణాఫ్రికా), ఏంజెలో మాథ్యూస్ (శ్రీలంక) ఐపీఎల్ జట్టు ఢిల్లీ డేర్‌డెవిల్స్ నుంచి సోమవారం వైదొలిగారు. ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలంటే మిగతా 3 మ్యాచ్‌ల్లో నెగ్గాల్సిన స్థితిలో నిలిచిన ఢిల్లీకి ఇది ఎదురుదెబ్బ అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం పట్టికలో 8 పాయింట్లతో ఉన్న ఢిల్లీ.. ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే మిగిలిన మూడు మ్యా చ్ల్లో నెగ్గడంతోపాటు ఇతర మ్యాచ్‌ల ఫలితాలు తనకు అనుకూలంగా ఉండాలి. ఈక్రమంలో తర్వాతి మ్యాచ్‌ను బుధవారం.. గుజరాత్ లయన్స్‌తో కాన్పూర్‌లో ఢిల్లీ ఆడనుంది. -
ఆసీస్ విజయలక్ష్యం 539
ప్రస్తుతం 169/4 దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు పెర్త్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా విజయం వైపు పయనిస్తోంది. 539 పరుగుల భారీ లక్ష్యంతో తమ రెండో ఇన్నింగ్స ఆరంభించిన ఆసీస్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 55 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోరుు 169 పరుగులు చేసింది. పేసర్ కగీసో రబడా (3/49) విజృంభణకు ఆసీస్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. ఉస్మాన్ ఖ్వాజా (120 బంతుల్లో 58 బ్యాటింగ్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేస్తున్నాడు. తొలి ఇన్నింగ్సలో తృటిలో శతకం కోల్పోరుున ఓపెనర్ డేవిడ్ వార్నర్ (33 బంతుల్లో 35; 6 ఫోర్లు)ను అద్భుత ఫీల్డింగ్‌తో బవుమా రనౌట్ చేయడం దెబ్బతీసింది. ప్రస్తుతం క్రీజులో ఖ్వాజాతో పాటు మిషెల్ మార్ష్ (15 బ్యాటింగ్) ఉండగా చివరి రోజు సోమవారం ఆసీస్ మరో 370 పరుగులు చేయాల్సి ఉంది. అటు సఫారీల విజయానికి మరో ఆరు వికెట్లు చాలు. అంతకుముందు ప్రొటీస్ తమ రెండో ఇన్నింగ్‌సను 160.1 ఓవర్లలో 8 వికెట్లకు 540 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఫిలాండర్ (143 బంతుల్లో 73; 10 ఫోర్లు, 2 సిక్సర్లు), డి కాక్ (100 బంతుల్లో 64; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుగ్గా ఆడారు. హాజెల్‌వుడ్, సిడిల్, మార్ష్‌లకు రెండేసి వికెట్లు దక్కారుు. -
రబడకు 6 అవార్డులు
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా క్రికెట్ వార్షిక అవార్డుల్లో పేస్ బౌలర్ కాగిసో రబడ హవా కొనసాగింది. ఈ ఏడాది ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ సహా అతను మొత్తం ఆరు అవార్డులు సొంతం చేసుకున్నాడు. దక్షిణాఫ్రికా చరిత్రలో ఒక ఆటగాడు ఆరు అవార్డులు గెలుచుకోవడం ఇదే తొలిసారి. గతంలో డివిలియర్స్, ఆమ్లా ఒకే ఏడాది ఐదు అవార్డులు నెగ్గారు. టెస్టు క్రికెటర్, వన్డే క్రికెటర్, ప్లేయర్స్ ప్లేయర్, ఫ్యాన్స్ ప్లేయర్, టి20 అత్యుత్తమ బంతి అవార్డులు రబడకు దక్కాయి. కేవలం టి20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు మాత్రం ఇమ్రాన్ తాహిర్‌కు లభించింది. 2015-16 సీజన్లో సఫారీల ప్రధాన బౌలర్లు స్టెయిన్, ఫిలాండర్ వరుస గాయాలతో ఇబ్బంది పడిన సందర్భంలో రబడ ప్రధాన పేసర్‌గా జట్టును ముందుండి నడిపించాడు. -
'ధోనికి బౌలింగ్ చేయడాన్ని ఎంజాయ్ చేశా'
ముంబై: ఐదు వన్డేల సిరీస్ ల భాగంగా కాన్పూర్ లో జరిగిన తొలి వన్డే చివరి ఓవర్ లో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి బౌలింగ్ చేయడాన్ని తాను బాగా ఎంజాయ్ చేశానని దక్షిణాఫ్రికా పేసర్ రబడా తెలిపాడు. ఆ ఓవర్ లో విజయానికి 11 పరుగులు చేయాల్సిన తరుణంలో ధోని నాలుగు బంతులు ఆడి పెవిలియన్ చేరాడు. కేవలం రబడా వేసిన ఓవర్ లో మూడు పరుగులు మాత్రమే రాబట్టిన ధోని పెవిలియన్ కు చేరాడు. దాంతో ధోనిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆఖరి ఓవర్ ఫైట్ లో ధోనిపై రబడా విజయం సాధించాడంటూ మీడియా కొనియాడింది. కాగా, భారత్ తో జరిగిన మొత్తం వన్డే సిరీస్ లో ఆ ఓవర్‌నే తాను ఎక్కువగా ఆస్వాదించానని రబడా తెలిపాడు. 'నిజంగా అది చాలా ఒత్తిడితో కూడుకున్న ఓవర్. తొలుత చివరి ఓవర్ ను నేను చేయకూడదనిఅనుకున్నా. కెప్టెన్ ఏబీ డివిలియర్స్ నాపై నమ్మకంతో ఆ ఓవర్ ను నాకే ఇచ్చాడు. ఆ ఓవర్ లో ధోనిని పూర్తిగా కట్టడి చేశా. ధోనికి పరుగులు ఇవ్వకుండా ఆపడమే కాకుండా వికెట్ కూడా దక్కించుకున్నా. నాకు పూర్తి స్థాయిలో నమ్మకం కల్గించిన ఓవర్ అది' అని రబడా పేర్కొన్నాడు..ఆ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా ఐదు వికెట్ల నష్టానికి 303 పరుగులు చేయగా, టీమిండియా ఏడు వికెట్లు కోల్పోయి 298 పరుగులకే పరిమితమై ఓటమి చెందింది.